బోధన్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్‌లోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోధన్‌లోని రైల్వే సమస్యలపై విద్యార్ధి నాయకుడు శివ కుమార్ మాట్లాడారు. నిజాం కాలం నుండి పట్టాలు ఉన్నా రైళ్లు మాత్రం నడవకపోవడం బాధాకరమని, బోధన్ రైళ్ల ద్వారా నెలకు 3 కోట్ల ఆదాయం ఉన్నా బోధన్ ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు అందించక పోవడంలో మర్మం ఏమిటో రైల్వే …
Read More »వందశాతం కరోనా టీకాలు పూర్తి
నారాయణ ఖేడ్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నారాయణఖేడ్ మండలంలోని చల్లగిద్ద తాండలో వందశాతం కరోన టీకాలు పూర్తయినట్లు నారాయణఖేడ్ ఎంపీపీ కర్ర చాందీ భాయి చౌహన్ అన్నారు. బుధవారం చల్లగిద్ద తాండలో వ్యాక్సిన్ కేంద్రాన్ని ఎంపీడీఓ వెంకటేశ్వర రెడ్డి తుర్కపల్లి ఆస్పత్రి వైద్యులు రాజేష్‌తో కలసి సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ మండలంలో వంద శాతం కరోన వ్యాక్సిన్ వేసుకున్న మొదటి గ్రామపంచాయతి అని, దీనిని …
Read More »పంట నష్టం వివరాలు సేకరణ
నారాయణ ఖేడ్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలు సేకరించడం జరిగిందని ఏ.డీ.ఏ కరుణాకర్ రెడ్డి అన్నారు. బుధవారం పంటలు పరిశీలనలో భాగంగా మనూర్ మండలం పులకుర్తి గ్రామ శివారులో మండల ఏ.వో శ్రీనివాస్ రెడ్డితో కలసి పత్తి, చెరకు పంటలను పరిశీలించిన సందర్బంగా మాట్లాడారు. భారీ వర్షాలు కురిసి దెబ్బతిన్న పంటల వివరాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు …
Read More »వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోండి
నిజామాబాద్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెండు రోజులపాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ప్రజలు అంటురోగాల బారిన పడకుండా నివారణ కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుండి సంబంధిత అధికారులతో సెల్ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ వర్షాలతో పారిశుద్ధ్యం పేరుకుపోయి ఉండే అవకాశం ఉందని అదేవిధంగా ప్రజల ఆవాసాలలో …
Read More »ఆరోగ్య ఉప కేంద్రాల వారిగా వ్యాక్సినేషన్ పూర్తిచేయాలి…
కామారెడ్డి, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరోగ్య ఉప కేంద్రాల వారీగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం రాత్రి టెలీ కాన్ఫరెన్సులో మాట్లాడారు. గ్రామాల వారిగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలు, ఇంకా తీసుకోవాల్సిన వారి వివరాలు సేకరించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఉపాధి హామీ వర్క్ ఫైలు …
Read More »రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కలెక్టరేట్‌లో పనిచేసే రెవిన్యూ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో టిఆర్‌ఈఎస్‌ఎ అధ్యక్షుడు మోతిసింగ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉద్యోగులు రంజిత్ కుమార్, సోపియన్ పాల్గొన్నారు.
Read More »ఉపాధి హామీ వర్క్ ఫైళ్ళ పరిశీలన
కామారెడ్డి, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి మండల కేంద్రంలోని నర్సరీని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ఎంపీడీవో కార్యాలయం సమీపంలో ఉన్న పల్లె ప్రకృతి వనంను పరిశీలించారు. మొక్కలు వృక్షాలు పెరిగి పచ్చదనాన్ని సంతరించుకున్నాయని పేర్కొన్నారు. ఉపాధి హామీ వర్క్ ఫైళ్లను పరిశీలించారు. ఇసన్నపల్లిలోని పల్లె ప్రకృతివనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపిడిఓ విజయ్ కుమార్, ఎంపిఓ సవిత, ఏపీఓ ధర్మారెడ్డి, …
Read More »వ్యాక్సినేషన్ వందశాతం పూర్తిచేయాలి…
కామారెడ్డి, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం గర్గుల్ పల్లె ప్రకృతి వనం, పాఠశాల ప్రకృతి వనం, కోతుల ఆహార కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. పల్లె ప్రకృతి వనంలో పిచ్చిమొక్కలు లేకుండా చూడాలన్నారు. మొక్కలకు సేంద్రియ ఎరువులు వేయాలని సూచించారు. పాఠశాల పకృతి వనంలో ఉన్న వ్యాయామ పరికరాలను పరిశీలించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ గ్రామంలో 100 శాతం …
Read More »బృహత్ పల్లె ప్రకృతి వనం పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజంపేట మండలం శివాయిపల్లిలో బృహత్ పల్లె ప్రకృతి వనంను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సందర్శించారు. రైల్వే వంతెన కింద వరద నీరు నిలిచి ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. వైకుంఠ రథం, బాడీ ఫ్రీజర్‌ను పరిశీలించారు. రాజంపేటలో ఊర చెరువు కట్ట కుంగిపోయింది. భారీ వర్షాల కారణంగా చెరువు కట్ట కుంగిపోయిందని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి …
Read More »కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
ఆర్మూర్, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని 34వ వార్డులో ఎమ్మెల్యే పియుసి చైర్మన్ ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు లబ్దిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పిఎసిఎస్ వైస్ చైర్మన్ నర్మేనవీన్, సర్వ సమాజ్‌అధ్యక్షులు మహేష్, టిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పండిత్ ప్రేమ్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ …
Read More »