Kamareddy

మానవత్వాన్ని చాటిన రక్తదాత…

కామారెడ్డి, డిసెంబరు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన శ్రీనివాస్‌ క్యాన్సర్‌ వ్యాధితో హైదరాబాద్‌ లోని గాంధీ వైద్యశాలలో బాధపడుతుండడంతో వారికి కావలసిన రక్తం అందుబాటులో లేకపోవడంతో వారి బంధువులు రెడ్‌ క్రాస్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి మెదక్‌ జిల్లా శెట్టిపల్లి కలాన్‌ గ్రామానికి చెందిన రాజేంద్రనగర్‌లో అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తున్న జంగిటి …

Read More »

గర్భిణీకి రక్తధానం చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌

కామారెడ్డి, డిసెంబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్లిక (28) అనే గర్భిణీ పేషంట్‌కి అత్యవసరంగా ఆపరేషన్‌ నిమిత్తమై అతితక్కువ మందిలో ఉండే ఓ నెగెటివ్‌ రక్తం అవసరం ఉండగా వారి కుటుంబ సభ్యులు కామారెడ్డి జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వహకులను సంప్రదించారు. దీంతో కామారెడ్డి మండలం కుప్రియల్‌ గ్రామానికి చెందన, మాచారెడ్డి పోలీస్‌ స్టేషన్‌లో …

Read More »

ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి

కామారెడ్డి, డిసెంబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారంపై సంబంధిత ప్రభుత్వ విభాగాల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే ప్రజల నుంచి …

Read More »

సంకరి నారాయణ రాజీనామా

కామారెడ్డి, డిసెంబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాస్టర్‌ ప్లాన్‌ తొలగించాలని డిమాండ్‌ చేస్తూ అడ్లూర్‌ ఎల్లారెడ్డి టీఆర్‌ఎస్‌ రైతు స్వమన్వయ కమిటీకి సంకరి నారాయణ రాజీనామా చేశారు. ఉద్యమ కాలం నుండి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన సంకరి నారాయణ తనతో పాటు మిగతా రైతుల భూములను ప్రభుత్వం పరిశ్రమల పేరుతో గుంజుకునే ప్రయత్నం చేస్తుందని, తన రాజీనామాతోనైనా ప్రభుత్వానికి బుద్ధి వచ్చి తక్షణమే మాస్టర్‌ ప్లాన్‌ని …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం మహిళకు రక్తదానం

కామారెడ్డి, డిసెంబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో కామారెడ్డి మండల కేంద్రానికి చెందిన భాగ్యలక్ష్మి (34) మహిళలకు కాలు ఆపరేషన్‌ నిమిత్తమై బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి బంధువులు ఐ.వి.ఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల, రెడ్‌ క్రాస్‌ కామారెడ్డి జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. దీంతో పాల్వంచ …

Read More »

విద్యార్థులు పోటీతత్వం అలవరుచుకోవాలి

కామారెడ్డి, డిసెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం టెక్‌ బి, హెచ్‌ సి ఎల్‌ కంపెనీ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. టేక్‌ బి – హెచ్‌ సి ఎల్‌ ఎర్లీ కేరీర్‌ …

Read More »

జిమ్‌ సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి, డిసెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలోని జిమ్‌ కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. జిమ్‌ కేంద్రంలో ఉన్న పరికరాల వల్ల కలిగే ప్రయోజనాలను తెలిపారు. జిమ్‌ చేయడం వల్ల శారీరక వ్యాయామం జరిగి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా యువజన …

Read More »

పుస్తె, మెట్టెలు విరాళం..

కామారెడ్డి, డిసెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం టేక్రియాల్‌ గ్రామానికి చెందిన సుంకరి సావిత్రి బాల్‌ సాయిల కుమార్తె శృతి వివాహానికి కావలసిన పుస్తే, మెట్టలను శనివారం ఐవీఎఫ్‌ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు విశ్వనాథుల మహేష్‌ అనిత గుప్తా, ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమూహ, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు, జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందు భాస్కర్‌ గుప్తా అందజేశారు. …

Read More »

అనాధ వృద్ధురాలికి వంట సామాగ్రి అందజేత

కామారెడ్డి, డిసెంబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట్‌ మండలంలోని యాడవరం గ్రామంలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా వైస్‌ చైర్మన్‌ అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌ అనాధ వృద్ధ మహిళకు వంట సామాగ్రి, పూరి గుడిసెల్లో నివాసముంటున్న రెండు నిరుపేద కుటుంబాలకు టార్పలిన్లు, శివారు రాంరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడికి హైజిన్‌ కిట్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్‌ క్రాస్‌ …

Read More »

స్వయం సహాయక సంఘాలకు రూ.529.25 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు

కామారెడ్డి, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 9038 స్వయం సహాయక సంఘాలకు రూ.529.25 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందజేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్లో శుక్రవారం ఐకెపి అధికారులతో బ్యాంకు లింకేజీ రుణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 15 వేల 319 స్వయం సహాయక సంఘాలకు రూ.854.80 కోట్లు బ్యాంక్‌ లింకేజీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »