కామారెడ్డి, మే 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగం కామారెడ్డి పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలోని ప్రాథమిక ఉర్దూ మీడియం పాఠశాలలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం పరిశీలించారు. పాఠశాలలోని తరగతి గదులు, వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతుల కల్పన కోసం అధికారులు ప్రతిపాదనలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎల్లయ్య, ఆయాపాఠశాలల ప్రధానోపాధ్యాయులు, …
Read More »పోషకాహారం సక్రమంగా అందేలా చూడాలి
కామారెడ్డి, మే 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలో స్వచ్ఛందంగా సేవలందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో గత సెప్టెంబర్ లో అంగన్ వాడి కేంద్రాలలో పోషకాహార లోపంతో 1400 …
Read More »పరీక్ష కేంద్రాలు తనిఖీ చేసిన కలెక్టర్
కామారెడ్డి, మే 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని శ్రీ సాందీపని జూనియర్ కళాశాల, మైనార్టీ బాలికల వసతి గృహంలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. ప్రశ్నపత్రాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్ లను పరిశీలించారు. పరీక్షలు సజావుగా నిర్వహించాలని సూచించారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా అధికారులు తనిఖీలు చేయాలని కోరారు. ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు …
Read More »చిన్నారులకు పౌష్టికాహారం అందజేయాలి
కామారెడ్డి, మే 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. చిన్నారుల బరువు, ఎత్తు వివరాలను అడిగి తెలుసుకున్నారు. వయసుకు తగ్గ బరువు, ఎత్తు లేని పిల్లలను గుర్తించి వారికి అదనంగా పౌష్టికాహారం అందించాలని సూచించారు. గర్భిణీలు, తల్లులను అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న …
Read More »కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు అందజేయాలి
కామారెడ్డి, మే 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను తక్షణమే ట్యాబ్లో ఎంట్రీ చేయాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం సహకార సంఘాల కార్యదర్శులు, ఉప తహసీల్దార్లతో దాన్యం కొనుగోళ్ల పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు శుభ్రం చేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి విక్రయించాలని …
Read More »కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలి
కామారెడ్డి, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద మొదటి విడత ఎంపికైన పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం ఇంజనీరింగ్ అధికారులతో మంజూరైన పాఠశాలల ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు. ప్రతి ఇంజనీరింగ్ అధికారి రోజుకు మూడు పాఠశాలల చొప్పున …
Read More »కామారెడ్డిలో 91.16 శాతం రుణ వితరణ పూర్తి
కామారెడ్డి, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : త్వరితగతిన బ్యాంక్ అధికారులు రుణ వితరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వార్షిక ప్రణాళికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రుణ వితరణ బ్యాంకుల ద్వారా రూ.4700 కోట్లు కేటాయించారని చెప్పారు. వీటిలో రూ.4284 …
Read More »వారం రోజుల్లో విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం
కామారెడ్డి, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వారం రోజుల వ్యవధిలో ధరణి టౌన్‌షిప్‌లో విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని గెలాక్సీ ఫంక్షన్ హాల్‌లో ప్లాట్ల, గృహాల విక్రయంపై గురువారం ఫ్రీ బెడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సౌకర్యం కల్పిస్తామని సూచించారు. మౌలిక వసతుల కల్పనకు కృషి …
Read More »కోనాపూర్‌ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం…
కామారెడ్డి, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులకు రైతుబంధు, బీమా సౌకర్యం కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర మున్సిపల్, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బీబీ పేట మండలం కోనాపూర్‌లో మంగళవారం పలు అభివృద్ధి పనులకు భూమి పూజ, గ్రామపంచాయతీ భవనానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. గతంలో పోసానిపల్లిగా ఉన్న …
Read More »ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు …
Read More »