Kamareddy

సాఫ్ట్‌వేర్‌ రంగంలో మెగా ఉద్యోగ మేళా

కామారెడ్డి, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌ వారు నిర్వహిస్తున్న టెక్‌ బీ ప్రోగ్రాం కొరకు ఎంపిసి / ఎంఇసి 60శాతం మాథ్స్‌ సబ్జెక్ట్‌లో ఉత్తీర్ణత పొందిన ఇంటర్మీడియట్‌ 2021- 22 లో పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఈనెల 20న బాన్సువాడలో మెగా జాబ్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లో …

Read More »

అంతర్జాతీయ క్రికెట్‌కు కామారెడ్డి విద్యార్థి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌ పోటీలకు ఎంపికైన క్రీడాకారుడు మహమ్మద్‌ ఇస్తాయక్‌ను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సన్మానించారు. ఈనెల 28,29,30 తేదీల్లో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్‌ పోటీలు జరుగుతాయని చెప్పారు. మహ్మద్‌ ఇస్తాయక్‌ మంజీరా కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, మంజీరా కళాశాల ప్రిన్సిపల్‌ సత్యనారాయణ, శ్రీ ఆర్యభట్ట ప్రిన్సిపల్‌ హనుమంతరావు, …

Read More »

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునికి సన్మానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు చిన్న మల్లారెడ్డి జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర విభాగంలో బోధన చేస్తున్న ప్రవీణ్‌ కుమార్‌కి రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2022 ను స్వీకరించిన సందర్భంగా కామారెడ్డి మండల విద్యాధికారి ఎల్లయ్య, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ కిష్టయ్య ఆర్కే విద్యాసంస్థల డైరెక్టర్‌ …

Read More »

ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తమై రక్తదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్‌ నిమిత్తమై లక్ష్మి (32) ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో బాన్సువాడకు చెందిన బీర్కూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న అబ్దుల్‌ రజాక్‌కు తెలియజేయడంతో మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి బాన్సువాడ నుండి వచ్చి రక్తాన్ని అందజేశారని, ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర, రెడ్‌ క్రాస్‌ జిల్లా …

Read More »

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ అభయాంజనేయ ఆర్యవైశ్య సంఘం, కల్కి నగర్‌, కామారెడ్డి ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 5 ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని శనివారం ఆర్‌కె డిగ్రీ కళాశాలలో సంఘం సభ్యులైన 12 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంఘం అధ్యక్షుడు తాటిపాముల సుధాకర్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి గొప్పదనాన్ని వివరించారు. ఇంత గొప్ప కార్యకమ్రం నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామని …

Read More »

ఆర్‌.కె.కళాశాలకు అరుదైన గౌరవం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఆర్కే డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలకు శనిఆరం ఐఎస్‌ఓ సర్టిఫికేట్‌ లభించింది. కార్యక్రమానికి ఐయస్‌ఒ తరపున శివయ్య విచ్చేసి, ప్రభుత్వ విప్‌ యంఎల్‌ఏ గంప గోవర్ధన్‌ చేతులమీదుగా ఆర్‌.కె సిఈఒ డా.ఎం. జైపాల్‌ రెడ్డికి సర్టిఫికేట్‌ అందించారు. ఈ సందర్భంగా శివయ్య మాట్లాడుతూ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐఎస్‌వో సర్టిఫికేట్‌ రావడం ఎంతో గొప్ప విషయమని కళాశాల యాజమాన్యాన్ని …

Read More »

బిసి వసతి గృహం సంక్షేమ అధికారి సస్పెండ్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడుతూ, అలసత్వం వహించిన బీర్కూర్‌ బిసి వసతి గృహం సంక్షేమ అధికారి (ఎఫ్‌ఏసి) ఆర్‌.సందీప్‌ ను విధుల నుండి సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆదేశాలు జారీ చేశారు. హాస్టల్‌ నిర్వహణలో అక్రమాలకు పాల్పడుతూ, చట్టబద్ధమైన విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్నందుకు విధుల నుండి సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. …

Read More »

రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న వర్గం వెంకటేష్‌ (35) నార్సింగ్‌కు అత్యవసరంగా ఓ పాజిటివ్‌ ప్లేట్‌లెట్స్‌ అవసరం కావడంతో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన దినేష్‌ గౌడ్‌ స్పందించి సకాలంలో రక్త కణాలను అందజేశారని ఐవిఎఫ్‌ తెలంగాణ రక్తదాతల సమన్వయకర్త, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు. ఆపదలో ఉన్నవారికి సకాలంలో …

Read More »

సేవాభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయులు సేవాభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. పిట్లం మండల కేంద్రంలోని సాయి గార్డెన్‌లో జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. సమావేశానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు నిరంతరం శ్రద్ధ పెట్టి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »