Kamareddy

ఉప్పలవాయిని ఆదర్శ గ్రామంగా మార్చాలి

కామారెడ్డి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉప్పల్వాయిని జిల్లాలో ఆదర్శ గ్రామం గా మార్చాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామసభకు శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కృషి చేసి గ్రామంలోని సమస్యలను దశల వారీగా పరిష్కరించాలని సూచించారు. గ్రామంలోని తడి, పొడి చెత్తను డంపింగ్‌ …

Read More »

టెట్‌కు ఏర్పాట్లు పూర్తిచేయాలి

కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టెట్‌ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో వివిధ శాఖల అధికారులతో టెట్‌ పరీక్ష ఏర్పాట్లపైసమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో 5,356 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని చెప్పారు. జూన్‌ 12న పేపర్‌ 1 ఉదయం 9:30 గంటల …

Read More »

దశలవారిగా మౌలిక వసతులు కల్పిస్తాం

కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి టౌన్‌షిప్‌లో దశలవారీగా మౌలిక వసతులను కల్పిస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. గెలాక్సీ ఫంక్షన్‌హాల్‌లో ధరణి టౌన్షిప్‌ లోని ప్లాట్లు, గృహాల విక్రయానికి సోమవారం బహిరంగ వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడారు. రోడ్లు, విద్యుత్తు, తాగునీరు వసతులు కల్పిస్తామని తెలిపారు. ఎటువంటి చిక్కులు లేని డిటిసిపి …

Read More »

జ్యూట్‌ బ్యాగులు, బట్టల సంచులు వాడాలి

కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూలై 1 నుంచి కామారెడ్డి జిల్లాలో ప్లాస్టిక్‌ బ్యాగులను నిషేధించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం జిల్లాస్థాయి టాస్క్ఫోర్స్‌ సమావేశంలో మాట్లాడారు. కిరాణా దుకాణాలు క్యారీ బ్యాగులు వాడవద్దని సూచించారు. జ్యూట్‌ బ్యాగులు, బట్టల సంచులు వాడాలని కోరారు. మటన్‌, చికెన్‌ దుకాణాలలో …

Read More »

తెలంగాణలో పల్లెలు, పట్టణాలు అభివృద్ది చెందాయి

కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతదేశంలో ఉన్న పట్టణాలు, పల్లెల కన్న తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాలు, పల్లెలు అభివృద్ధి చెందాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం పల్లె, పట్టణ ప్రగతి సన్నాహక సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న పట్టణాలు …

Read More »

ప్లాట్ల వేలంపై ఫ్రీ బెడ్‌ సమావేశం

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి రోడ్డులోని గెలాక్సీ ఫంక్షన్‌ హాల్‌లో శనివారం ఉదయం 10:30 గంటలకు ధరణి టౌన్షిప్‌ ప్లాట్ల కొనుగోలుపై ఫ్రీ బెడ్‌ సమావేశం ఉంటుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. సమావేశానికి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ప్లాట్లు, అసంపూర్తిగా ఉన్న గృహాల కొనుగోలుపై ఆసక్తి ఉన్న ప్రజలు సకాలంలో హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని కోరారు. …

Read More »

మానవ జీవితానికి సార్ధకత సేవా మార్గమే…

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ, పీజీ కళాశాలలో గత నెల రోజుల నుండి సేవాభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెట్‌ ఉచిత శిక్షణ తరగతులు గురువారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సేవా భారతి ప్రాంత ఉపాధ్యక్షులు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మానవ జీవితానికి సార్ధకత సేవమార్గమేనని, ప్రతి ఒక్కరూ వారికి సాధ్యమైనంత వరకు తోటివారికి సహాయం …

Read More »

పెళ్లిరోజు సందర్భంగా రక్తదానం

కామారెడ్డి, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్‌ రక్తనిధి కేంద్రంలో మంగళవారం పెళ్లిరోజు పురస్కరించుకొని సుజిత్‌ ఉమారాణి దంపతులు రక్తదానం చేయడం అభినందనీయమని రెడ్‌ క్రాస్‌, ఐవిఎఫ్‌ జిల్లా సమన్వయకర్త బాలు తెలిపారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా రక్త దానం గొప్పదని రక్తదానం చేయడం వల్ల తోటి వారి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి …

Read More »

ఆరోగ్య శ్రీ సమర్థవంతంగా అమలు చేయాలి

కామారెడ్డి, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆరోగ్యశ్రీ పథకంను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మంగళవారం ఆరోగ్యశ్రీ అమలుపై జరిగిన శిక్షణ కేంద్రానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రతి వారం రోజులకు ఒకసారి …

Read More »

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ బాలుర పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని, అలాగే బీబీపేట బాలుర పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. ప్రశ్నపత్రాల వివరాలను ఆరా తీశారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రంలో మౌలిక వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ వసతి గృహంలో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »