Kamareddy

రెవెన్యూ యంత్రాంగంను అన్ని విధాలుగా సన్నద్ధం చేస్తున్నాం

కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 15వ తేదీ నుంచి జరగనున్న రెవెన్యూ సదస్సుల కోసం జిల్లా యంత్రాంగాన్ని అన్ని విధాలుగా సన్నద్ధం చేసామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌కు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ఆదేశాల మేరకు రెవిన్యూ సదస్సుల నిర్వహణ పై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్‌డిఓలు, …

Read More »

గురు మార్గదర్శన మహోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ

కామారెడ్డి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం గురు మార్గదర్శన మహోత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు. వీరశైవ జంగమ సమాజం ఆధ్వర్యంలో ఈనెల 18న బిచ్కుంద పట్టణంలో గురు మార్గదర్శన మహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా స్థానిక తాసిల్దార్‌ కార్యాలయంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా వీరశైవ జంగమ సమాజం అధ్యక్షులు విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఈనెల 18న బిచ్కుంద …

Read More »

ముందు జాగ్రత్తగా టీకాలు వేయించుకోవాలి

కామారెడ్డి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రేబీస్‌ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ప్రపంచ జూనోసిస్‌ దినోత్సవం పురస్కరించుకొని బుధవారం కామారెడ్డి పట్టణంలోని ప్రాంతీయ పశు వైద్యశాలలో యాంటీ రేబిస్‌ టీకాలు వేసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ఈ సంవత్సరం …

Read More »

ధరణి పెండిరగ్‌ దరఖాస్తులు తక్షణమే పరిష్కరించాలి

కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణిలోని పెండిరగ్‌ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్లో తహసీల్దార్‌ లసమావేశంలో మాట్లాడారు. టీఎం33 మాడ్యూల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, పరిష్కరించాలని సూచించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు. అటవీ, రెవెన్యూ భూములపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు …

Read More »

రాశి వనాన్ని సందర్శించిన కలెక్టర్‌

కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న రాశి వనాన్ని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మంగళవారం సందర్శించారు. రాశి వనంలో ఉన్న వివిధ రకాల వృక్షాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాశి వనంలో తేనెటీగల పెంపకం కోసం స్థలాలను పరిశీలించారు. తేనెటీగల పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కళాశాల అభివృద్ధి పనుల వివరాలను …

Read More »

స్వచ్ఛ విద్యాలయ పురస్కార్‌లో మొదటి స్థానంలో నిలవాలి

కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా స్వచ్ఛ విద్యాలయ పురస్కార్‌లో మొదటి స్థానంలో నిలువాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఎంపికైన పాఠశాలలకు ధ్రువీకరణ పత్రాలను, బహుమతులను పంపిణీ చేసే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రైవేటు కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా …

Read More »

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ

మాచారెడ్డి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా టిబి ప్రోగ్రాం అధికారి డా.రవి కుమార్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డా. ప్రవీణ్‌ కుమార్‌తో కలిసి పిహెచ్‌సి పరిధిలో ఉన్న టీబీ కేసుల గురించి, వ్యాధిగ్రస్తులకు అందుతున్న చికిత్సల గురించి వాకబు చేశారు. వ్యాధిగ్రస్తులకు ని-క్షయ పోషణ యోజన పథకం ద్వారా డైరెక్ట్‌ …

Read More »

అనుమతి లేకుండా గోవులు రవాణా చేస్తే కఠిన చర్యలు

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గోవులు అక్రమ రవాణా కాకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. అనుమతి లేకుండా గోవులను రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ధ్రువీకరణ పత్రాలు లేకుండా గోవులను రవాణా చేస్తే చట్ట …

Read More »

మూగజీవాల పట్ల ప్రేమ ఉండాలి

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జంతువుల ఆరోగ్యం, పోషణ పట్ల శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్లో జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పెంపుడు జంతువుల, మూగజీవాల సంరక్షణ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. మూగజీవాలు, పెంపుడు జంతువుల పట్ల ప్రేమ కలిగి ఉండాలని సూచించారు. జంతువులకు హనీ చేయవద్దని …

Read More »

ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి

డిచ్‌పల్లి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని డిఆర్డిఓ పిడి సాయన్న అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి ఈ సందర్భంగా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారులకు పంపి పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జడ్పీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »