కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్లు అర్హులైన లబ్దిదారులకు రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారంకలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు బ్యాంకులు 32 శాతం లక్ష్యాలను సాధించాయని, క్రెడిట్ ప్లాన్ లక్ష్యం మేరకు రెండవ త్రైమాసికం నాటికీ 50 శాతం లక్ష్యాలను సాధించేలా …
Read More »నిజామాబాద్ ఐటీ హబ్‌లో కంపెనీని స్థాపించండి
హైదరాబాద్, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్‌లో కంపెనీని స్థాపించాలని అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచీ గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ గురు కమకొలను, కంటెంట్ ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రసిడెంట్ కృష్ణ మోహన్ వీరవల్లి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో హైదరాబాద్‌లో భేటీ …
Read More »జూలై 10 నుండి బియ్యం పంపిణీ
కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :ఆహారభద్రత కార్డులో పేరున్న ఒక వ్యక్తికి ఆరు కిలోల బియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగా జులై 10 వ తేదీ నుంచి పంపిణీ చేస్తుందని జిల్లా సివిల్ సప్లయ్ అధికారిని పద్మ తెలిపారు. రేషన్ డీలర్లు బియ్యం అర్హత గల లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేయాలని ఆమె కోరారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
Read More »మళ్లీ టమాటా మంట -సెంచరీ దాటిన పచ్చిమిర్చి
హైదరాబాద్, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టమాటా రేటు మరోసారి మండిపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కిలో టమాటా రూ.80 నుంచి రూ. 100 పలుకుతోంది. ఇక పచ్చిమిర్చి రేటు ఇంతకంటే ఎక్కువగా ఉంది. కిలో పచ్చిమిర్చి రూ.120 కి పైగా ధర పలుకుతోంది. ఇవి హోల్ సేల్ మార్కెట్ ధరలు కాగా.. రిటైల్‌గా అమ్మే అంగళ్ళలో వీటి ధరలు మరింత …
Read More »పారిశ్రామిక రంగంతో నిరుద్యోగ యువతకు ఉపాధి
కామారెడ్డి, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అత్యధిక మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేవి పారిశ్రామిక, వ్యవసాయ రంగాలేనని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పారిశ్రామిక ప్రగతి ఉత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయ రంగం …
Read More »పారిశ్రామిక ప్రగతి ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తి
నిజామాబాద్, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వరాష్ట్రంలో గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో వివిధ రంగాలలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని అవలోకనం చేసుకుంటూ, మరింత ఉత్సాహంగా ముందుకు సాగాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు దినోత్సవం, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ విజయోత్సవ కార్యక్రమాలను …
Read More »కామారెడ్డి వాసులకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు సేవలు
కామారెడ్డి, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బ్యాంకులు ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని స్టేషన్ రోడ్ లో బుధవారం హెచ్డిఎఫ్సి బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయదారులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, జాహ్నవి, …
Read More »ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ప్రభుత్వాల ప్రోత్సాహం
నిజామాబాద్, ఏప్రిల్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలుగా ప్రోత్సాహం అందిస్తున్నాయని జిల్లా అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి పథకం – తయారీ సంస్థలు క్రమబద్ధీకరణ కింద జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక రాజీవ్ …
Read More »వరిధాన్యం నీటిపాలు.. రైతు బతుకు కన్నీటిపాలు
ఎడపల్లి, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరుగాలం కష్టమంతా వృధా అయింది. రాత్రింబవళ్లు పడిన శ్రమంతా నీటిపాలైంది. అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చింది. వరణుడి ప్రకోపం.. రైతులకు తీరని శోకాన్ని కలిగించింది. శుక్రవారం అర్థరాత్రి నుంచి ఉదయంవరకు కురిసిన భారీ వర్షం .. కర్షకులకు కడగండ్లు మిగిల్చాయి. వేల ఎకరాల్లో పంట నేలవాలింది. ఆరబోసిన ధాన్యం నీట మునిగింది. ధాన్యపు రాశులన్నీ కళ్ల …
Read More »ఉచిత శిక్షణ ఉపాధి కల్పన
కామారెడ్డి, ఏప్రిల్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండల కేంద్రంలో దేవునిపల్లి, విద్యుత్ నగర్‌లో ఉన్న అక్షయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ టెక్నాలజీ ద్వారా గ్రామీణ మహిళలకు గృహినీలకు స్వయం ఉపాధి శిక్షణ సంస్థగా అక్షయ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో లేడీస్ టైలరింగ్ మగ్గం వర్క్, బ్యూటీ పార్లర్ మెహేంది డిజైనింగ్, కోర్సులలో అత్యంత ఆధునిక పద్ధతి ద్వారా అనగా కరెంటు మిషన్స్ ద్వారా ప్రొజెక్టర్ డిజిటల్ …
Read More »