Kamareddy

సెర్ఫ్‌ లక్ష్యాల సాధనకు కట్టుదిట్టమైన చర్యలు….

కామారెడ్డి, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెర్ఫ్‌ సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు కట్టుదటమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి లోకేష్‌ కుమార్‌ అన్నారు. గురువారం రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ కార్యదర్శి, సెర్ఫ్‌ కార్యక్రమాలపై సెర్ఫ్‌ సీఈఓ డి. దివ్య తో కలిసి జిల్లా కలెక్టర్‌ లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ …

Read More »

టీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ విందు..

కామారెడ్డి, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముస్లిం మతస్తుల పవిత్ర మాసమైన రంజాన్‌ మాసమును పురస్కరించుకొని జిల్లా ఎంప్లాయిస్‌ జేఏసీ చైర్మన్‌, టీఎన్జీవోస్‌ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెంకట్‌ రెడ్డి అధ్యక్షతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయములో బుధవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌, జిల్లా ఎస్పీ రాజేష్‌ చంద్ర, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌ రెడ్డి, విక్టర్‌ ముఖ్య అతిథులుగా కామారెడ్డి …

Read More »

ఇండ్ల నిర్మాణాలు త్వరగా చేపట్టాలి

కామారెడ్డి, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన నిరుపేద లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు మార్కవుట్‌ ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో గృహ నిర్మాణం, పంచాయతీ రాజ్‌, విద్యుత్‌, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అర్హులైన నిరుపేద లబ్ధిదారుల జాబితాల ప్రతిపాదనల మేరకు …

Read More »

మాల్‌ ప్రాక్టీస్‌ కు తావివ్వకుండా పరీక్షలు నిర్వహించాలి

కామారెడ్డి, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాల్‌ ప్రాక్టీస్‌ కు తావివ్వకుండా పదవతరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల దేవుని పల్లి కేంద్రాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పలు తరగతి గదులను, చీఫ్‌ సూపరింటెండెంట్‌ గదులను పరిశీలించారు. అనంతరం చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్టుమెంటు అధికారులతో మాట్లాడుతూ, పరీక్ష సమయానికి …

Read More »

ధాన్యం కొనుగోళ్ళకు ఏర్పాట్లు పూర్తి

కామారెడ్డి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కలెక్టరేట్‌ కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ మాట్లాడుతూ రబీ సీజన్‌లో ధాన్యం సేకరణకు 446 కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు కొనుగోలు కేంద్రాల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. రానున్న యాసంగి సీజన్‌ లో 26 వేల ఎకరాల …

Read More »

ఎల్‌.ఆర్‌.ఎస్‌. ప్రక్రియను వేగవంతం చేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్‌.ఆర్‌.ఎస్‌. ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయంలో ఎల్‌.ఆర్‌.ఎస్‌. క్రింద చేపడుతున్న కార్యక్రమాలను కలెక్టర్‌ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, లే అవుట్ల క్రమబద్దీకరణకు ఈ నెల 31 తో ముగిస్తున్నందున దరఖాస్తుదారులు త్వరితగతిన ఫీజు చెల్లించి 25 శాతం రిబెట్‌ పొందవచ్చని తెలిపారు. దరఖాస్తు …

Read More »

అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి

కామారెడ్డి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల విజ్ఞాపనలు స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ రోజు పలు సమస్యలపై (131) అర్జీలు రావడం జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ …

Read More »

నీటి సమస్య ఉంటే వెంటనే ఫోన్‌ చేయండి…

కామారెడ్డి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ, పట్టణ ప్రాంతంలో త్రాగు నీటి సమస్య ఉంటే వెంటనే కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన త్రాగునీటి మానిటరింగ్‌ సెల్‌కు ఫోన్‌ చేసి సమస్య వివరించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో త్రాగునీటి సమస్య తలెత్తినపుడు కలెక్టరేట్‌ లో ఏర్పాటుచేసిన మానిటరింగ్‌ సెల్‌ నెంబర్‌ 9908712421 కు కాల్‌ చేసి తెలియజేయవచ్చునని …

Read More »

ప్రతిభా పరీక్షలు విద్యార్థుల భయాన్ని తొలగిస్తాయి…

కామారెడ్డి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో విఆర్కే అకాడమీలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మోడల్‌ ఎంసెట్‌ నీట్‌ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షలు 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బాలు మాట్లాడుతూ ఎంసెట్‌, నీట్‌ పరీక్షలకు పోటీ తీవ్రంగా పెరిగిపోవడం జరిగిందని సరైన …

Read More »

మోడల్‌ ఎంసెట్‌, నీట్‌ పరీక్ష కరపత్రాల ఆవిష్కరణ…

కామారెడ్డి, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగు నాడు విద్యార్థి సమైక్య టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ఇంకా పూర్తి చేసుకున్న విద్యార్థుల కోసం ఉచిత నమూనా ఎంసెట్‌ నీట్‌ పరీక్షను ఆదివారం ఉదయం 10 గంటల నుండి ఒకటి గంటల వరకు వీఆర్కే అకాడమీలో నిర్వహించడం జరుగుతుందని దానికి సంబంధించిన కరపత్రాలను టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బాలు, ప్రముఖ గణిత శాస్త్ర అధ్యాపకులు జలిగామ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »