హైదరాబాద్, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబడుతున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో రూ. 500 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. హుజూరాబాద్ సభ అనంతరం పైలట్ ప్రాజెక్టు అమలు కోసం మొత్తం రూ.2000 కోట్ల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే …
Read More »డిగ్రీ విద్యార్థులకు టీసీఎస్ అయాన్ శిక్షణ…
హైదరాబాద్, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగావకాశాలను పెంచేలా శిక్షణ ఇచ్చేందుకు టీసీఎస్ అయాన్‌తో ఉన్నత విద్యామండలి ఒప్పందం కుదుర్చుకుంది. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ సమక్షంలో ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, టీసీఎస్ అయాన్ గ్లోబల్ హెడ్ వెంగుస్వామి రామస్వామి ఒప్పందపత్రాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి, విద్యా …
Read More »ఎస్‌సి యువతకు ఉచిత శిక్షణ…
హైదరాబాద్, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ అభివృద్ధిలో భాగంగా ఎస్సీ నిరుద్యోగ యువతి, యువకులకు 18 నుంచి 35 సంవత్సరాల వారికి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జ్ఞాన సుధా ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ డి.శ్రీనివాసరావు తెలిపారు. త్రీడీ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, ఫొటోషాప్, కోరల్ డ్రా లతో పాటు లైఫ్ సైన్సెస్, సాఫ్ట్ స్కిల్స్, కోర్సులలో ఆరు నెలలపాటు శిక్షణ ఇంటర్, డిగ్రీ …
Read More »టీఎస్ ఎడ్‌సెట్-2021 దరఖాస్తు గడువు పొడిగింపు
హైదరాబాద్, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్‌సెట్ ఆన్‌లైన్ దరఖాస్తు గడవును మరోసారి పొడిగించారు. జూలై 31వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసిన నేపథ్యంలో పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 7 వరకు ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎడ్‌సెట్ కన్వీనర్ ఎ.రామకృష్ణ తెలిపారు. ప్రవేశ పరీక్షలను ఆగస్టు 24, 25 తేదీల్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. …
Read More »ఆర్థిక శాఖ మంత్రికి పిఆర్‌టియు విన్నపం
హైదరాబాద్, జూలై 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పిఆర్‌టియు తెలంగాణ రాష్ట్ర శాఖ, మాజీ రాష్ట్ర చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖమాత్యులు తన్నీరు హరీష్ రావుని కలిసి తక్షణమే ఐచ్చిక బదిలీలు, పదోన్నతులు కల్పించాలని డిఎస్‌సి-2003, సిపిఎస్ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింప చేయాలని కోరారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరింప చేస్తానని, …
Read More »పీజులు చెల్లించాలని విద్యార్ధులపై వత్తిడి తేవొద్దు
హైదరాబాద్, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులను ఒత్తిడికి గురి చేయవద్దని తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎస్‌ఆర్సీ) ఆయా ఇంజనీరింగ్ కాలేజీలకు సూచించింది. కరోనా పరిస్థితుల దృష్ట్యా విద్యార్థుల నుంచి కేవలం ట్యూషన్ ఫీజులను మాత్రమే వసూలు చేయాలని, అదీ కూడా దశల వారీగా తీసుకోవాలని ఆదేశించింది. ఈ విషయంలో మార్గదర్శకాలు పాటించని కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రిన్స్‌టన్ …
Read More »టీఎస్ ఎంసెట్ హాల్‌టికెట్లు విడుదల
హైదరాబాద్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఎంసెట్-2021) హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.in నుండి ఈ నెల 31 వరకు అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఎంసెట్‌కు 2.49 లక్షల దరఖాస్తులు అందాయి. వీటిలో ఇంజినీరింగ్‌కు 1.63 లక్షలు, వ్యవసాయ, ఫార్మాకు 85,828 దరఖాస్తులు వచ్చాయి. కాగా రూ.500 …
Read More »ఆర్టీసీ బస్సులో మంటలు
హైదరాబాద్, జూలై 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హన్మకొండ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధం అయ్యింది. వరంగల్ వన్ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ బస్టాండ్ వద్దకు చేరగానే బస్సు మోషన్ అందుకోవడం లేదని అనుమానం రావడంతో, బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను కిందకు దింపారు. అప్పటికే బస్సులో నుండి పొగలు …
Read More »వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి
నిర్మల్, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. నిర్మల్ పట్టణంలోని మంజూలా పూర్, మంచిర్యాల చౌరస్తా, సిద్దాపూర్, సోఫీ నగర్ జిఎన్‌ఆర్ …
Read More »తెలంగాణలోని పలు జిల్లాలకు అలర్ట్
హైదరాబాద్, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాగల 48 గంటల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, సిద్ధిపేట, కామారెడ్డి, వరంగల్, హన్మకొండ, అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ …
Read More »