బాల్కొండ, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త విద్యాదాత ఏనుగు దయానంద రెడ్డి సౌజన్యంతో సుమారుగా 1000 మంది మహిళా నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం జాబ్ మేళాను చిట్టాపూర్ గ్రామంలోని వసంత ఫంక్షన్ హాల్‌లో ఈనెల 23న ఆదివారము 11:00 గంటల నుండి నిర్వహిస్తున్నట్లు యునైటెడ్ నేషన్స్ ఆఫ్ యూత్ ఆర్గనైజేషన్, దక్షిణ ఆసీయా …
Read More »వ్యాధి నిరోధక టీకాలు తప్పకుండా అందేలా చూడాలి
ఆర్మూర్, ఫిబ్రవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యాధి నిరోధక టీకాలు ప్రతి ఒక్క చిన్నారికి అందే విధంగా చూడాలని హెల్త్ సూపర్వైజర్ అనసూయ కుమారి ఆదేశించారు. బుధవారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేశారు. అదేవిధంగా రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాధి నిరోధక టీకాల లబ్ధిదారుల జాబితాను ముందస్తుగా తయారు చేసుకుని ప్రతి చిన్నారికి టీకాలు …
Read More »జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
బాల్కొండ, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. మంగళవారం ఆయన బాల్కొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో పని చేయాలని హితవు పలికారు. రిసెప్షన్ సెంటర్, ఇన్ పేషంట్, ఫిమేల్, …
Read More »సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఆర్మూర్, ఫిబ్రవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ఆరోగ్య ఉప కేంద్రం ఆధ్వర్యంలో సోమవారము ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సిబ్బంది ప్రజలకు సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెచ్ ఈ ఓ రవి మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. …
Read More »ఆహారకల్తీ మహమ్మారిపై చైతన్య సదస్సు
ఆర్మూర్, ఫిబ్రవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు పౌడపెల్లి అనిల్, జిల్లా ఉపాధ్యక్షుడు రాజుల రామనాధంల ఆద్వర్యంలో ఆర్మూర్ అంగన్వాడీ కేంద్రాల్లో ఆహార కల్తీ – అయోడిన్ ఉప్పులో ప్లాస్టిక్ అంశముపై చైతన్య సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి మాట్లాడుతూ, ఆహార కల్తీ మహమ్మారి రోజు రోజుకు …
Read More »సమాజం గర్వించే పౌరులుగా తీర్చిదిద్దాలి
ఆర్మూర్, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చెడు వ్యసనాలతో చిత్తవుతున్న యువతను సమాజం గర్వించే పౌరులుగా తీర్చిదిద్దాడానికి మేధావులు, విద్యావంతులు, రైతులందరు కలిసి రావాలని ఈరవత్రి రాందాస్ ఎడ్యుకేషనల్ ట్రస్టు చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ మండలం సుర్భిర్యాల్, గ్రామంలో ఆదివారం ఈ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘హోటల్ కాడికి పోదాం జన సమూహంతో కలుద్దాం’ అనే కార్యక్రమం నిర్వహించారు. …
Read More »ఆలయ భూమిపూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
ఆర్మూర్, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూరు మండల కేంద్రంలో నిర్మించనున్న వెయ్యి నామాల వెంకటేశ్వర స్వామి ఆలయ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేయాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి శనివారం ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఆలయ ప్రాంగణం స్వయంభుగా వెలసిన పవిత్ర క్షేత్రం కావడంతో, భక్తుల విశ్వాసాన్ని మరింత పెంచేలా ఆలయ నిర్మాణాన్ని వేగంగా …
Read More »యువ గర్జన పోస్టర్ల ఆవిష్కరణ
ఆర్మూర్, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో తెలంగాణ మాదికులకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ మాదిగ విద్యార్థి గర్జన పోస్టర్లను, కమిటీ చైర్మన్ సాయిబాబాగౌడ్‌తో పాటు ఎంఆర్పిఎస్ నాయకులు పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాదిగ జేఏసీ జిల్లా ఇన్చార్జ్ అవార్డు గ్రహీత మోతే భూమన్న మాట్లాడుతూ మాదిగ నవ …
Read More »స్పోర్ట్స్ కిట్స్ వితరణ
ఆర్మూర్, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణ శివారులో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఇఆర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఫౌండేషన్ సొసైటీ చైర్మన్ ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈ. రాజ శేకర్ సుమారు రూ. 20 వేల విలువ గల స్పోర్ట్ (ఆట వస్తువులు) పరికరాలను కళాశాల ప్రిన్సిపల్ విజయానంద్ రెడ్డి కోరికమేరకు ఈఆర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యంలో వితరణ …
Read More »సిఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేసిన వినయ్‌రెడ్డి
ఆర్మూర్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామంలో సీఎంఆర్‌ఎఫ్ 60,000 చెక్కును ఆర్మూర్ నియోజవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ రెడ్డి ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు ఎవరైనా అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అయిన ఖర్చులను సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఇప్పించడం జరుగుతుందన్నారు. అనారోగ్యం బారిన పడి వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న …
Read More »