కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి న్యాయవాదుల సంక్షేమం కోసం 5 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తెలిపారు. బుధవారం స్థానిక సత్య గార్డెన్‌లో కామారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జల బిక్షపతి, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌లు నందా రమేష్, నిమ్మ దామోదర్ రెడ్డి, ప్రభుత్వ న్యాయవాది నరేందర్ రెడ్డి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ను …
Read More »రక్తహీనత ఉన్న మహిళలకు మందులు పంపిణీ చేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాఠశాల విద్యార్థులకు ఆర్‌బిఎస్‌కె వైద్యులు వైద్య పరీక్షలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలో వైద్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని పాఠశాలలో వైద్య పరీక్షలు చేయాలని సూచించారు. ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు శిథిలావస్థలో ఉంటే మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపాలని సూచించారు. రక్తహీనత ఉన్న మహిళలను …
Read More »ఆర్‌డివో కార్యాలయాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్
కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయాన్ని మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరును ఆర్డీవో శ్రీనును అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీను, తహసిల్దార్ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.
Read More »జ్యోతిబా ఫూలే వసతి గృహం సందర్శించిన కలెక్టర్
కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భిక్కనూరు మండలం జంగంపల్లిలోని జ్యోతిబా పూలే బాలికల పాఠశాల (వసతిగ ృహాం) ను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. వసతి గృహ భవనం శిథిలావస్థలో ఉందని మరమ్మతులు చేపట్టాలని ప్రిన్సిపాల్ సత్యనాథ్ రెడ్డి తెలిపారు. మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. అదనపు గదుల కోసం ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జంగంపల్లి లోని పల్లె …
Read More »పేదల సంక్షేమానికి ఉద్యోగులు కృషి చేయాలి…
కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వ ఉద్యోగులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఉద్యోగుల అలాట్మెంట్‌లో టిఎన్జిఓఎస్ ప్రతినిధులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. …
Read More »మీసేవ ద్వారా మేడారం ప్రసాదం పొందవచ్చు
కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మేడారం సమ్మక్క-సారాలమ్మ ప్రసాదాన్ని మీ సేవ కేంద్రాల ద్వారా అందించనున్నారు. భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఏర్పాట్లు చేసిందని కామారెడ్డి జిల్లా మీ సేవ జిల్లా మేనేజర్ ప్రవీణ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రసాదం పొందాలనుకునేవారు సమీపంలోని మీసేవ కేంద్రాలలో రూ.225 చెల్లిస్తే కొరియర్ ద్వారా నేరుగా ఇంటికే అందజేస్తారని చెప్పారు. ఇందులో …
Read More »ఘోర రోడ్డు ప్రమాదం – దంపతుల మృతి
కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దోమకొండ పెట్రోల్ పంపు వద్ద డీసీఎం వ్యాన్, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులు రమేశ్ (46), సరస్వతి (38)గా గుర్తించారు. వీరి స్వస్థలం మెదక్ జిల్లా నిజాంపేట మండలం నష్కల్. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి …
Read More »అర్హులకు రెండు పడక గదుల ఇళ్ళు ఇవ్వాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవనగర్ కాలనిలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ల ఎదుట అర్హులకు డబల్ బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 16 కోట్ల రూపాయలతో నిర్మించిన డబల్ బెడ్‌రూమ్ …
Read More »మౌలిక వసతుల కోసం ప్రతిపాదనలు తయారుచేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మనబడి కార్యక్రమంలో భాగంగా మండలాల వారీగా 100 మంది విద్యార్థులకు పైగా ఉన్న పాఠశాలలను గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడారు. పాఠశాలలో అదనపు గదులు, మౌలిక వసతుల కోసం అధికారులు …
Read More »ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. శాఖల వారీగా వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా …
Read More »