Armoor

శ్రీరాంసాగర్‌ 26 గేట్లు ఎత్తివేత

నిజామాబాద్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా అతలాకుతలమయింది. ఎడతెరిపి లేని ముసురువానకు నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దీంతో ఇరు జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలకు రోడ్లు తెగిపోవడం శిథిలావస్థలో ఇల్లు కూలిపోవడంతో పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు …

Read More »

ఒక్క సీసీ కెమెరా 100 పోలీసులతో సమానం – సి పి నాగరాజు

ఆర్మూర్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ గ్రామంలో 45 సిసి కెమెరాలను సిపి నాగరాజు ప్రారంభించారు. బుధవారం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సిసి కెమెరాలను సిపి కే ఆర్‌ నాగరాజు ప్రారంభించారు. గ్రామస్తులను ద్దేశించి సిపి నాగరాజు మాట్లాడుతూ సీసీ కెమెరాలు నేర నియంత్రణకు ఎంతగానో దోహద పడ్తాయన్నారు. గ్రామంలో ప్రతి ఇంటీకి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్తులకు …

Read More »

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

మాక్లూర్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మాక్లుర్‌ మండలం గొట్టుముక్కల గ్రామంలో అప్పుల వారి వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఎస్సై యాదగిరి గౌడ్‌ కథనం మేరకు కారం నడిపి భూమన్న (51) ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలిపారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్‌ఐ అన్నారు.

Read More »

గ్రామ దేవతలకు గంగాభిషేకం

ఆర్మూర్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం ఆలూర్‌ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కాలినడకన గోదావరి నందికి వెళ్లి గంగ నీళ్ళు తీసుకువచ్చి డబ్బుల సప్పుడుతో ఆలూర్‌లో గ్రామ దేవతలకు గంగ నీళ్లు సమర్పించారు. ఊర్లో వర్షాలు పడి, పాడిపంటలు గ్రామ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు మామిడి రాంరెడ్డి, ఉపాధ్యక్షులు కుర్మె సతీష్‌, …

Read More »

ఆపదలో ఉన్న స్నేహితునికి యూత్‌ సభ్యుల చేయూత

ఆర్మూర్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణానికి చెందిన తలారి హరీష్‌కు వారం కింద గుంటూరు వద్ద జరిగిన ప్రమాదంలో తీవ్రగాయాలైన హరీష్‌ను హైదరాబాద్‌లోని భృంగి హాస్పిటల్‌లో చికిత్స నిమిత్తం చేర్పించారు. అక్కడ వైద్యులు సూచనల మేరకు ఆపరేషన్‌ చేయాలని చెప్పడంతో అందుకు చాలా ఖర్చుతో కూడుకున్నదని బాధిత కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున సమాచారం తెలుసుకున్న మిత్రులు యూత్‌ ఆర్మూర్‌ సభ్యులు లక్ష …

Read More »

ఉద్యమ కాంక్ష కట్టలు తెంచుకుంది ఎస్సారెస్పీ కట్టమీదే

బాల్కొండ, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్ట్‌ గేట్ల మరమ్మత్తుల పనులను ఆదివారం రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రారంభించారు. సుమారు 17.40 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. డ్యాం మీద అధికారులతో,రైతులతో కలిసి కాలి నడకన కలియ తిరిగారు. ఈ …

Read More »

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పోరేట్‌ స్థాయి మార్పు కనిపించాలి

జక్రాన్‌పల్లి, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తూ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పనులతో ప్రభుత్వ పాఠశాలలు కార్పోరేట్‌ స్థాయి సదుపాయాలతో స్పష్టమైన మార్పును సంతరించుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. జక్రాన్‌పల్లి మండలం మనోహరాబాద్‌ గ్రామంలో కలెక్టర్‌ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామంలోని వైకుంఠధామం, డంపింగ్‌ యార్డ్‌, పల్లె …

Read More »

అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌ స్థలాన్ని పరిశీలించిన మంత్రి

భీమ్‌గల్‌, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గం భీంగల్‌ పట్టణానికి సమీపంలో లింబాద్రి లక్ష్మి నరసింహాస్వామి గుడి దగ్గర్లో అర్బన్‌ ఫారెస్ట్‌ కోసం రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. అటవీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి స్థల పరిశీలన ప్రాంతంలో మొక్కలు నాటి నీరుపోశారు. అర్బన్‌ పార్కుకు సంబంధించిన …

Read More »

2వ వార్డులో పట్టణ ప్రగతి పనులు

ఆర్మూర్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణ 2 వ వార్డులో పట్టణ ప్రగతిలో భాగంగా స్థానిక కౌన్సిలర్‌ సంగీత ఖాందేశ్‌ కాలోనిలో పర్యటించారు. కాలనీలో వున్న విద్యుత్‌ సమస్యలు, లాంగ్‌ సర్వీస్‌ వైర్లు వున్న చోట ఇంటర్‌ పోల్లు బిగించాలని లైన్‌ఇన్స్పెక్టర్‌ నరేందర్‌ నాయక్‌కు సూచించారు. అలాగే లైన్‌ మెన్‌ రామచందర్‌, శ్రీనివాస్‌కు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో విఆర్‌వో అమృతరావ్‌, సత్యానంద్‌ …

Read More »

‘దళిత బంధు’ తో స్వయం సమృద్ధి సాధించాలి

బాల్కొండ, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంతో లబ్ధిదారులు స్వయం సమృద్ధిని సాధించాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సూచించారు. దళితబంధుపథకం కింద తొలి విడతలో ఎంపికైన బాల్కొండ నియోజకవర్గ లబ్దిదారులకు గురువారం వేల్పూర్‌ మార్కెట్‌ యార్డు ఆవరణలో మంత్రి వేముల ఆయా యూనిట్లను …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »