NizamabadNews

బిజినెస్ మేనేజ్ మెంట్, న్యాయ విభాగాలను సందర్శించిన వీసీ

డిచ్‌ప‌ల్లి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ రిజిస్ట్రార్ ఆచార్య నసీం, ప్రిన్సిపల్ డా. వాసం చంద్రశేఖర్ తో కలిసి గురువారం ఉదయం బిజినెస్ మేనేజ్ మెంట్, న్యాయ శాస్త్ర విభాగాలను సందర్శించారు. మొదట బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగాన్ని సందర్శించిన వీసీ విభాగం అధ్యాపకులందరిని పరిచయం చేసుకున్నారు. విభాగంలో ఇది వరకు జరిగిన పరిశోధనలను, నూతన ఆవిష్కరణలను …

Read More »

జిల్లా క‌లెక్ట‌ర్‌కు విద్యార్థి సంఘాల విన‌తి

కామారెడ్డి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జనసమితి కామారెడ్డి జిల్లా ఇన్చార్జి కుంభాల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ ఈ నెల 20 న కామారెడ్డి జిల్లా కేంద్రానికి సీఎం వస్తున్న సందర్భంగా జిల్లాలో మెడికల్ కళాశాల తో పాటు ఇంజనీరింగ్ …

Read More »

సొంత బ్యాంక్ భవనాన్ని నిర్మించుకోవాలి

డిచ్‌ప‌ల్లి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ను గురువారం ఉదయం ఆయన చాంబర్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (నిజామాబాద్, అదిలాబాద్) మన్యం శ్రీనివాస్ టీయూ బ్రాంచ్ మేనేజర్ పవన్ ప్రసన్న కుమార్ కలిసి పుష్పగుచ్చంతో సన్మానం చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వీసీ ఎ జి ఎం తో …

Read More »

పెండింగ్ ప‌నులు త్వ‌ర‌గా పూర్తి చేయాలి

నిజామాబాద్‌, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ నగర పరిధిలో అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నగర ప్రజలకి అవసరమైన సేవ లని అందించాలని, ఫుట్ పాత్ ల నిర్మాణం, డివైడర్ ల నిర్మాణం, సెంటర్ మీడియం లైట్ల పనుల పురోగతి మరియు నిర్వహణ గురించి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల పలు సూచనలు చేశారు. మున్సిపల్ అధికారులు, ఆర్అండ్‌బి అధికారులు, ఎల‌క్ట్రిసిటీ అధికారులతో గురువారం …

Read More »

ఉపకులపతి ని కలిసిన ఆర్య వైశ్య ప్రముఖులు

డిచ్‌ప‌ల్లి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ను మోటూరి మురళి గుప్తా ఆర్య వైశ్య, మహాసభ రాష్ట్ర కార్యదర్షి, మాణిక్ భవన్ స్కూల్ అధ్యక్షులు, రావులపల్లి జగదీశ్వర్ గుప్త మణిక్ భవన్ కార్యదర్షి, మంకలి విజయ కుమార్ గుప్తా ఆర్య వైశ్య మహాసభ జిల్లా కార్యదర్షి, చిదుర శ్రీనివాస్ గుప్తా ఆర్య వైశ్య యువజన సంఘం జిల్లా …

Read More »

ఆప‌ద‌లో ఆక్సీజ‌న్‌…

కామారెడ్డి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః గురువారం షబ్బీర్అలీ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని అవుసుల కాలనీకి చెందిన రాఘవాపురం గోదావరికి ఆక్సీజ‌న్ అంద‌జేశారు. అనారోగ్యంతో బాధపడుతూ దవాఖాన లో చేరగా, చికిత్స అనంతరం శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా యున్నందున, డాక్టర్ల సలహా మేరకు ఆక్సిజన్ అవసరమేర్ప‌డింది. ఆమె భర్త బ్రహ్మ చారి మహమ్మద్ అలీ షబ్బీర్ కి ఫోన్ చేయగా వెంటనే స్పందించి …

Read More »

సీజనల్ వ్యాధుల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి..

కామారెడ్డి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః సీజనల్ వ్యాధులు తలెత్తకుండా గ్రామాలు, మున్సిపాలిటీలలో పారిశుద్ధ్యం చర్యలు పక్కాగా నిర్వహించాలని, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, నాటిన మొక్కలకు సంరక్షణ చేపట్టాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా కలెక్టర్ లకు సూచించారు. బుధవారం ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర …

Read More »

అర్బ‌న్ పార్కుకు స్థ‌ల ప‌రిశీల‌న‌

కామారెడ్డి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి పట్టణంలోని 18వ వార్డులో రోడ్లను, మురుగు కాలువలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ బుధవారం పరిశీలించారు. రోడ్లకు ఇరువైపుల మురుగు కాలువలను పూడిక తీయించి శుభ్రపరచాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటాలని సూచించారు. కొత్తగా అర్బన్ పార్క్ ఏర్పాటు చేయడానికి స్థలాన్ని పరిశీలించారు. ఇందిరాగాంధీ స్టేడియం చుట్టూ మొక్కలు నాటాలని మున్సిపల్ అధికారులకు …

Read More »

అధికారుల‌తో స‌మ‌గ్ర స‌మీక్ష‌

కామారెడ్డి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ముఖ్యమంత్రి రాక సందర్భంగా జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, వివరాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులతో సమీక్షించారు. బుధవారం జనహిత భవన్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ధాన్యం కొనుగోలు, మిషన్ భగీరథ ఇంటింటికి మంచినీరు, హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ వివరాలు, నర్సరీల …

Read More »

భారీగా గుట్కా, జ‌ర్దా స్వాధీనం – నిందితుల అరెస్ట్‌

నిజామాబాద్, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బోధన్ పోలీసు స్టేష‌న్‌ సమీపంలో మారుతి ఓమిని వాహనంలో అక్రమంగా గుట్కా, జర్ధా వున్నదని విశ్వ‌స‌నీయ‌ సమాచారం మేరకు దాడులు చేశారు. సుమారు 7,00,000 (ఏడు లక్షలు) రూపాయ‌ల‌ విలువ చేసే గుట్కా, జర్ధా స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన‌ట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు. ప‌ట్టుకున్న గుట్క, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »