bodan

సాలుర పీ.హెచ్‌.సీని తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాలూర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఆయా విభాగాలను సందర్శించి, రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును పరిశీలించారు. అందుబాటులో ఉన్న మందుల స్టాక్‌, వైద్యులు, సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. ఇన్‌ పేషంట్‌ వార్డును సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను గమనించారు. రోగులను …

Read More »

జ్యోతిబా ఫూలే హాస్టల్లో రాత్రి బస చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ పట్టణంలో కొనసాగుతున్న ఎడపల్లి మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల బాలుర సంక్షేమ పాఠశాలలో కలెక్టర్‌ గురువారం రాత్రి బస చేశారు. పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్‌, విద్యార్థుల స్టడీ అవర్స్‌ కొనసాగుతుండడాన్ని గమనించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, విద్యా బోధన, రోజువారీ దినచర్య, మెనూ తదితర వివరాలను పాఠశాల ప్రిన్సిపాల్‌ జైపాల్‌ ను అడిగి …

Read More »

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీ సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. నిజామాబాద్‌, ఆర్మూర్‌ డివిజన్ల రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్‌ భవన్లో, బోధన్‌ డివిజన్‌ ఆర్‌.ఓలు, సహాయ ఆర్‌.ఓలకు బోధన్‌ పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో …

Read More »

వివరాలను వెంటదివెంట నమోదు చేయాలి

నిజామాబాద్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న సంక్షేమ పథకాలకు సంబంధించి క్షేత్రస్ధాయి పరిశీలన తో పాటు, గ్రామ సభల ద్వారా సేకరించిన వివరాలను వెంటదివెంట ఆన్‌ లైన్లో నమోదు చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. బోధన్‌ మండలం బండార్‌ పల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభ …

Read More »

ఆసుపత్రిలో అదనపు గదులు ప్రారంభం

బోధన్‌, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం స్థానిక శాసన సభ్యులు పి. సుదర్శన్‌ రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బోదన్‌ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో రూ. 15 లక్షలతో నిర్మించిన అదనపు గదులను ప్రారంభించారు. రూ. 66 లక్షలతో చేపట్టనున్న బోదన్‌ మండల ప్రజా పరిషత్‌ నూతన భవన నిర్మాణం పనులకు …

Read More »

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని బోధన్‌ పట్టణంలో గల సమీకృత బిసి బాలికల సంక్షేమ వసతి గృహంలో గురువారం రవాణా శాఖ మరియు రక్షణ శాఖ సంయుక్త సమన్వయంతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీనివాస్‌ ఏసిపి, మోటార్‌ వెహికల్‌ ఇన్స్పెక్టర్‌ శ్రీనివాస్‌ అలాగే బోధన్‌ పట్టణ సీఐ వెంకట నారాయణ, అసిస్టెంట్‌ బిసి డెవలప్మెంట్‌ ఆఫీసర్‌ నరసయ్య, …

Read More »

నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్‌

బోధన్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న అడ్వాన్స్డ్‌ టెక్నాలజీ సెంటర్స్‌ (ఏటీసీ) నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు సూచించారు. బోధన్‌ పట్టణ శివారులో నూతనంగా నిర్మిస్తున్న ఏటీసీ భవన సముదాయం నిర్మాణ పనులను కలెక్టర్‌ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు కేవలం బేస్‌ లెవెల్‌ వరకే నిర్మాణం పనులు జరగడాన్ని …

Read More »

సామాజిక న్యాయం కోసమే వరల్డ్‌ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌….

డా. కొప్పుల విజయ్‌ కుమార్‌ ఎడపల్లి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరల్డ్‌ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ అనేది సామాజిక న్యాయం కోసం నెల్సన్‌ మండేలా స్థాపించారని దీనిని ముందుకు తీసుకెళ్లేందుకు నేషనల్‌ ఛైర్మన్‌ డా . కొప్పుల విజయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో సమాజంలో సమస్యలపై పోరాటం చేస్తామని సౌత్‌ ఇండియా ఛైర్మన్‌ డా. గంప హన్మగౌడ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్‌ జస్టిస్‌ ఫర్‌ …

Read More »

డాక్టర్‌ హెడ్గేవార్‌ స్మృతి మందిర నిర్మాణానికి భూమి పూజ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ కేశవ సేవా సమితి ఆధ్వర్యంలో కందకుర్తిలో శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు స్వామి కమలానంద భారతి చేతుల మీదుగా డాక్టర్‌ హెడ్గేవార్‌ స్మృతి మందిర నిర్మాణానికి శనివారం ఉదయం 11 గంటలకు భూమి పూజ వైభవంగా జరిగింది. 1925లో స్థాపించబడిన రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘానికి 2025 నాటికి 100 సంవత్సరాలు పూర్తవుతున్న శుభ సందర్భంలో సంఘ శతాబ్ది ఉత్సవాల్లో …

Read More »

ఎడపల్లి పాఠశాలల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ఎడపల్లి, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గురువారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి రకరకాల పూలతో బతుకమ్మలను తయారుచేసి నూతన వస్త్రాలు ధరించిన విద్యార్థినిలు బతుకమ్మ ఆటలు ఆడారు. అలాగే జాన్కంపేట్‌ గ్రామంలోని ఇమేజ్‌ పాఠశాల, ఎడపల్లిలోని మాధవి, వాగ్దేవి పాఠశాలల్లో విద్యార్థుల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »