బాన్సువాడ, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని బోర్లం గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలు, ఇటీవల జరిగిన సంఘటన దృష్ట్యా పాఠశాలలో భద్రత ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం సబ్ కలెక్టర్ కిరణ్మయికి విద్యార్థుల తల్లిదండ్రులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కమిటీ సభ్యులు మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో విద్యార్థులపై సరైన పర్యవేక్షణ లేదని, 20 సంవత్సరాలుగా ఫిట్నెస్ లేని వాచ్మెన్ …
Read More »తపస్ ఆధ్వర్యంలో సేవాలాల్ జయంతి వేడుకలు
బాన్సువాడ, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలో సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతిని పురస్కరించుకొని తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ కేవలం బంజరులకే కాకుండా అన్ని వర్గాలను అభివృద్ధి బాటలో నడిపించడానికి వారి జీవన విధానంలో మార్పులు తీసుకువచ్చిన …
Read More »పుల్వామా అమర జవానులకు నివాళి
బాన్సువాడ, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం స్వచ్ బాన్సువాడ టీం ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో స్వచ్ఛ బాన్సువాడ టీం వ్యవస్థాపక అధ్యక్షులు మోచి గణేష్, భవాని ప్రసాద్, యూనుస్, శంకర్ గౌడ్, హన్మండ్లూ, రాజు, శివ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Read More »జెఈఈలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అభినయ్
బాన్సువాడ, ఫిబ్రవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీకి చెందిన అభినయ్ ఇటీవల జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలలో 99.84 శాతం సాధించి ఉత్తమ ప్రతిభ కనబరచడంతో పలువురు ఆయనను అభినందించారు. అభినయ్ సమాజంలో ఉన్నత చదువులు చదివి మరింత ఎత్తుకు ఎదగాలని పలువురు ఆకాంక్షించారు.
Read More »ఆసుపత్రి ముందు కార్మికుల ధర్నా
బాన్సువాడ, ఫిబ్రవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ప్రభుత్వ ఏరియా, మాత శిశు ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు బకాయి వేతనాలను చెల్లించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం ఆస్పత్రి ముందు ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్ రాములు, కమర్ అలీ, రేణుక, సంతోష్ గౌడ్, సురేఖ, సంగీత, కళ్యాణి, గంగారం, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
Read More »బాన్సువాడకు సబ్ కోర్టు మంజూరు చేయాలి
బాన్సువాడ, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర హైకోర్టు జడ్జిలు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ అలిశెట్టిలకు బాన్సువాడకు సబ్ కోర్టు మంజూరు చేయాలని కోరుతూ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణమూర్తి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మూర్తి మాట్లాడుతూ సబ్ కోర్టు లేకపోవడం వల్ల డివిజన్ …
Read More »ఎమ్మెల్సీగా ఆశీర్వదించండి..
బాన్సువాడ, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధ్యాయుల సమస్య పరిష్కారానికి మండలిలో తన గొంతు వినిపిస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని శ్రీనివాస గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ …
Read More »అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం….
బాన్సువాడ, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యం అని, అర్హులైన వారిని గుర్తించడానికి గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగిందని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామంలో ప్రజా పాలన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డుల దరఖాస్తు నిరంతర ప్రక్రియని, రేషన్ కార్డుల …
Read More »ఆగ్రోస్ భూములను కాపాడడమే నా లక్ష్యం…
హైదరాబాద్, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్ రీస్ సంస్థకు సంబంధించిన భూములను కాపాడి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువచ్చి ఆగ్రో సంస్థను లాభాల బాటలు నడిపించడమే తన లక్ష్యమని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. బుధవారం హైదరాబాద్ మౌలాలిలోని 23 ఎకరాల 28 గుంటల భూమి ఉండగా మూడు ఎకరాల భూమి కబ్జాకు గురికావడంతో హైడ్రా అధికారులకు …
Read More »వార్డు సభల్లో పాల్గొన్న సబ్ కలెక్టర్
బాన్సువాడ, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులైన వారందరికీ ప్రజాపాలన కార్యక్రమం క్రింద లబ్దిచేకూర్చడం జరుగుతుందని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. బుధవారం బాన్సువాడ మున్సిపల్ వార్డ్ నెం. 8,9,10,11 లలో జరిగిన వార్డు సభల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి …
Read More »