Kamareddy

భూ సర్వే ఫిర్యాదులు పెండిరగ్‌ లేకుండా చూడాలి

కామారెడ్డి, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూమి సర్వే ఫిర్యాదులు పెండిరగ్‌ లేకుండా చూడాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. శనివారం తన చాంబర్లో ఆర్‌డివోలు, మండల సర్వేయర్లులతో శనివారం భూమి కొలతల అంశంపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో భూ వివాదాలు లేకుండా సర్వేయర్లు కొలతలు చేపట్టి పరిష్కారం చేయాలని సూచించారు. పెండిరగ్లో ఉన్న ఫైళ్ళను తక్షణమే పరిష్కరించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్డీవోలు …

Read More »

ప్రతిపాదనలు త్వరగా పూర్తిచేయాలి

కామారెడ్డి, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు మన బడి మొదటి విడతకు ఎంపికైన పాఠశాలల ప్రతిపాదనలు త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శనివారం ఆయన కామారెడ్డి కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో విద్యాశాఖ, ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలను సందర్శించి అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి ప్రతిపాదనలను పూర్తిచేయాలని కోరారు. ఉపాధి హామీ …

Read More »

రహదారి భద్రత మన అందరి బాధ్యత

కామారెడ్డి, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు భద్రత నియమ నిబంధనలపై అవగాహన కల్పించాలని రోడ్స్‌, రైల్వేస్‌ అడిషనల్‌ డిజిపి సందీప్‌ శాండిల్య అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం రహదారి భద్రత మన అందరి బాధ్యత అనే అంశంపై అవగాహన సదస్సులో మాట్లాడారు. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి రోడ్డున పడుతున్నాయని …

Read More »

డ్రోన్‌ ద్వారా పిచికారి చేయడం సులభం

కామారెడ్డి, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డ్రోన్‌ యంత్రం ద్వారా పురుగుమందులు పిచికారి చేయడం సులభమని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద శుక్రవారం డ్రోన్‌ యంత్రం ద్వారా పురుగుమందులు పిచికారీ చేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా చూశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. 7 నిమిషాల్లో ఎకరం పంటకు పురుగుమందులు పిచికారి చేయవచ్చని సూచించారు. మహిళా …

Read More »

సృజనాత్మకతను వెలికితీసే వేదిక కావాలి

కామారెడ్డి, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో 6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన కళాభారతి ఆడిటోరియం భవనాన్ని శుక్రవారం రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్బంగా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడారు. సృజనాత్మకతను వెలికి తీసే వేదిక కళాభారతి కావాలని అని తెలిపారు. కామారెడ్డి ప్రజలకు గంప గోవర్ధన్‌ లాంటి నాయకులు దొరకడం …

Read More »

వాహన యజమానులకు ముఖ్య సూచన

కామారెడ్డి, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా వాహన యజమానులు తమ తమ వాహనపత్రాలు (డ్రైవింగ్‌ లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌, ఫిట్‌ నెస్‌, పర్మిట్‌, టాక్స్‌, ఇన్సూరెన్స్‌) తదితర అన్ని రకాల పత్రాలు సరి చేసుకొని రోడ్డుపైన తిరగాలని కోరారు. గత రెండు సంవత్సరాలుగా కరోనాతో ప్రజలు ఇబ్బంది పడ్డారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కొంత వెసలుబాటు కల్పించిందని, కానీ ఇప్పుడు వాహన పత్రాలు సరిచేసుకొని …

Read More »

హెల్మెట్‌ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలి

కామారెడ్డి, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ద్విచక్రవాహనాల చోదకులు హెల్మెట్‌ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్లో గురువారం రోడ్డు ప్రమాదాల నివారణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ద్విచక్రవాహనాల చోదకులు హెల్మెట్‌ ఉపయోగించక పోవడం వల్ల ప్రమాదం జరిగితే మృత్యువాత పడుతున్నారని తెలిపారు. జాతీయ రహదారిపై వేగం పరిమితి …

Read More »

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నే వందశాతం సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలి

కామారెడ్డి, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రిలో సీ-సెక్షన్లను తగ్గించి, సహజ ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వందశాతం సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సాధారణ ప్రసవాలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, గర్భిణుల నమోదు, ఏఎన్‌సి చెకప్‌, క్షయ వ్యాధి నిర్మూలన అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ …

Read More »

తడిసిన ధాన్యాన్ని ఆరబోసి విక్రయించాలి

కామారెడ్డి, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం వివరాలను జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అడిగి తెలుసుకున్నారు. గురువారం ఆయన రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల వారీగా సమీక్ష చేశారు. తడిసిన ధాన్యాన్ని ఆరబోసి కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని సూచించారు. రైతులకు అందుబాటులో టార్పాలిన్‌ కవర్లు ఉంచాలని కోరారు. టెలికాన్ఫరెన్స్‌లో జిల్లా సివిల్‌ సప్లై మేనేజర్‌ జితేంద్ర …

Read More »

యువకులు రక్త దానానికి ముందుకు రావడం అభినందనీయం

కామారెడ్డి, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్‌ రక్తనిధి కేంద్రంలో ఐవిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి మండలి చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా 50వ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా రక్తదానంలో తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శం అని, ఎంతో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »