కామారెడ్డి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మంగళవారం మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్ కామారెడ్డి పట్టణంలో కోవిడ్ కారణంగా చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ నాయకులు మీర్ ఇంత్యాజ్ అలీ, ఎర్రం నరసయ్య, అఫ్జల్, ఖదీర్, అతీక్, గడిల నర్సింలు, ప్రతిభా రమేష్, తదితరుల కుటుంబాలను పరామర్శించి వారి కుటుంబాలను ఓదార్చారు. కరోనా మహమ్మారి ఆప్తులను …
Read More »పరిపాలన సౌలభ్యం కోసం సంస్కరణలు
కామారెడ్డి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిందని రాష్ట్ర శాసన సభా పతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్, ఎస్పి భవన సముదాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన సౌలభ్యం కోసం సంస్కరణలు తీసుకువచ్చారని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి అనేక సంక్షేమ పథకాలను …
Read More »జైలు నుండి జర్నలిస్ట్ రఘు విడుదల
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఈ నెల 3వ తేదీన మార్కెట్‌లో పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఇంటి నుండి వెళ్ళిన రఘును మఫ్టీలో వచ్చిన పోలీసులు వెంబడించి బలవంతంగా అరెస్ట్ చేసి కారులో తీసుకు వెళ్లిన సంగతి తెలిసిందే. తర్వాత పోలీసులు కుట్ర పూరితంగా అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 13 రోజుల తరువాత రఘును బెయిల్ పై మంగళవారం విడుదల చేసారు. ఈ సందర్భంగా తెలంగాణ …
Read More »రామాయణంలో కుంభకర్ణుడి లా వ్యవహరిస్తున్నాడు
కామారెడ్డి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లా నూతన కార్యాలయాలు ప్రారంభోత్సవానికి వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుకి గత ఎన్నికల సమయంలో కామారెడ్డి పట్టణానికి వచ్చేసి చేసిన వాగ్దానాలను గుర్తు చేస్తూ పూర్తిచేయాలని డిమాండ్ చేస్తూన్నామని మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలి షబ్బీర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం షబ్బీర్ అలీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన …
Read More »కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలి
కామారెడ్డి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బిజెవైఎంను సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు కలిసి పని చేయాలని, బూత్ స్థాయిలో బీజేవైఎం కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల అనంత కృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం భారతీయ జనతా యువ మోర్చా కామారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశము జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్స్ లో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా …
Read More »కామారెడ్డికి నూతన విద్యాసంస్థలు వచ్చేంత వరకు పోరాటం
కామారెడ్డి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జిల్లా విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. గతంలో కేసీఆర్ హామీ ఇచ్చిన విధంగా కామారెడ్డి జిల్లాను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దాలని, జిల్లా కు మెడికల్ కళాశాల లతోపాటు ఇంజనీరింగ్, పాలిటెక్నిక్,ఐటిఐ …
Read More »సుభాషితం
కందపద్యం చిల్లర వేల్పుల గొల్చుట, కల్లలు బల్కంగ దక్కు గౌరవహీనం బుల్లంబందున విరిసిన మల్లెలవలె సుగుణరాశి మహిలో నిల్చున్!! అభిశ్రీ (సుప్పని సత్యనారాయణ)
Read More »పంచాంగం – 15, జూన్ 2021
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం ఆయనం : ఉత్తరాయణం మాసం : జ్యేష్ఠమాసం ఋతువు : గ్రీష్మ ఋతువు కాలము : వేసవికాలం వారము : మంగళవారం పక్షం : శుక్లపక్షం తిథి : పంచమి (ఆదివారం రాత్రి 10 గం॥ 32 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 53 ని॥ వరకు) నక్షత్రం : ఆశ్లేష (ఆదివారం రాత్రి 8 గం॥ 34 ని॥ నుంచి …
Read More »ద్విచక్ర వాహనాలతో పోలీసు పెట్రోలింగ్
నిజామాబాద్, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్తీకేయ ఆదేశాల మేరకు నిజామాబాద్ డివిజన్ పోలీస్ సిబ్బంది నిజమాబాద్ నగరంలోని మాలపల్లి, అర్సపల్లి, హైమద్ పుర కాలనీ, కొజ్జా కాలనీ, ఖిల్ల రోడ్, వర్ని చౌరస్తా, ఆర్.ఆర్. చౌరస్తా, బడా బజార్, గోల్ హనుమాన్, పులాంగ్ రోడ్, రుక్మిణీ ఛాంబర్, నెహ్రూ పార్క్ తదితర ప్రాంతాల్లో సోమవారం రాత్రి ద్విచక్ర వాహనాల …
Read More »నేతన్నకు చేయూత – పునః ప్రారంభం
హైదరాబాద్, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్రంలోని నేతన్నలకు చేయూతగా నిలిచిన పొదుపు పథకం “నేతన్నకు చేయూత” కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు టెక్స్ టైల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సోమవారం ప్రగతి భవన్ లో జరిగిన టెక్స్ టైల్ శాఖ సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని చేనేత, మరమగ్గ కార్మికులు ఈ పొదుపు పథకంలో భాగస్వామలు కావచ్చని మంత్రి కేటీఆర్ …
Read More »