Kamareddy

బస్తీ దవాఖాన ప్రారంభించిన మంత్రి

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం బస్తి దవాఖానాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఎస్సీ వాడలో మంగళవారం బస్తీ దవాఖానాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో జిల్లాస్థాయిలో మొదటి బస్తి దవాఖానాను కామారెడ్డిలో ఏర్పాటు చేసినట్లు …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం చేసిన డాక్టర్‌ వేద ప్రకాష్‌

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణ కేంద్రానికి చెందిన లక్ష్మీ (35) కి గర్భసంచి ఆపరేషన్‌ నిమిత్తమై ఏ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం బాన్సువాడ రక్తనిధి కేంద్రంలో లభించకపోవడంతో వారు ఐవిఎఫ్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. దీంతో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్‌ వేదప్రకాష్‌కు తెలియజేయడంతో వెంటనే స్పందించి తన జన్మదినం …

Read More »

ఘనంగా యువజన కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువజన కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ చైర్మన్‌ షబ్బీర్‌ అలీ ఆదేశాల మేరకు, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి సూచన మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో యువజన కాంగ్రెస్‌ జెండా ఆవిష్కరించారు. అనంతరం స్థానిక రైల్వే స్టేషన్‌ వద్ద పేదలకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా …

Read More »

కామారెడ్డిలో గాంధీ చిత్రప్రదర్శన

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రిచర్డ్‌ అటెన్‌ తెరకెక్కించిన గాంధీ చిత్రాన్ని విద్యార్థులకు ప్రదర్శించారు. కామారెడ్డి పట్టణంలోని 4 థియేటర్లలో మంగళవారం ఉచిత సినిమా ప్రదర్శన నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులను బస్సులలో థియేటర్ల వద్దకు తీసుకువచ్చి సినిమాను చూపించారు. ప్రియా ఏషియన్‌ను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించి, సినిమా చూడడానికి వచ్చిన …

Read More »

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి ఈ సందర్భంగా ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారులకు పంపి పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని శాఖల …

Read More »

చేనేత కళలను ప్రోత్సహించాలి

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చేనేత వస్త్రాలను విరివిగా కొనుగోలు చేసి, వాడుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయం సమీపంలో ఆదివారం జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని చేనేత నడక కార్యక్రమాన్ని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చేనేత కళలను ప్రోత్సహించాలని సూచించారు. …

Read More »

16న కవి సమ్మేళనం

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ సమైక్యత పెంపొందించే విధంగా స్వాతంత్ర భారత వేడుకలు ఆగస్టు 8 నుంచి 22 వరకు వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఆదివారం సమావేశం నిర్వహించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పండగ వాతావరణం లో వేడుకలు …

Read More »

జాతీయ సమైక్యత పెంపొందించేలా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నిర్వహణ

కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ సమైక్యత పెంపొందించే విధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్‌లను ఆదేశించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నిర్వహణపై శనివారం డిజిపి మహెందర్‌ రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వీడియో సమావేశంలో జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ …

Read More »

రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం

కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీటి ఠాకూర్‌ రక్త నిధి కేంద్రంలో శనివారం పట్టణ కేంద్రానికి చెందిన సంతోష్‌ కుమార్‌ రక్తదానం చేయడం జరిగిందని ఐవిఎఫ్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త బాలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమని ప్రస్తుత తరుణంలో రక్తనిధి కేంద్రాలలో రక్త నిల్వలు లేకపోవడంతో గర్భిణీ స్త్రీలు, వివిధ …

Read More »

కామారెడ్డిలో ఆచార్య జయశంకర్‌ జయంతి

కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షలను ప్రజల్లో ఉద్యమ భావజాలాన్ని ప్రొఫెసర్‌ జయశంకర్‌ రగిలించారని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు శనివారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. స్వయం పాలనలోని తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »