Kamareddy

కామారెడ్డి కోర్టు సమస్యలు పరిష్కరించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్‌ విజయ సేన రెడ్డిని శుక్రవారం కామారెడ్డి జిల్లా కోర్ట్‌ బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు హైకోర్టులో కలిశారు. కామారెడ్డిలో రెండవ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు, పోక్సో కోర్టు వెంటనే ఏర్పాటు చేయాలని, కామారెడ్డి కోర్టులోని సమస్యలను పరిష్కరించాలని బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు విజ్ఞాపన పత్రం అందజేశారు. కోర్టులో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ …

Read More »

జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది పరచాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలని జహీరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు బీ బీ పాటిల్‌ అన్నారు. శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమీక్ష సమావేశం ఎంపీ బీబీ పాటిల్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా …

Read More »

రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌ జిల్లా లక్ష్మాపూర్‌ గ్రామానికి చెందిన నందరబోయిన వసంత (48) కు ఇన్ఫెక్షన్‌ సోకడంతో వైద్యులు కాలు తొలగించడానికి ఓ పాజిటివ్‌ రక్తం అవసరమని తెలియజేయడంతో వెంటనే స్పందించి పట్టణానికి చెందిన యువకుడు భరత్‌ 27వ సారి ఓ పాజిటివ్‌ రక్తాన్ని సకాలంలో ప్రభుత్వ వైద్యశాల కామారెడ్డిలో అందించి ప్రాణాలు కాపాడినట్టు కామారెడ్డి జిల్లా జూనియర్‌ రెడ్‌ క్రాస్‌ …

Read More »

ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు

కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూరు మండలం జంగంపల్లిలో గురువారం ప్రభుత్వ భూములను రెవిన్యూ జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ పరిశీలించారు. మ్యాప్‌ ఆధారంగా ప్రభుత్వ భూముల సర్వే నెంబర్ల వారిగా పరిశీలించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆయన వెంట కామారెడ్డి ఇంచార్జ్‌ ఆర్‌డిఓ శీను నాయక్‌, అధికారులు ఉన్నారు.

Read More »

సంక్షేమ పథకాలను చూసి ప్రపంచమే అబ్బురపడుతుంది

కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ముందడుగు వేశారని, దాన్ని పూర్తి చేసి తెలంగాణ రైతులకు గోదావరి జలాలతో పంటలు పండే విధంగా చూశారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ఆయన ఆర్‌ అండ్‌ బి …

Read More »

కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు ఆర్థిక సాయం

కామారెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కులాంతర వివాహం చేసుకున్న తొమ్మిది మంది దంపతులకు ఒక్కొక్కరికి రూపాయలు రెండున్నర లక్షల చొప్పున బాండ్లను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఎమ్మెల్యేలు హనుమంత్‌ షిండే, జాజాల సురేందర్‌, జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అధికారిని రజిత, అధికారులు …

Read More »

80 శాతం లక్ష్యాలు పూర్తిచేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైస్‌ మిల్లర్స్‌ 80 శాతం లక్ష్యాలను పూర్తిచేయాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో బుధవారం రైస్‌ మిల్‌ యజమానులతో సమీక్ష నిర్వహించారు. ఇంతవరకు మిల్లింగ్‌ చేసిన ధాన్యం వివరాలను మిల్లుల వారీగా అడిగి తెలుసుకున్నారు. మిల్లుల యజమానులు అధికారులు సమిష్టిగా పనిచేసి లక్ష్యాలను పూర్తి చేయాలని పేర్కొన్నారు. …

Read More »

అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు చేసిన ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూర్‌ మండలం మొటాట్‌ పల్లి గ్రామంలో సుమారు 23 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనంలను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పల్లెల రూపురేఖలు మారాయని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలైన ప్రకృతి వనం, వైకుంటధామం, మిషన్‌ భగీరథ …

Read More »

రక్తదానం పట్ల అపోహలు విడనాడాలి..

కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలలో ఆపరేషన్ల నిమిత్తమై కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన లక్ష్మీ మరియు ఖైరున్నిస్సా బేగంలకు కావలసిన ఏబి పాజిటివ్‌ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో కామారెడ్డి జిల్లా జూనియర్‌ రెడ్‌ క్రాస్‌ సమన్వయకర్త, కామారెడ్డి రక్తదాతల సమూహం నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కాగా పట్టణానికి చెందిన హష్మీ మరియు మల్కాపూర్‌ గ్రామానికి చెందిన …

Read More »

జాబ్‌మేళాలు సద్వినియోగం చేసుకోవాలి…

కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెహ్రూ యువ కేంద్రం, ఉపాధి శిక్షణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన జాబ్‌ మేళా కు విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి 350 మంది యువతీయువకులు జాబ్‌ మేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూ ద్వారా ఎస్‌బిఐ, శుభగృహ, విజయ బోయో ఫర్టిలైజర్‌, టాటా మోటార్స్‌తో పాటు 6 ఇతర కంపెనీలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »