కామారెడ్డి, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు, అధికారులు తమ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం జెడ్పి సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్పర్సన్ శోభ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా ప్రజా ప్రతినిధులు చూడాలని తెలిపారు. …
Read More »బాల్య వివాహాలు జరగకుండా అవగాహన కల్పించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టడంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలువాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం సాయంత్రం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు సామాజిక …
Read More »అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా అవగాహన
కామారెడ్డి, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సయ్యద్ మహమూద్ అలీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శాంతి థియేటర్, బాంబే క్లాత్, ఎల్విఆర్ షాపింగ్ మాల్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సయ్యద్ మహమ్మద్ అలీ మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాలు సందర్భంగా ఈనెల 14 తేదీ నుండి 20వ తేదీ వరకు …
Read More »మహిళా సమ్మన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీంలో చేరండి…
కామారెడ్డి, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్ని వర్గాల ప్రజలకు చేరువకు ఇప్పటికే వివిధ రకాల సేవలను విస్తృతం చేసిన తపాల శాఖ ఇటీవలే పలు పథకాలపై భారీగా వడ్డీ రేట్లు పెంచడంతోపాటు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. మహిళల ఆర్థిక పరిపుష్టి కోసం ప్రత్యేకంగా ‘‘మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికెట్ 2023’’ పేరిట కొత్త స్కీం ప్రవేశపెటింది. గత మార్చి 31న ప్రవేశపెట్టిన స్కీమ్‌ని …
Read More »యాసంగి కంట్రోల్ రూం ప్రారంభం
కామారెడ్డి, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో యాసంగి ధాన్యం కంట్రోల్ రూం ను మంగళవారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి సమస్యలు ఉన్న ఫోన్ నెంబర్ 08468-220051 కు తెలియజేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ పద్మ, …
Read More »30వసారి రక్తదానం చేయడం అభినందనీయం…
కామారెడ్డి, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన వృద్ధురాలు పద్మావతి (72) కి అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో స్పందించి 30వ సారి రక్తాన్ని కామారెడ్డి బ్లడ్ సెంటర్లో అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ …
Read More »మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది
కామరెడ్డి, ఏప్రిల్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని హసన్ ఫంక్షన్ హాల్‌లో సోమవారం రాత్రి మైనార్టీ సోదరులకు ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ గోవర్ధన్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దిన్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ …
Read More »విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని …
Read More »సోమార్‌పేట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
కామారెడ్డి, ఏప్రిల్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను గ్రామాల్లో ఏర్పాటు చేస్తుందని మాచారెడ్డి ఎంపీపీ నర్సింగ్ రావు అన్నారు. మాచారెడ్డి మండలం సోమార్పేటలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తక్కువ ధరకు రైతులు దళారులకు విక్రయించి మోసపోవద్దని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ …
Read More »21 నుండి ధ్యాన శిబిరం
కామారెడ్డి, ఏప్రిల్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏప్రిల్ 21 నుంచి 23 వరకు జరిగే ధ్యాన శిబిరం వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధ్యాన శిబిరం ప్రతినిధులు మాట్లాడారు. హార్ట్ ఫుల్ నెస్ ఇనిస్ట్యూట్ రామచంద్ర మిషన్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖల హరి దిల్ ధ్యాన్, అర్ దిల్ ధ్యాన్ ఆసనాలు, ప్రాణాయం కామారెడ్డి పట్టణంలోని శిశుమందిర్ …
Read More »