నిజామాబాద్, డిసెంబరు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారంసందర్శించారు. ఎమ్మెల్యేలు పి.సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, వేముల …
Read More »సంక్రాంతి తరువాత రైతు భరోసా విడుదల చేస్తాం…
నిజాంసాగర్, డిసెంబరు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వస్తుందో అలాంటి పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిజాం సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువ ద్వారా రెండవ పంటలకు నీటిని ఆయన విడుదల చేసారు. ఈ సందర్భంగా నిజాంసాగర్ ప్రాజెక్టు ను ఆయన సందర్శించారు. విశ్రాంతి భవనం …
Read More »పత్తి పంటను వెంటనే కొనుగోలు చేయాలి…
కామారెడ్డి, డిసెంబరు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు పండిరచిన పత్తి పంటను జిన్నింగ్ మిల్లులో వెంటనే కొనుగోలు చేయాలనీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం మద్నూర్ మండల కేంద్రంలో సిసిఐ కృష్ణ నేచురల్ ఫైబర్ ప్రైవేటు లిమిటెడ్ జిన్నింగ్ మిల్లును కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన పత్తినీ తేమశాతం పరిశీలించి కొనుగోలు చేయాలని …
Read More »బిందుసేద్యం పరికరాలపై వంద శాతం రాయితీ
కామారెడ్డి, డిసెంబరు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ సౌజన్యంతో కామారెడ్డి జిల్లాలో రైతులు ముందస్తుగా భూసార పరీక్షలు చేయించుకుని అనంతరం మల్బరీ పంటను సాగు చేసుకోవాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారిణి జ్యోతి అన్నారు. బిక్కనూర్ మండలం జంగంపల్లి రైతు వేదికలో మంగళవారం రైతు నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మల్బరీ …
Read More »మల్బరీ సాగు వైపు దృష్టి పెట్టాలి
కామారెడ్డి, డిసెంబరు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మల్బరీ సాగు వైపు దృష్టి పెట్టాలని ప్రాంతీయ పట్టు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వినోద్ కుమార్ యాదవ్ అన్నారు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో బిక్కనూరు మండలం జంగంపల్లి రైతు వేదికలో సోమవారం కొత్త రైతులకు మల్బరీ, పట్టుపురుగుల పెంపకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త డాక్టర్ వినోద్ కుమార్ యాదవ్ …
Read More »రైస్‌మిల్లర్లు అగ్రిమెంట్లు సమర్పించాలి…
కామారెడ్డి, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రస్తుత 2024-25 సంవత్సరం సి.ఎం.ఆర్. కోసం రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీ, అగ్రిమెంట్లు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని రైస్ మిల్లుల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం సి.ఎం.ఆర్. కోసం మిల్లుల యజమానులు బ్యాంక్ గ్యారంటీ, అగ్రిమెంట్లు వెంటనే సమర్పించాలని తెలిపారు. …
Read More »ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా వెంటదివెంట టాబ్ ఎంట్రీలు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. టాబ్ ఎంట్రీలలో నిర్లక్ష్యానికి తావిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ గురువారం సందర్శించారు. రైతుల నుండి సేకరించిన …
Read More »వివరాలు నమోదు చేయని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి…
కామారెడ్డి, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ట్యాబ్ ఎంట్రీలు వెంటది వెంట నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) తో కలిసి ధాన్యం కొనుగోళ్లు, ట్యూబ్ ఎంట్రీలు, రైతులకు చెల్లింపు అంశాలపై కలెక్టర్ పౌరసరఫరాల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చిన …
Read More »వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, పాఠశాలల్లో విద్యార్థులకు అందించే భోజనం, అల్పాహారం కలుషితం కాకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. భోజనం వండడానికి ముందే ప్రతీ రోజు క్రమం తప్పకుండా ఆహార పదార్థాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, నాసిరకం, నాణ్యతా లేమితో కూడిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని …
Read More »కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొనుగోలు చేసిన వరి పంటను కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని, ట్యాబ్ ఎంట్రీ త్వరగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం నిజాంసాగర్ మండలం వెల్గనూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన దొడ్డు ధాన్యంను కాంటా చేసిన తర్వాత సంబంధిత రైస్ మిల్లులకు తరలించడం …
Read More »