కామారెడ్డి, డిసెంబరు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన భారతి (40) కి పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో ప్రభాకర్ మానవతా దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడినట్టు రెడ్‌క్రాస్ జిల్లా, ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త …
Read More »రాజంపేట కల్లు దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు
కామారెడ్డి, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామస్తుల పిర్యాదు మేరకు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో ఎక్సైజ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. గ్రామంలో లైసెన్స్ లేకుండా, కల్తీ కల్లుపై వచ్చిన పిర్యాదు మేరకు రాజంపేట గ్రామంలో కల్లు దుకాణాలపై దాడులు నిర్వహించగా అనుమతి లేకుండా ఎల్లమ్మ గుడి సమీపంలో కల్లు అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని 62.4 లీటర్ల కల్లును సంఘటన స్థలంలోనే ధ్వంసం …
Read More »చికిత్స నిమిత్తం రూ. 3 లక్షలు మంజూరు
లింగంపేట్, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగంపెట్ మండల కొండాపూర్ గ్రామానికి చెందిన పవన్ కళ్యాణ్ (20) ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామ సర్పంచ్ సత్యం స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ని సంప్రదించగా వెంటనే స్పందించి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో సంబంధిత డాక్టర్లతో మాట్లాడి చికిత్స చేయించారు. రోగికి వెన్నుపూస సంబంధిత శస్త్రచికిత్స ఖర్చుల నిమిత్తం ఎల్‌వోసి రూ. 3 లక్షల చెక్కును మంజూరు చేయించారు. …
Read More »జిల్లా వ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి
కామారెడ్డి, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిపిఆర్ పై రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని చింతల బాలరాజు గౌడ్ ఆడిటోరియంలో జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సిపిఆర్ ఫై విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గుండె నొప్పితో బాధపడుతున్న …
Read More »ఏసుక్రీస్తు చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించాలి
కామరెడ్డి, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏసుక్రీస్తు చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని లక్ష్మీదేవి గార్డెన్లో శుక్రవారం క్రిస్టమస్ సెలబ్రేషన్స్‌కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఏసుక్రీస్తు శాంతి, ప్రేమ ను పంచాడని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు సోదర భావంతో మెలగాలని సూచించారు. దేశంలో ఏ రాష్ట్రం క్రిస్టమస్‌ను అధికారికంగా నిర్వహించడం లేదని చెప్పారు. …
Read More »తెలంగాణకే ఆదర్శం కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సంస్థ…
కామారెడ్డి, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజంపేట మండలం శివాయిపల్లి గ్రామంలో శుక్రవారం రాజంపేట మండలం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బాధితులకు తార్ఫాలిన్, హైజీనిక్ కిట్లను, వంట సామాగ్రిని, దుప్పట్లను రెడ్ క్రాస్ కామారెడ్డి జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, డివిజన్ చైర్మన్ జమీల్, మండల వైస్ చైర్మన్ ప్రసాద్, సర్పంచ్ విఠల్ రెడ్డి, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్ కలిసి అందజేశారు. …
Read More »నూతన పట్టాదారులు రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలి
కామారెడ్డి, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండలంలో ఈనెల 20వ తేదీ లోపు నూతన పట్టాపాస్ బుక్ పొందిన రైతులందరూ జనవరి 7వ తేది లోపు రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలని మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజు గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 28వ తేదీ నుంచి 10 వ విడుత రైతుబంధు పంట పెట్టుబడి సాయం పంపిణీకి …
Read More »క్రీడా ప్రాంగణాలను 31 లోగా ఏర్పాటు చేయాలి
కామారెడ్డి, డిసెంబరు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామీణ క్రీడా ప్రాంగణాలను డిసెంబర్ 31 లోగా ఏర్పాటు చేయాలని పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ లో వివిధ జిల్లాల అదనపు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అన్ని గ్రామ పంచాయతీలో క్రీడా ప్రాంగణాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. కంపోస్ట్ షెడ్లు వినియోగంలో ఉండే విధంగా చూడాలన్నారు. నర్సరీల …
Read More »కాలుష్య నియంత్రణ బోర్డు అనుమతులు తప్పనిసరి
కామరెడ్డి, డిసెంబరు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్ని ఆసుపత్రులు కాలుష్య నియంత్రణ బోర్డు నుంచి అనుమతులను తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 పై పర్యవేక్షణ కై జిల్లా స్థాయి కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. సమావేశానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలోని వివిధ ఆస్పత్రుల …
Read More »యూత్ పార్లమెంట్‌కు సెలెక్టయిన విద్యార్థికి ప్రశంసలు
కామారెడ్డి, డిసెంబరు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 25 డిసెంబర్ న భారత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరగబోయే యూత్ పార్లమెంటు సమావేశంలో మాట్లాడటానికి ఆర్కే కళాశాల విద్యార్థిని కె. మౌనిక ఎంపిక కావడం పట్ల కలెక్టర్ ప్రశంసించారు. వివిధ దశల్లో కళాశాల, యూనివర్సిటీ, రాష్ట్ర మరియు దేశస్థాయిలో జరిగిన ఉపన్యాస పోటీలో ఉత్తీర్ణత సాధిస్తూ దేశవ్యాప్తంగా రాష్ట్రం నుంచి ఒకరు చొప్పున 25 మంది ఎంపికవగా, …
Read More »