కామారెడ్డి, అక్టోబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూరు గ్రామ శివారులోని ధరణి టౌన్ షిప్‌లో ఇండ్లు (130), ప్లాట్ల (195) విక్రయానికి సంభందించి ఫ్రీ బెడ్ అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. గురువారం 11 గంటలకు కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహిస్తామని చెప్పారు. ఆసక్తి గల వ్యక్తులు పాల్గొని విజయవంతం చేయాలని …
Read More »ఈనెల 31లోగా బిందు సేద్య సౌకర్యం కల్పించాలి
కామారెడ్డి, అక్టోబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో మొదటి విడతలో 855 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు బిందు సేద్యం సౌకర్యం ఈ నెల 31 లోగా కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జిల్లా ఉద్యానవన శాఖ అధికారులతో బిందు సేద్యం ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఆయిల్ ఫామ్ సాగుచేసే …
Read More »కల్కి భగవాన్ ఆలయంలో అన్నదానం
కామారెడ్డి, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ కల్కి ఆలయంలో గత 3 సంవత్సరాలుగా ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని మంగళవారం కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా ఆలయ సేవకులు ఏర్రం చంద్రశేఖర్, డాక్టర్ బాలు లు మాట్లాడుతూ శ్రీ అమ్మ భగవానుల సూచనల మేరకు 2020 సంవత్సరంలో అన్నదాన కార్యక్రమాన్ని ఆలయంలో ప్రారంభించడం జరిగిందని నిర్విరామంగా గత 3 …
Read More »ఓటరు జాబితాలో మార్పునకు దరఖాస్తులు
కామారెడ్డి, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ జాబితాలో మార్పులు, చేర్పులు చేయదలచుకున్న వ్యక్తులు ఫారం (8) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. కొత్తగా ఓటరు నమోదు కొరకు ఫామ్ (6) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బూతు లెవెల్ అధికారుల వద్ద, …
Read More »జిల్లాలో 336 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
కామారెడ్డి, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో 336 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం వాన కాలంలో ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 6.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు …
Read More »జిల్లాలోని పంచాయతీలు అవార్డులకు పోటీ పడాలి
కామారెడ్డి, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పంచాయతీలకు ఏటా ఇచ్చే అవార్డులకు జిల్లాలోని పంచాయతీలు పోటీపడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పంచాయతీ అధికారులు కార్యదర్శిలతో జాతీయ పంచాయతీ అవార్డు కార్యాచరణపై జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 526 పంచాయతీలు ఈ పోటీలో పాల్గొనాలని కోరారు. 9 కేటగిరిలో అవార్డుల ఎంపిక ఉంటుందని వెల్లడిరచారు. గ్రామ, మండల, జిల్లా, …
Read More »ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి
నిజామాబాద్, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా అధికారులకు సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఫిర్యాదులను …
Read More »సిఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్
కామారెడ్డి, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజికవర్గంలోని దోమకొండ, కామారెడ్డి మండలాలకు చెందిన 32 మందికి 32 లక్షల 3 వేల 712 రూపాయల కళ్యాణలక్ష్మి, షాది ముభారక్ చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఆనంతరం కామారెడ్డి నియోజికవర్గంలోని 14 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 18 లక్షల 64 వేల 500 రూపాయల చెక్కులను ఆయన …
Read More »కామారెడ్డిలో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థుల క్షేత్ర పర్యటన
కామారెడ్డి, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంను ఆదివారం హైదరాబాద్ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా సందర్శించారు. కలెక్టరేట్ భవనం మ్యాప్‌ను పరిశీలించారు. భవనంలోని వివిధ డిపార్ట్మెంట్ల భవనాలను చూశారు. అనంతరం సమావేశం మందిరంలో ఆర్ అండ్ బి డి ఈఈ జాలిగామ శ్రీనివాస్, ఏఈఈ రవితేజ, వక్త ఉష రెడ్డి సముదాయంలో ఉన్న …
Read More »కామారెడ్డిలో 81.60 శాతం హాజరు నమోదు
కామారెడ్డి, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -1 ప్రాథమిక పరీక్ష ప్రశాంతంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆర్కే డిగ్రీ కళాశాల, సందీపని జూనియర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. పరీక్ష కేంద్రాలలో బయోమెట్రిక్, సీసీ కెమెరాలు నిర్వహణ ప్రక్రియను …
Read More »