హైదరాబాద్, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యునివర్సిటీ పరిధిలో సెప్టెంబర్ 28, 29 న జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా రెండు రోజుల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మిగిలిన తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలలో ఎటువంటి మార్పు లేదన్నారు. వాయిదా వేసిన పరీక్షల …
Read More »నవోదయలో ప్రవేశానికి దరఖాస్తులు…
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2022-23 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి నవంబర్ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 30న నిర్వహిస్తారు. విద్యార్థులు 2021-22లో ఐదో తరగతి చదివి ఉండాలి. విద్యార్థులు 1.5.2009 నుంచి 30.4.2013 మధ్య జన్మించి ఉండాలి. సంబంధిత జిల్లాలోని పభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో 3, 4వ తరగతులు చదివి ఉండాలి. దరఖాస్తులను …
Read More »రాష్ట్ర శాసనసభ భవనంలో ఐలమ్మ జయంతి
హైదరాబాద్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వర్గీయ ఐలమ్మ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ భవనంలోని ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్న భూపాల్ రెడ్డితో కలిసి రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాళులు అర్పించారు. పియుసి ఛైర్మన్ ఎ. జీవన్ రెడ్డి, లెజిస్లేటివ్ సెక్రటరీ …
Read More »25న జరగాల్సిన వివిధ పరీక్షలు వాయిదా…
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో శనివారం (సెప్టెంబర్ 25) నిర్వహించాల్సిన వివిధ పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల పరిధిలో ఎంఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్ష శనివారం నిర్వహించనుండడంతో ఆ రోజునాటి పరీక్షలు వాయిదా వేసినట్లు వివరించారు. పీజీఆర్‌ఆర్‌సీడీఈ ద్వారా అందించే పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ …
Read More »అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి…..
హైదరాబాద్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 26న చాకలి ఐలమ్మ జయంతిని అన్ని జిల్లాల్లో నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖకు, జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.
Read More »తెలంగాణకు కేంద్రమంత్రి హామీలు…
హైదరాబాద్, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశంలో తెలంగాణ రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతున్నందున వివిధ దేశాల నుంచి హైదరాబాద్‌కు విమాన ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో హైదరాబాద్ (శంషాబాద్) అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ, అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న మరో 6 విమానాశ్రయాల ఏర్పాటుకు …
Read More »ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా…
హైదరాబాద్, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మరికొద్ది రోజులు వాయిదా పడే అవకాశం ఉంది. ముందుగా ప్రకటించిన కాలపట్టిక ప్రకారం ఈనెల 4 నుంచి వెబ్ ఆప్షన్లు మొదలై 13తో ముగియాల్సి ఉంది. విద్యార్థులు ధ్రువపత్రాలను పొందేందుకు ఇబ్బందులు పడుతుండటంతో కౌన్సెలింగ్ గడువును పొడిగించాలని ఉన్నత విద్యామండలికి కొన్ని సంఘాలు వినతిపత్రాలు ఇచ్చాయి. దానికితోడు జేఎన్‌టీయూహెచ్ అనుబంధ గుర్తింపు ప్రక్రియ …
Read More »మౌనదీక్షకు తరలిరండి…
నిజామాబాద్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తీన్మార్ మల్లన్న అరెస్టుకు నిరసనగా తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ప్రశాంతంగా మౌనదీక్షకు తరలి రావాలని టిజేఎస్‌ఎస్ పిలుపునిచ్చింది. ఈ మేరకు టిజేఎస్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గౌటీ రామకృష్ణ బహిరంగ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం 11 గంటలకు గన్ పార్క్ వద్దగల అమరవీరుల స్థూపం వద్ద …
Read More »పట్టుబడితే సాధించలేనిది ఏదీ లేదు…
హైదరాబద్, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్ శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళితబంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుపడతానని, నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతానని ప్రకటించారు. దళితజాతి పేదరికంలో మగ్గిపోతూ సామాజిక వివక్షకు గురవడానికి …
Read More »తిరుమల కొండపై ఇకపై గోఆధారిత సంప్రదాయ భోజనం
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భక్తులకు తిరుమల కొండపై ఇకపై గోఆధారిత సంప్రదాయ భోజనం అందించనున్నారు. వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. త్వరలో పలుప్రాంతాల్లో భక్తులకు సాంప్రదాయ భోజనం అందుబాటులోకి రానుంది. ఆహార పదార్థాలు ఉత్పత్తికి అయ్యే ఖర్చుకు సమానమైన ధరకే భక్తులకు అందజేయాలని టిటిడి నిర్ణయించింది. అన్నమయ్య భవన్‌లో గురువారం ప్రయోగాత్మకంగా సంప్రదాయ భోజనం ప్రారంభించారు.
Read More »