Kamareddy

ఉద్యోగ జేఏసి ఆధ్వర్యంలో చలివేంద్రం

కామారెడ్డి, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవి ఎండల దృష్ట్యా ప్రజల, ఉద్యోగుల దాహార్తిని తీర్చడానికి ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చలివేంద్రం, అంబలి కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రం, చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి సోమవారం …

Read More »

ప్రభుత్వ పథకాలపై జర్నలిస్ట్‌లకు శిక్షణ

నిజామాబాద్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి తెలంగాణ షెడ్యూల్డు కులాల సహకార అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 26 , 27 వ తేదీలలో షెడ్యూల్డ్‌ కులాల జర్నలిస్టుల ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 26, …

Read More »

వ్యవసాయ విస్తీర్ణాధికారిని అభినందించిన కలెక్టర్‌

కామారెడ్డి, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హర్యానా రాష్ట్రంలోని తావ్‌ దేవి లాల్‌ ఖేల్‌ స్టేడియం పంచ్కులలో జరుగనున్న ఆల్‌ ఇండియా సివిల్‌ సర్వీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ 2021- 2022 సందర్భంగా దానికి సంబంధించిన జీవోను సర్వీస్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ వారు శనివారం విడుదల చేశారు. గేమ్స్‌కు కామారెడ్డి జిల్లా నుంచి కామారెడ్డి రూరల్‌, జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారులు సంఘం అధ్యక్షుడు కె. శ్రీనివాస్‌ …

Read More »

అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అభివృద్ధి పనులను మార్చ్‌ 30 లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సిమెంట్‌ రోడ్ల నిర్మాణం పనులు అధికారులు సకాలంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. నిజాంసాగర్‌ …

Read More »

యువతులు ఆర్థిక స్వావలంబన సాధించాలి

కామారెడ్డి, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువతులు శిక్షణ కేంద్రం ద్వారా నైపుణ్యాలను పెంచుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శనివారం డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో (ఈడబ్ల్యూఆర్‌ఎస్‌) ఉన్నతి ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శిక్షణలో మెళుకువలు నేర్చుకొని యువతులు జీవితంలో స్థిరపడాలని సూచించారు. ఉద్యోగాలు …

Read More »

మాస్టర్‌ ట్రైనర్‌గా యువత రాణించాలి

కామారెడ్డి, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుద్యోగ యువత ఇష్టపడి నైపుణ్యాలను నేర్చుకొని భవిష్యత్తులో మాస్టర్‌ టైనర్లుగా రాణించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో ఉన్నతి ప్రాజెక్టు ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. …

Read More »

జల వనరులను కాపాడుకోవడం మనందరి బాధ్యత

కామారెడ్డి, మార్చ్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లైట్‌ ఫర్‌ బ్లైండ్‌ సంస్థ నాబార్డు వారి సహకారముతో ప్రపంచ జల దినోత్సవం కార్యక్రమం ముందస్తుగా చిట్యాల గ్రామంలో శుక్రవారం నిర్వహించారు. నీటి ప్రాముఖ్యతను వివరిస్తు జల వనరులను కాపాడుకోవడం మనందరి భాద్యత అని, నీటిని చాలా చాలా పొదుపుగా వాడాలని సంస్థ కార్యదర్శి నబి వివరించారు. సర్పంచ్‌ కవిత, బాలయ్య మాట్లాడుతూ తమ పంచాయితి పరిధిలో నీటి …

Read More »

గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, మార్చ్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో డెలివరీ నిమిత్తమై ఏ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం బ్లడ్‌ బ్యాంకులలో లభించకపోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహం సహకారంతో ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెంకటరమణకు తెలిపారు. వెంటనే స్పందించి రక్తాన్ని సకాలంలో అందజేసి గర్భిణీ స్త్రీ ప్రాణాలు కాపాడినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ …

Read More »

కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు

కామారెడ్డి, మార్చ్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం హోలీ వేడుకలు జిల్లా ఉద్యోగుల సంక్షేమ సంఘం, ఉద్యోగ జేఏసీ, టిఎన్‌జిఓఎస్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ జితేష్‌ పాటిల్‌, ఎస్‌పి శ్రీనివాస్‌ రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, జిల్లా ఉద్యోగులు హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఒకరికొకరు మర్యాదపూర్వకంగా కలిసి పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. …

Read More »

12 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలందరికీ వ్యాక్సినేషన్‌

కామారెడ్డి, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఉన్న 12 నుంచి పద్నాలుగేళ్ల వయసు ఉన్న పిల్లలందరికీ తప్పనిసరిగా వ్యాక్సినేషన్‌ వారి తల్లిదండ్రులు చేయించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ విపాటిల్‌ అన్నారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి జూమ్‌ కాన్ఫరెన్సులో వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 12 నుండి 14 ఏళ్ళ లోపు పిల్లలకు వ్యాక్సినేషన్‌ వారి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »