banswada

పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం

బాన్సువాడ, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పది పరీక్షలకు ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. సాయంత్రం వేళ తరగతి గదుల్లో ఆకలితో ఇబ్బంది పడకుండా విద్యార్థులకు అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనిలో భాగంగా బుధవారం జిల్లా పరిషత్‌ ఉన్నత బాలుర పాఠశాల బాన్సువాడలో పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారాన్ని ఉపాధ్యాయులు అందించారు.ఈ …

Read More »

ఖేలో ఇండియాలో సత్తా చాటిన అక్క చెల్లెలు

బాన్సువాడ, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖెలో ఇండియా వింటర్‌ గేమ్స్‌లో తెలంగాణ నుంచి అండర్‌ 17 బాలికల జట్టు రజత పతకం గెలుచుకున్నారని అసోసియేషన్‌ అధ్యక్షుడు జిల్లా శ్రీనివాసరెడ్డి వెల్లడిరచారు. ఈ సందర్భంగా బిచ్కుంద మండలంలోని శాంతాపూర్‌ గ్రామానికి చెందిన నాగరాజు వాణి దంపతుల కుమార్తెలైన అక్క చెల్లెల్లు శ్రీనగర్‌ లోని ఐస్‌ పట్టణంలో జరిగిన ఖేలో ఇండియా ఐస్‌ స్కేటింగ్‌ క్రీడల్లో నేత్ర, …

Read More »

భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన భర్త

బాన్సువాడ, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాటికి పోయేవరకు కలిసి ఉంటామని ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న భార్య భర్తల మధ్య జరిగిన చిన్న పాటి గొడవ కారణంగా భార్యను అతి దారుణంగా గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. చాకలి గంగమణిని ఆమె భర్త గంగారం మంగళవారం మధ్యాహ్నం గొడ్డలితో మెడపై నరికి …

Read More »

బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో అమర సైనికులకు నివాళి

బాన్సువాడ, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2019 సంవత్సరం ఫిబ్రవరి 14 న పుల్వమా వద్ద ముష్కరుల ఘాతుకానికి బలైన నలభై మంది అమర సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ బాన్సువాడ పట్టణంలో బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మౌన ప్రదర్శన నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షుడు రాము రాథోడ్‌ మాట్లాడారు. ఉగ్రవాదుల దొంగ దెబ్బకు బలైన అమర …

Read More »

మత్తు పదార్థాల వినియోగంపై విద్యార్థులకు అవగాహన…

బాన్సువాడ, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గంజాయి మత్తు పదార్థాలను వినియోగించి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎక్సైజ్‌ ఎస్సై తేజస్విని అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని సాయికిరణ్‌, రేణుక ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ ఆధ్వర్యంలో డ్రగ్స్‌ మత్తుపదార్థాల వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్‌ ఎస్సై తేజస్విని మాట్లాడారు. గంజాయి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ తమ …

Read More »

బాలికల భవితకు భరోసా సుకన్య పథకం..

బాన్సువాడ, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా బాన్సువాడ పట్టణంలోని తపాలా శాఖ కార్యాలయ ఆవరణలో సబ్‌ డివిజనల్‌ తపాలా శాఖ ఇన్స్‌పెక్టర్‌ వేణు సుకన్య సమృద్ధి యోజన పథకం యొక్క విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తపాలా శాఖ ఆధ్వర్యంలో భారత స్వతంత్ర సమరయోధుల చిత్రాలతో …

Read More »

అగ్నిపథ్‌కు ఎంపికైన డిగ్రీ విద్యార్థి

బాన్సువాడ, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ఎస్‌ఆర్‌యన్‌కే డిగ్రీ కళాశాలకు చెందిన ద్వితీయ సంవత్సరం విద్యార్థి దాసరి వినోద్‌ కుమార్‌ అగ్ని వీరుడుగా ఎంపికైనందుకు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ గంగాధర్‌ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అగ్నిపత్‌ ఆర్మీ స్పోల్స్‌ భాగంగా కళాశాల నుండి విద్యార్థి ఎంపిక అవడం ఎంతో అభినందనీయమన్నారు. చదువుతోపాటు దేశ రక్షణలో యువత …

Read More »

కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీడీవో

బాన్సువాడ, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బోర్లమ్‌ క్యాంపులో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అందత్వ నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు శిబిరాల ద్వారా ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు కళ్లద్దాలను పంపిణీ చేయడం జరుగుతుందని ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి అన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటరామిరెడ్డి, స్థానిక సర్పంచ్‌, క్యాంప్‌ …

Read More »

అంబులెన్స్‌ లో ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ

బాన్సువాడ, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిచ్కుంద మండలంలోని పెద్దదేవడ గ్రామానికి చెందిన నర్సవ్వ ప్రసవానికి శుక్రవారం బాన్సువాడ మాత సంరక్షణ ఆసుపత్రికి రావడంతో వైద్యులు తగిన పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యంలో పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్‌ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అంబులెన్స్‌ సిబ్బంది శివకుమార్‌ తగిన జాగ్రత్తలు పాటిస్తూ సుఖ ప్రసాదం …

Read More »

బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి

బాన్సువాడ, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రి, మాత శిశు ఆసుపత్రిలో పని చేస్తున్న సెక్యూరిటీ, పేషెంట్‌ కేర్‌, శానిటేషన్‌ తదితర కార్మికులకు నాలుగు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని, జీవో 60 ప్రకారం 15 వేల 600 రూపాయలు చెల్లించాలని కోరుతూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ ప్రసాద్‌కు శనివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »