కామారెడ్డి, మే 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పవిత్ర రంజాన్ వేడుకలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. పట్టణంలోని రైల్వే స్టేషన్ పక్కన గల ఖదిం ఈద్గవద్ద మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మొహమ్మద్ అలీ షబ్బీర్ ముస్లింలు రంజాన్ పండుగ (ఈద్-ఉల్-ఫితర్) ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకొని పవిత్ర రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు అందరికీ చెప్పారు. …
Read More »ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికతను అలవరుచుకోవాలి
కామారెడ్డి, మే 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాత్మా బసవేశ్వరుడు మహిళలకు ప్రత్యేక గౌరవం ఇచ్చేవారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల …
Read More »4న రక్తదాన శిబిరం
కామారెడ్డి, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 4వ తేదీ బుధవారం ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి మండలి చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని వీ.టి ఠాకూర్ బ్లడ్ బ్యాంకులో ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విశ్వనాధుల మహేష్ గుప్తా, గోవింద్ భాస్కర్ గుప్తా, …
Read More »మే 10 లోగా ప్రతిపాదనలు పూర్తిచేయాలి
కామారెడ్డి, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మే 10 లోగా మన ఊరు మన బడి మొదటి విడతలో ఎంపికైన పాఠశాలలకు ప్రతిపాదనలు పూర్తిచేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం వారు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్సులో జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకం కింద గుర్తించిన పనులకు …
Read More »సేవా భారతి ఆధ్వర్యంలో టెట్ శిక్షణ
కామారెడ్డి, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ పీజీ కళాశాలలో సేవాభారతి కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో టెట్ పేపర్ -1 ఉచిత శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయని శిక్షణ తరగతుల సమన్వయకర్త మార బాల్ రెడ్డి, కోర్స్ డైరెక్టర్ డాక్టర్ వేద ప్రకాష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సైకాలజీ స్టేట్ పేమ్ ఫ్యాకల్టీ, కోర్స్ డైరెక్టర్ డాక్టర్ వేద …
Read More »మొక్కలు నాటడానికి గుంతలు తీయించాలి
కామారెడ్డి, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని నర్సరీని సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. నర్సరీలో ఉన్న మొక్కలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో ఖాళీ స్థలాలను గుర్తించి హరిత హారంలో మొక్కలు నాటడానికి గుంతలు తీయించాలని అధికారులకు సూచించారు. గృహాలకు ఇవ్వడానికి అనువైన మొక్కలను పెంచాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, …
Read More »ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి
కామారెడ్డి, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ప్రజా విజ్ఞప్తులు, ఫిర్యాదులను సత్వరం పరిష్కారం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలోజిల్లా పరిషత్ సీఈవో సాయా గౌడ్, కలెక్టరేట్ ఏవో రవీందర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Read More »వేసవి శిక్షణా శిబిరాన్ని వినియోగించుకోవాలి
కామారెడ్డి, మే 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చిన్నారులు వేసవి శిక్షణ శిబిరాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియం లో ఆదివారం అథ్లెటిక్స్ వేసవి శిక్షణ శిబిరంను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడల వల్ల విద్యార్థులలో క్రమశిక్షణ పెరుగుతోందని సూచించారు. క్రీడల వల్ల స్నేహభావం పెరుగుతోందని చెప్పారు. క్రీడలు శారీరక …
Read More »హరితహారం కోసం స్థలాలు ఎంపిక చేయాలి
కామారెడ్డి, ఏప్రిల్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరిత హారంలో మొక్కలు నాటడానికి గ్రామాల్లోని చెరువు కట్టలు, కాలువల గట్ల స్థలాలను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలో శనివారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఇరిగేషన్, ఉపాధి హామీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాల వారిగా హరిత హారంలో …
Read More »కామారెడ్డిలో అగ్ని ప్రమాదం
కామారెడ్డి, ఏప్రిల్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం మధ్యాహ్నం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్టేషన్ రోడ్‌లో గల కోకా దుకాణాల వెనుక భాగంలో రైల్వే స్టేషన్ ప్రక్కనుంచి ఓరియంటల్ స్కూలు వరకు అగ్ని ప్రమాదం జరిగి చెట్లు, పొదలకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని మంటలు చేలరేగి మొత్తం వ్యాపించాయి. సకాలంలో స్థానికుల సమాచారం మేరకు ఫైరింజన్ల సహాయంతో నీళ్ళు పోసి మంటలను అదుపులోకి తెచ్చారు. చిరు …
Read More »