agriculture

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాలి

నిజామాబాద్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు ఆరుగాలం శ్రమించి పండిరచిన పంట చేతికందిన దశలో దురదృష్టవశాత్తు కురుస్తున్న అకాల వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లుతోందని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అధికార యంత్రాంగం యావత్తు రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తూ, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామనే భరోసాను కల్పించాలని సూచించారు. …

Read More »

నర్సరీ నిర్వహణ తీరుపై కలెక్టర్‌ అసంతృప్తి

నిజామాబాద్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పచ్చదనం పెంపొందించడంలో భాగంగా నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని కేశాపూర్‌ గ్రామంలో నెలకొల్పిన హరితహారం నర్సరీ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడం పట్ల కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేశాపూర్‌ లో కలెక్టర్‌ శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా, పక్కనే ఉన్న నర్సరీని గమనించి అక్కడికి వెళ్లి పరిశీలించారు. నర్సరీలో విత్తనాలు మొలకెత్తకపోవడం, మొక్కలు …

Read More »

ధాన్యం తరలింపును వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి సేకరిస్తున్న ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు కేంద్రాల నిర్వాహకులు, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని కేశాపూర్‌, డిచ్‌పల్లి మండలంలోని బర్దిపూర్‌ గ్రామాలలో సహకార సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ శుక్రవారం అదనపు కలెక్టర్‌ …

Read More »

తడిసిన ధాన్యానికి ప్రభుత్వమే మద్దతు ధర కల్పించాలి

రెంజల్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత వారం పది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా తడిసి ముద్దయి మొలకెత్తిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కోశాధికారి, మాజీ మంత్రివర్యులు పొద్దుటూరు సుదర్శన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం మండలంలోని దూపల్లి, వీరన్న గుట్ట, రెంజల్‌, సాటాపూర్‌ గ్రామాలలో తడిసి ముద్దయిన ధాన్యపురాసులు, మొలకెత్తిన …

Read More »

కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు

కామారెడ్డి, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ పరిశీలించారు. తడిచిన ధాన్యాన్ని చూశారు. ఆరబెట్టిన ధాన్యాన్ని శుభ్రపరచి కొనుగోలు కేంద్రంలో విక్రయించాలని సూచించారు. రైతులు తమ ధాన్యాన్ని వర్షాల నుంచి కాపాడుకోవాలని పేర్కొన్నారు. కుప్పలపై టార్పాలిన్‌ కవర్లు చెప్పాలని తెలిపారు. జిల్లా సహకార శాఖ అధికారిని వసంత, అధికారులు పాల్గొన్నారు.

Read More »

తడిసిన ధాన్యాన్ని తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశం

కామారెడ్డి, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో గురువారం యాసంగి ధాన్యం కొనుగోళ్లపై బాన్సువాడ నియోజకవర్గం మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు దించుకోవాలని తెలిపారు. తడిసిన ధాన్యం ను తీసుకోకపోతే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. లక్ష్యానికి అనుకూలంగా మిల్లింగ్‌ చేయాలని …

Read More »

రైతును నిలువు దోపిడి చేస్తున్న రైస్‌ మిల్లర్లు…

బాన్సువాడ, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల నిస్సహాయతను ఆసరా చేసుకున్న రైస్‌ మిల్లర్లు తరుగు పేరిట అధికార పార్టీ నాయకులు, అధికారుల అండదండలతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్‌ కాసుల బాలరాజ్‌ అన్నారు. బుధవారం కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తన ఉనికిని కాపాడుకోవడానికి కొనుగోలు …

Read More »

ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి

రెంజల్, మే 2 నిజామాబాదు న్యూస్ డాట్ ఇన్ : ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతుకు అకాల వర్షంతో తీవ్ర నష్టం వాటిల్లిడంతో భారీ ఎత్తున నష్టపోయారని తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని బోధన్ నియోజకవర్గ ఇన్చార్జ్ వడ్డీ మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు బిజెపి ఆధ్వర్యంలో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. …

Read More »

పంట నష్టం వివరాలు సేకరించాలి

కామారెడ్డి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :వడగళ్ల వానతో పంట నష్టం జరిగిన రైతుల వివరాలను వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం టెలికాన్ఫరెన్స్‌ ద్వారా మండల స్థాయి అధికారులతో పంట నష్టం వివరాలపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, వ్యవసాయ, సహకార శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పంట నష్టం వివరాలను సేకరించాలని పేర్కొన్నారు. టెలికాన్ఫరెన్స్లో …

Read More »

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిక్కనూర్‌ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో సోమవారం అకాల వర్షంతో దెబ్బతిన్న వరి పంటను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని సూచించారు. నష్టపోయిన రైతుల వివరాలు డాటా ఎంట్రీ చేయించాలని తెలిపారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »