hyderabad

మెట్రో రైళ్ల సమయం పొడిగింపు…

హైదరాబాద్‌, డిసెంబరు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యూ ఇయర్‌ సందర్భంగా మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగిస్తున్నట్లు హైదరాబాద్‌ మెట్రో అధికారులు తెలిపారు. జనవరి ఒకటో తేదీ అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. మొదటి స్టేషన్‌లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో సర్వీసులు అందుబాటు ఉంటాయి. అలాగే చివరి స్టేషన్‌ చేరే వరకు అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో …

Read More »

ధాన్యం సేకరణలో నిజామాబాద్‌ నెంబర్‌ వన్‌

వివరాలు వెల్లడిరచిన పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ హైదరాబాద్‌, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం సేకరణ వివరాలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ గురువారం ఓ ప్రకటనలో వెల్లడిరచారు. 7011 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గానూ 4607 కొనుగోలు కేంద్రాల్లో ప్రక్రియ పూర్తై మూసివేసామని, నిన్నటివరకూ పది లక్షల నలబైవేల మంది రైతుల …

Read More »

ఏప్రిల్‌ 3 నుండి ఎస్‌ఎస్‌సి పరీక్షలు

హైదరాబాద్‌, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి పరీక్షలను ఏప్రిల్‌ 3 వ తేది నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడిరచారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను విడుదల చేయాలని ప్రభుత్వ పరీక్షల సంచాలకులను ఆదేశించారు. పదో తరగతి బోర్డు పరీక్షలు ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతీ పరీక్షకు మూడు గంటల …

Read More »

ప్రపంచంతో పోటీ పడేలా నాణ్యమైన విద్య

నిజామాబాద్‌, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ప్రభుత్వ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు హైదరాబాద్‌లో జరుగుతున్న ‘‘హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌’’ ఎగ్జిబిషన్‌లో 38వ నంబర్‌ స్టాల్‌లో తాము రచించిన పుస్తకాలను సందర్శనార్థం ఉంచారు. అది తెలిసిన మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి నవలా రచన చేసిన 12 మంది విద్యార్థినిలను తన అధికారిక నివాసంలో ప్రత్యేకంగా అభినందించారు. వారితో …

Read More »

గ్రూప్‌-2, గ్రూప్‌-4 పై ఉచిత అవగాహన సదస్సు

హైదరాబాద్‌, డిసెంబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో త్వరలో నిర్వహించబోయే గ్రూప్‌-2, గ్రూప్‌-4 పరీక్షలకు సన్నద్దమవుతున్న అభ్యర్థుల కోసం విజయసాధన స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఈ నెల 18, 19 తేదీలలో ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు డైరెక్టర్‌ కె.గంగా కిషోర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత అవగాహన సదస్సు దిల్‌సుఖ్‌ నగర్‌లోని తమ స్టడీ సర్కిల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. గ్రూప్స్‌ …

Read More »

తెలంగాణ జనరల్‌ నాలెడ్జ్‌

నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ.జవాబు : లాల్‌ బహదూర్‌ కాలువ. ‘అలీసాగర్‌’ ఎత్తిపోతల పథకం ఏ జిల్లాలో ఉంది.జవాబు : నిజామాబాద్‌. చెంచు తెగ ఎక్కువగా నివసించే జిల్లా.జవాబు : మహబూబ్‌నగర్‌. ‘గటుక’ అనే తెలంగాణ సంప్రదాయ ఆహారాన్ని దేనితో తయారుచేస్తారు.జవాబు : మొక్కజొన్న పిండి. చార్మినార్‌ వాస్తు శిల్పి ఎవరు.జవాబు : మీర్‌ మొమిన్‌ అస్త్రాబాది

Read More »

తెలంగాణ జనరల్‌ నాలెడ్జ్‌

‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా’ పాట రచయితజవాబు : గద్దర్‌. తెలంగాణ రాష్ట్ర పుష్పంజవాబు : తంగేడు. తెలంగాణ బిల్లు పాసైనపుడు రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌జవాబు : డాక్టర్‌ పి. జే.కురియన్‌. ‘నాగేటి చాళ్లల్ల నా తెలంగాణ’ అనే ప్రఖ్యాత గేయ రచయితజవాబు : నందిని సిధారెడ్డి. గోల్కొండ పత్రిక వ్యవస్థాపక సంపాదకులుజవాబు : సురవరం ప్రతాపరెడ్డి.

Read More »

వేములవాడలో తలనీలాలకు రూ.251

వేములవాడ, డిసెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొఘుల్‌ కాలంలో ఆఖరి చక్రవర్తి ఔరంగ జేబు రాజ్య విస్తరణకు ప్రజలపై వివిధ రకాల రూపంలో పన్నులు అంటే జుట్టు పెంచుకుంటే పన్ను కట్టేలా జిజియా పన్ను విధించారని, అదే పరిస్థితి వేములవాడలో కొనసాగుతుందని విశ్వహిందూ పరిషత్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా సహాయ కార్యదర్శి గడప కిషోర్‌ రావు ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ …

Read More »

పురుగులన్నం పెడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు

రంగారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సారూ మా పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయి. ఆ పురుగులన్నం తినబుద్దయితలేదు. అయినా అదే తినాలని మా టీచర్లు చెబుతున్నారు. తినకపోతే టీసీ ఇచ్చి ఇంటికి పంపుతరట. అందుకే ఇవాళ స్కూల్‌కు పోలే. వాళ్ల మీద కేసు పెట్టడానికి మీ కాడికి వచ్చిన’ ప్రశాంతిహిల్స్‌లో నివాసం ఉంటున్న శ్రీను కుమార్తె పూజిత స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాలుగో …

Read More »

గల్ఫ్‌ సమస్యలను పార్లమెంటులో లేవనెత్తాలి

నిజామాబాద్‌, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వ పరిధిలో పరిష్కరించగలిగిన గల్ఫ్‌ కార్మికుల సమస్యలను పార్లమెంటులో లేవనెత్తాలని తెలంగాణ ఎంపీలకు గల్ఫ్‌ వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి బుధవారం బహిరంగ లేఖ రాశారు. భారత ప్రభుత్వం దౌత్యపరంగా కృషి చేసి యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్‌ దేశాలను ఒప్పించి హైదరాబాద్‌లో కాన్సులేట్‌ (రాయబార దౌత్య కార్యాలయాలు) ఏర్పాటు చేయించాలని, హైదరాబాద్‌లో యూఏఈ కాన్సులేట్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »