Kamareddy

ఉపాధి పనులకు కూలీల సంఖ్య పెంచాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పనులకు కూలీల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులను గుర్తించి బడ్జెట్‌ కేటాయింపులు చేయాలన్నారు. గ్రామ సభ ద్వారా ఆమోదం పొందాలని సూచించారు. గ్రామీణ క్రీడ ప్రాంగణాలు అన్ని …

Read More »

పేకాట స్థావరాల్లో పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం

కామారెడ్డి, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డివిజనల్‌ పరిధిలోని బిక్కనూర్‌, దేవున్‌పల్లి, ఎల్లారెడ్డి డివిజనల్‌ పరిధిలోని గాంధారి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజనల్‌ పరిధిలోని బిచ్కుంద, జుక్కల్‌, మద్నూర్‌, నిజాంసాగర్‌ పోలీసు స్టేషన్ల పరిధిలో పేకాట ఆడుతున్న 106 మందిని పట్టుకొని 21 కేసులు నమోదు చేసి రూ. 1 లక్ష 10 వేల 270 నగదు స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్‌పి శ్రీనివాస రెడ్డి …

Read More »

గుండె ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం

కామారెడ్డి, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌ జిల్లా దొంగల ధర్మారానికి చెందిన మల్లవ్వ (58) కి అత్యవసరంగా గుండె ఆపరేషన్‌ నిమిత్తం ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి రక్తదాతల క్రియాశీలక సభ్యుడు పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన గోల్కొండ రాజు, పరుశురాం, ధర్మారం గ్రామానికి చెందిన రాజు ములుగులో గల ఆర్వీఎం వైద్యశాలలో మంగళవారం 3 యూనిట్ల రక్తాన్ని సకాలంలో అందజేశారని ఐవిఎఫ్‌ …

Read More »

రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం

కామారెడ్డి, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిబీపెట్‌ మండల కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న యాద లక్ష్మి (34) కు అత్యవసరంగా ఆపరేషన్‌ నిమిత్తము ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ సభ్యుడు పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన రాజు, ఎల్లారెడ్డికి చెందిన నాగరాజుకు తెలియజేశారు. వెంటనే స్పందించి సకాలంలో వీటి ఠాకూర్‌ రక్తనిధి కేంద్రంలో రక్తం …

Read More »

కామారెడ్డిలో ఉచిత వైద్య శిబిరం

కామారెడ్డి, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాతృశ్రీ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, ఉచిత వైద్య పరీక్షలు, ఉచిత మందులు పంపిణీ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇంద్రనగర్‌ కాలనీ 20వ వార్డు వనిత విద్యాలయంలో మాతృశ్రీ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించారు. షుగర్‌ ,బీపీ, థైరాయిడ్‌, పరీక్షలు చేసి అవసరమున్న వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఉచిత వైద్య …

Read More »

ఎస్‌.ఆర్‌.కె. విద్యార్థులను సన్మానించిన యూనివర్సిటీ రిజిస్ట్రార్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ గురువారం ప్రకటించిన డిగ్రీ నాల్గవ సెమిస్టర్‌ ఫలితాలలో బిటిబిసిలో 10/10 జీపీఏ సాధించిన కె.రాహుల్‌, ఎస్‌.తబస్సుమ్‌ అలాగే ఎంఎస్టిసిఎస్‌ సెకండ్‌ సెమిస్టర్‌లో వి భరణి 9.80 జిపిఏ సాధించిన వారిని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ విద్యావర్దిని సన్మానించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ బాగా కష్టపడి చదవాలని, ఇప్పుడు అన్ని రకాలుగా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో …

Read More »

ధరణి సమస్యలు పరిష్కరించాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలంలో ధరణి ద్వారా ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆద్వర్యంలో ఎంఆర్‌వోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ మోటూరు శ్రీకాంత్‌ మాట్లాడుతూ గత నెల బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ధరణి సమస్యల పరిష్కారం …

Read More »

గుండె ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం..

నిజామాబాద్‌, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని మెడికోవర్‌ వైద్యశాలలో నరసయ్య (76) కు అత్యవసరంగా గుండె ఆపరేషన్‌ నిమిత్తమై బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో బిబీపేట మండల కేంద్రానికి చెందిన బచ్చు శ్రీధర్‌ కుమార్‌ వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడారని రెడ్‌ క్రాస్‌ జిల్లా, ఐ.వి.ఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు. …

Read More »

కామారెడ్డిలో కొమురం భీం జయంతి

కామారెడ్డి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామారెడ్డిలోని ఆర్కే జూనియర్‌ కళాశాలలో స్వాతంత్య్ర సమరయోధుడు, గోండు జాతి నాయకుడు కొమురం భీం జయంతి నిర్వహించారు. భీం పోరాట పటిమను కొనియాడారు. అనంతరం ఉత్తమ విద్యార్థులను అభినందించడానికి సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కామారెడ్డి జిల్లా ఇంటర్‌ విద్య నోడల్‌ అధికారి షేక్‌ సలాం విచ్చేశారు. వారు మాట్లాడుతూ విద్యార్థులందరూ కష్టపడి వాళ్ళ తల్లిదండ్రుల …

Read More »

పటిష్టమైన శాంతిభద్రతలతోనే అభివృద్ధి సాధ్యం

కామారెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పటిష్టమైన శాంతిభద్రతలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా పోలీస్‌ కార్యాలయంలో పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినం (పోలీస్‌ ఫ్లాగ్‌ డే) సందర్భంగా పోలీస్‌ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. పోలీస్‌ అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. సమాజాన్ని నేర రహితంగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »