Kamareddy

మహిళా సంఘాలకు రూ. 20 కోట్ల రుణాలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ ముందంజలో ఉందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ ప్రాంతీయ కార్యాలయం నిజాంబాద్‌ ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి పట్టణంలోని రోటరీ క్లబ్‌ లో మహిళా మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళా సంఘాలు వ్యాపారం …

Read More »

ప్రజావాణి విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన విజ్ఞప్తులు, సమస్యలకు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, సత్వర పరిష్కారం చూపాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆయన హాజరై, ప్రజల నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన …

Read More »

ఇన్సురెన్సు చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజక వర్గ తెరాస పార్టీ సభ్యత్వ ఇన్స్‌రెన్స్‌ చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. మందాపూర్‌ గ్రామానికి చెందిన చెన్నం రాజా సింహ రెడ్డి మృతి చెందగా నామిని సుజాతకు 2 లక్షల రూపాయలు, టేక్రీయాల్‌ గ్రామానికి చెందిన తెరాస పార్టీ కార్యకర్త రాజు మృతి చెందగా నామిని ఒడ్డెం లక్ష్మీకి, ఉప్పర్‌ పల్లికి …

Read More »

తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచి విద్యార్థులే

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచి విద్యార్థులేనని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ముగింపులో భాగంగా సాంస్కృతిక కళా ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమానికి శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు నాణ్యమైన విద్యను అందించాలనే …

Read More »

నేర్చుకుంటూనే ఉపాధి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి: టెక్‌ బీ – హెచ్‌ సిఎల్‌ ఎర్లీ కెరీర్‌ ప్రోగ్రాంలో చేరి, నేర్చుకుంటూనే ఉపాధి అవకాశం పొందాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి టెక్నాలజీని కెరీర్‌గా ఎంచుకుని, ఉపాధి కోరుకునే వారికి ఇది సువర్ణ అవకాశం అని తెలిపారు. భారతదేశంలో నివసించే వారు, లిమేథ్స్‌/ బిజినెస్‌ మేథ్స్‌ లో 2021, …

Read More »

అందరికీ ఉచిత వైద్యం.. నరేంద్ర మోడీ లక్ష్యం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ రాష్ట్ర, కేంద్ర పార్టీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న సేవా పక్షం కార్యక్రమంలో భాగంగా నేడు 32 వ వార్డు పరిధిలో ఉచిత వైద్య శిభిరం నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యులు డా.వీరేశం, డా.మల్లికార్జున్‌, డా. శ్రీధర్‌ ఉచిత పరీక్షలు నిర్వహించి, అవసరమగు వారికి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన …

Read More »

కవులు, కళాకారులకు సన్మానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో కోలాట, జానపద నృత్యాలు, వీధి నాటకాలు, ఒగ్గు కథ, యోగ, యక్షగానం, గిరిజన వేషధారణలో విద్యార్థులు నృత్యాలు వంటి కళా ప్రదర్శనలు నిర్వహించారు. ఇవి ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం కళాకారులను, విద్యార్థులను, కవులను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ …

Read More »

రక్తదాన శిబిరానికి సహకరించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 20వ తేదీ మంగళవారం రోజున ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌, కామారెడ్డి రక్తదాతల సమూహం, రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లల కోసం నిర్వహించనున్న మెగారక్తదాన శిబిరంలో జిల్లా పోలీసు సిబ్బంది కూడా పాల్గొని రక్తదాన శిబిరం విజయవంతం చేయాలని కోరుతూ ఆహ్వాన పత్రాన్ని జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌ …

Read More »

బీబీపేట్‌లో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట్‌ మండల కేంద్రంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పురస్కరించుకొని రైతువేదిక వద్ద మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చరిత్రలో 1948 వ సంవత్సరం సెప్టెంబర్‌ 17వ తేదీకి ఒక విశిష్టత ఉందిని 74 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా …

Read More »

అభివృద్ధికి పోటీపడి ప్రజాసేవ చేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 8 ఏళ్ల తెరాస పాలనలోని తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని రాష్ట్ర శాసనసభపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో తెలంగాణ జాతీయ సమైక్యత ఉత్సవాల్లో భాగంగా శనివారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. 1948 సెప్టెంబర్‌ 17న రాజరిక పాలన వద్దని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »