రెంజల్, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు పండిరచిన ధాన్యాన్ని దళారుల పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ రజినీ కిషోర్ అన్నారు.బుధవారం రెంజల్, వీరన్నగుట్ట గ్రామాల్లో సొసైటీ మరియు ఆగ్రో రైతుసేవ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీటీసీ మేక విజయ సంతోష్,విండో చైర్మన్ మోహినోద్దీన్ తో కలిసి ప్రారంభించారు. …
Read More »ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తాం
రెంజల్, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు పండిరచిన ప్రతి ధాన్యపు గింజలను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని విండో చైర్మన్ భూమరెడ్డి,సర్పంచ్ సాయరెడ్డి అన్నారు.సోమవారం దూపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ప్రతి రైతు తాము పండిరచిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే …
Read More »ప్రతి ఎకరాకు సాగు నీరు…
వేల్పూర్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఎకరాకు సాగు నీరు అందించడమే సీఎం కేసిఆర్ ధ్యేయమని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం బాల్కొండ నియోజకవర్గంలోని ప్యాకేజీ 21 ద్వారా సాగునీరు అందించే పనుల పురోగతిని మంత్రి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఉదయం 10 గంటలకు మొదలై సుమారు నాలుగు గంటల పాటు మండుటెండలో పొలాల నడుమ …
Read More »తేనెటీగల పెంపకం చేపట్టాలి
కామారెడ్డి, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెండు మండలాల్లో తేనెటీగల పెంపకం కోసం మహిళా సంఘాలను ఎంపిక చేసి లబ్ధిదారులను గుర్తించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. గాంధారి, రాజంపేట మండలాల్లో అటవీ ప్రాంతం అధికంగా ఉన్నందున తేనెటీగల పెంపకం స్వయం సహాయక సంఘాల మహిళలతో చేపట్టాలని చెప్పారు. కార్యక్రమంలో డిఆర్‌డిఓ సాయన్న, జిల్లా ఉద్యానవన అధికారి విజయభాస్కర్, జిల్లా వ్యవసాయ అధికారిని …
Read More »చీడపీడలు, తెగులు నివారణపై రైతులకు అవగాహన
గాంధారి, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండల పరిధిలోని గండివెట్ గ్రామములో రైతులకు యూరియా వాడకంపై మరియు వివిధ చీడపీడల, తెగులు నివారణపై శుక్రవారం మండల వ్యవసాయ అధికారి అవగాహన కల్పించారు. పంట పొలాల్లో యూరియా అధికంగా వాడితే తెగుళ్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని, అదే విధంగా తెగుళ్ల నివారణ ఖర్చులు పెరుగుతాయి కాబట్టి రైతులు తగినంత యూరియా మత్రమే వాడాలని సూచించారు. …
Read More »నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా రుణాల పంపిణీ జరగాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆయా రంగాలకు రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ప్రత్యేకించి నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమైనందున పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల …
Read More »ఎర్రజొన్న కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకూడదు
నిజామాబాద్, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎర్రజొన్న కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్కెట్ రేటుకు అనుగుణంగా ధరను చెల్లిస్తూ పంటను సేకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సీడ్ కంపెనీల ప్రతినిధులకు సూచించారు. ఎర్రజొన్న దిగుబడులు చేతికందుతున్న నేపథ్యంలో, కలెక్టర్ సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్లో విత్తన వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. రైతులతో కుదుర్చుకున్న బైబ్యాక్ ఒప్పందానికి కట్టుబడి …
Read More »ఎర్రజొన్న కొనుగోళ్లలో బైబ్యాక్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
నిజామాబాద్, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆయా మండలాల్లో రైతులు సాగు చేసిన ఎర్రజొన్న పంటను బైబ్యాక్ ఒప్పందానికి అనుగుణంగా సీడ్ వ్యాపారులు కొనుగోలు చేసేలా క్షేత్ర స్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి …
Read More »రైతులు స్వయం సమృద్ధి చెందడమే ఎఫ్‌పివోల లక్ష్యం
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశంలో వ్యవసాయం రంగం కీలకమైనదని దాని మీద ఆధారపడి భూమిని నమ్మిన సన్న చిన్న కారు రైతులు వ్యవసాయం చేస్తున్నపుడు భూమికి ఎపుడు ఏమి కావాలని అడుగుతు సకాలంలో దానికి అవసరం అయినవి అందిస్తూ ఎన్ని ఇబందులు ఉన్న అందులో వచ్చే ఫల సాయంతో బతుకుతున్నారు, అలాంటి వారిని స్వయం సమృద్ధి పరచడం, వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాడడం …
Read More »పోడు భూముల ప్రక్రియ సత్వరమే పూర్తి చేయాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోడు భూములకు సంబంధించిన ప్రక్రియను ఈ నెల 15 వ తేదీ లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన దృష్ట్యా, నిర్దేశిత గడువుకంటే ముందే అన్ని విధాలుగా సన్నద్ధమై ఉండాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలు వెలువడిన వెంటనే అర్హులైన వారికి ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలను అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని …
Read More »