కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశివ నగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం లక్ష్యంగా వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో సదాశివనగర్ మండలంలోని అమార్ల బండ, ధర్మారావుపేట్, అడ్లూరు ఎల్లారెడ్డి, సదాశివ నగర్, గ్రామానికి చెందిన టిఆర్‌ఎస్, బిజెపి పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ …
Read More »మొక్కలు భావితరాల మనుగడకు దోహదపడతాయి
కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మొక్కలు నాటడం వల్ల అవి వృక్షాలుగా మారి భావితరాల మనుగడకు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం ఆయన మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు రెండు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, అధికారులు పాల్గొన్నారు.
Read More »మట్టి వినాయకులతో పర్యావరణ పరిరక్షణ
కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మట్టి వినాయకులను ఏర్పాటు చేసుకొని పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం శాంతి కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్తు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఉత్సవాలు శాంతియుతంగా జరగడానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. విద్యుత్తు …
Read More »అదుపుతప్పి లారీ బోల్తా
కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నుంచి లింగంపేట్ కు వెళ్లే మార్గమధ్య ముస్తాపూర్ గ్రామ శివారులో లారీ బోల్తా పడిరది. కాగా లారీలో ఉన్న డ్రైవర్‌తో పాటు ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. స్వల్ప గాయాలు అయిన వారిని 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. లారీ నెంబర్ టిఎస్ 15 యు 7888. ప్రమాద వివరాలు తెలియాల్సి ఉంది.
Read More »కామారెడ్డి జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ బదిలీ
కామారెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ బుధవారం బదిలీపై హైదరాబాద్ కూకట్ పల్లి కోర్ట్ కి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వైద్య అమృతరావు మాట్లాడుతూ గత మూడున్నర …
Read More »నేటి సమాజానికి ఆదర్శం బాలు
కామారెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల ఎస్‌ఆర్కె డిగ్రీ పీజీ కళాశాలలో బుధవారం తెలంగాణ యూనివర్సిటీ నుండి అర్థశాస్త్రంలో డాక్టరేట్ పొందిన టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలును ఆర్కే విద్యాసంస్థల సెక్రటరీ, కరస్పాండెంట్ జైపాల్ రెడ్డి, ఎస్‌ఆర్కె డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ దత్తాద్రి సన్మానించారు. ఈ సందర్భంగా కళాశాల సీఈవో జైపాల్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక సేవలో …
Read More »ఇన్‌చార్జి డిపిఆర్‌వోగా రవికుమార్
కామారెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఇంచార్జ్ డిపిఆర్‌ఓగా బి. రవికుమార్ బాధ్యతలు స్వీకరించారు. సిద్దిపేట డిపిఆర్‌ఓగా ఉన్న రవికుమార్‌కు కామారెడ్డి ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇంతవరకు ఇంచార్జి గా పనిచేసిన దశరథం, రవికుమార్ కు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కు డిపిఆర్‌ఓ రవికుమార్ మొక్కను అందజేశారు. మర్యాదపూర్వకంగా కలిశారు.
Read More »ఉద్యానవన శాఖ పనులు తక్షణమే పూర్తిచేయాలి
కామారెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రూర్బన్లో ఉద్యానవన శాఖ పనులను తక్షణమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం కామారెడ్డి కలెక్టరేట్లో ఉద్యానవన శాఖ ద్వారా చేపట్టిన పనులపై సమీక్ష నిర్వహించారు. ఈనెల 30లోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, డిఆర్డిఓ సాయన్న, …
Read More »ప్రణాళికా బద్దంగా చదవాలి
కామారెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రణాళిక బద్ధంగా చదివి పోటీ పరీక్షల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సదాశినగర్ మండలం మర్కల్ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోటీ పరీక్షలలో ఎలా విజయం సాధించాలి అనే అంశంపై ప్రేరణ కల్పించారు. పోటీ పరీక్షలకు కావలసిన పుస్తకాలను అందజేస్తానని పేర్కొన్నారు. డిగ్రీ …
Read More »బాధిత కుటుంబాన్ని పరామర్శించిన స్పీకర్ పోచారం
బీర్కూర్, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నస్రుల్లాబాద్ మండల కేంద్రానికి చెందిన టీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త దొంతి శంకర్ శుక్రవారం గుండె పోటుతో మరణించగా బుధవారం రాష్ట్ర శాసన సభపతి పోచారం శ్రీనివాసరెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట జడ్పీ కో ఆప్షన్ మజీద్,వైస్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, గ్రామ తెరాస పార్టీ అధ్యక్షుడు బాలక్రిష్ణ, నాయకులు …
Read More »