Kamareddy

ఆర్‌.కె.కళాశాలకు అరుదైన గౌరవం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఆర్కే డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలకు శనిఆరం ఐఎస్‌ఓ సర్టిఫికేట్‌ లభించింది. కార్యక్రమానికి ఐయస్‌ఒ తరపున శివయ్య విచ్చేసి, ప్రభుత్వ విప్‌ యంఎల్‌ఏ గంప గోవర్ధన్‌ చేతులమీదుగా ఆర్‌.కె సిఈఒ డా.ఎం. జైపాల్‌ రెడ్డికి సర్టిఫికేట్‌ అందించారు. ఈ సందర్భంగా శివయ్య మాట్లాడుతూ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐఎస్‌వో సర్టిఫికేట్‌ రావడం ఎంతో గొప్ప విషయమని కళాశాల యాజమాన్యాన్ని …

Read More »

బిసి వసతి గృహం సంక్షేమ అధికారి సస్పెండ్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడుతూ, అలసత్వం వహించిన బీర్కూర్‌ బిసి వసతి గృహం సంక్షేమ అధికారి (ఎఫ్‌ఏసి) ఆర్‌.సందీప్‌ ను విధుల నుండి సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆదేశాలు జారీ చేశారు. హాస్టల్‌ నిర్వహణలో అక్రమాలకు పాల్పడుతూ, చట్టబద్ధమైన విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్నందుకు విధుల నుండి సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. …

Read More »

రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న వర్గం వెంకటేష్‌ (35) నార్సింగ్‌కు అత్యవసరంగా ఓ పాజిటివ్‌ ప్లేట్‌లెట్స్‌ అవసరం కావడంతో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన దినేష్‌ గౌడ్‌ స్పందించి సకాలంలో రక్త కణాలను అందజేశారని ఐవిఎఫ్‌ తెలంగాణ రక్తదాతల సమన్వయకర్త, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు. ఆపదలో ఉన్నవారికి సకాలంలో …

Read More »

సేవాభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయులు సేవాభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. పిట్లం మండల కేంద్రంలోని సాయి గార్డెన్‌లో జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. సమావేశానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు నిరంతరం శ్రద్ధ పెట్టి …

Read More »

జనహిత గణేష్‌ మండలి లడ్డూ వేలం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్‌ జనహిత గణేష్‌ మండలి గణపతి లడ్డు ధర రూ.17 500 పలికింది. గురువారం గణపతి లడ్డుకు వేలంపాట నిర్వహించారు. లడ్డు దక్కించుకోవడానికి ఇద్దరు ఉద్యోగులు పోటీపడ్డారు. జిల్లా ఎడి మైన్స్‌ అధికారి నర్సిరెడ్డి రూ.17,000 పాడారు. చివరకు టీఎన్జీవోఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. సాయిలు రూ.17,500 పాడి లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా సాయిలును …

Read More »

అనాథ వృద్దురాలికి అంత్యక్రియలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిపట్టణంలోని అనాథ వృద్ధురాలికి అనాథ ఆశ్రమం వ్యవస్థాపకులు దాస్‌ ఎల్లం సుగుణ అంత్యక్రియలు నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలోని రామరెడ్డి చౌరస్తాలో కిరాయికి ఉంటున్న అంగోత్‌ లక్ష్మీ (75), ఆమెకు కుటుంబ సభ్యులు ఎవరు లేక అనాథగా జీవిస్తున్నారు. వారు ఉంటున్న కిరాయి రూమ్‌ ప్రమాదకరంగా ఉన్నందుకు ఖాళీచేసి, రూమ్‌ దొరకక, చివరకు కామారెడ్డిలో శాబ్దిపూర్‌ తండాలోని అనాథ ఆశ్రమంలో …

Read More »

బాల్య వివాహాల నిర్మూలనకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్యవివాహాలు జరగకుండా గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో గురువారం జిల్లాస్థాయి అధికారులతో బాల్య వివాహాల నిర్మూలనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రతినెల చివరి రోజున బాల్యవివాహాల నిర్మూలన, బడి మానేసిన పిల్లలపై గ్రామస్థాయిలో అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని …

Read More »

నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద గణేష్‌ నిమజ్జనం ఏర్పాట్లను గురువారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. నిమజ్జనం చేయడానికి అవసరమైన క్రేన్‌లను సమకూర్చాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. లైటింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శీను, ఏఎస్పీ అన్యోన్య ,డిఎస్పి సోమనాథం, పోలీసులు పాల్గొన్నారు.

Read More »

కాంగ్రెస్‌, బిజెపిలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 18, 19, 20, 21, 22, 23, 24 వార్డ్‌లకు చెందిన నూతన అసరా పెన్షన్‌ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో కామారెడ్డి వార్డుల్లో మంజూరైన 347 నూతన అసరా పెన్షన్‌ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. కొత్తగా పట్టణానికి 3 వేల 291 మందికి …

Read More »

అత్యధిక అవార్డులు సాధించేలా చూడాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో అత్యధిక పంచాయతీ అవార్డులను కామారెడ్డి జిల్లా సాధించే విధంగా అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు గురువారం జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆన్లైన్‌ పోర్టల్‌లో ఈనెల 10వ తేదీ నుంచి గ్రామపంచాయతీలు అవార్డుల కోసం తప్పులు లేకుండా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »