Kamareddy

గోకుల్‌ తండాలో హైమాక్స్‌ విద్యుత్‌ దీపాల వెలుగులు

కామారెడ్డి, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్‌ తండా గ్రామంలో జాహిరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు బీబీపాటిల్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌ సహకారంతో 1.50 లక్ష యాభై వేల రూపాయలతో గ్రామం మధ్యలో ఏర్పాటు చేసిన హెమక్స్‌ లైట్స్‌ను రామారెడ్డి ఎంపీపీ దశరథ రెడ్డి, ఉమ్మడి సదాశివనగర్‌ మాజీ జడ్పీటీసీ పడిగేల రాజేశ్వర్‌ రావుతో కలిసి ప్రారంభించారు. స్థానిక సర్పంచ్‌ లలిత …

Read More »

జిల్లా ప్రజలకు ప్రముఖుల విజయ దశమి శుభాకాంక్షలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా పాలనాధికారి సి.నారాయణ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయ దశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం …

Read More »

క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా అథ్లెటిక్స్‌ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో మంగళవారం జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికైన అథ్లెటిక్స్‌ క్రీడాకారులకు మెడల్స్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలకు క్రీడాకారులు జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం …

Read More »

జిమ్‌ కేంద్రం ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో జిమ్‌ కేంద్రాన్ని మంగళవారం ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రంలోని పరికరాలను పరిశీలించారు. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.1000, నెలవారి ఫీజ్‌ రూ.100 ఉంటుందని చెప్పారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 8 గంటల …

Read More »

ప్లేట్‌లెట్స్‌ అందజేసి ప్రాణాలు కాపాడిన అధ్యాపకుడు

కామారెడ్డి, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన జ్యోతి ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో డెంగ్యూ వ్యాధితో చికిత్సపొందుతుంది. తెల్ల రక్తకణాల సంఖ్య పడిపోవడంతో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన స్ఫూర్తి డిగ్రీ కళాశాల అర్థశాస్త్ర అధ్యాపకుడు బంధం ప్రవీణ్‌కు తెలియజేయడంతో మానత దృక్పథంతో వెంటనే స్పందించి కెబిసి రక్తనిధి కేంద్రంలో ఓ పాజిటివ్‌ ప్లేట్‌ లెట్స్‌ను అందజేసి ప్రాణాలను కాపాడారని ఐవిఎఫ్‌ …

Read More »

ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్‌ చంద్రమోహన్‌ హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు రెవెన్యూ …

Read More »

అన్ని రకాల క్రీడల్లో భాగస్వాములు కావాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలికలు షూటింగ్‌ బాల్‌తో పాటు విలువిద్య క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. రాష్ట్రస్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీల్లో జిల్లా బాలికల జట్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం క్రీడాకారులను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాలికలు అన్ని రకాల క్రీడల్లో …

Read More »

తెలంగాణ సంస్కృతీ ప్రతిబింబం బతుకమ్మ

కామారెడ్డి, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ ప్రతిబింబంగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ ఆవరణలో శనివారం మెప్మా, మున్సిపల్‌ సిబ్బంది, పిఆర్‌టియు ఉపాధ్యాయునీల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఆడబిడ్డగా కీర్తించే గౌరమ్మకు అరుదైన గౌరవం బతకమ్మ పండగ తీసుకువచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బతకమ్మ …

Read More »

తల్లిదండ్రుల పట్ల కుమారులు బాధ్యతగా ఉండాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వృద్ధాప్యంలో తల్లిదండ్రుల పోషణ బాధ్యత కుమార్లదేనిని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సీనియర్‌ సిటిజన్‌ అసోసియేషన్‌ భవనంలో శనివారం ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తల్లిదండ్రుల పట్ల కుమారులు బాధ్యతగా ఉండాలని సూచించారు. వృద్ధాప్యంలో …

Read More »

ఈవీఎం గోదాము పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎస్పీ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాములను శనివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులను పరిశీలించారు. సీసీటీవీ కెమెరాలను చూశారు. పోలీస్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టర్‌ వెంట ఎన్నికల సూపరింటెండెంట్‌ సాయి భుజంగరావు, అధికారులు ఉన్నారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »