Kamareddy

న్యాయవాదులకు అండగా ఉంటా…

కామారెడ్డి, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయవాదులందరికీ అండగా ఉంటానని, ఎల్లప్పుడూ తమ అవసరాల కోసం సంప్రదించాలని కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పేర్కొన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కోర్టులోని బార్‌ అసోసియేషన్‌లో గంప గోవర్ధన్‌ ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. న్యాయవాదుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం కోసం మరో ఐదు …

Read More »

ప్రతి మండలానికి రెండు పాఠశాలల్లో పనులు

కామారెడ్డి, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి మండలానికి మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా రెండు పాఠశాలలను ఎంపిక చేసి పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బిచ్కుంద నుంచి జూమ్‌ కాన్ఫరెన్స్‌లో ఇంజనీరింగ్‌ అధికారులతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకం కింద పాఠశాలలో మరుగుదొడ్లు, వంటశాలలు, రక్షణ గోడ నిర్మాణం వంటి పనులు చేయడానికి ఇంజనీరింగ్‌ …

Read More »

టీబీ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టీబీ వ్యాధిని అంతమొందించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలనిజిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం ప్రపంచ టీబీ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2024 నాటికి జిల్లాలో టీబీ వ్యాధి …

Read More »

బస్తీ దవాఖాన కోసం భవన పరిశీలన

కామారెడ్డి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూరులో బస్తి దావఖాన ఏర్పాటుకోసం గ్రామ పంచాయతీ భవనం పక్కనే ఉన్న భవనాన్ని గురువారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. భవనంలో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్‌ సింగ్‌ను ఆదేశించారు. భవనం బస్తి దావఖానకు అనుకూలంగా ఉందని జిల్లా కలెక్టర్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు …

Read More »

కబడ్డీ టీంను అభినందించిన కలెక్టర్‌

కామారెడ్డి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెలలో 18, 19, 20 వ తేదీలలో వికారాబాద్‌ జిల్లాలో రాష్ట్రస్థాయి అండర్‌ – 20 మహిళా కబడ్డీ విభాగంలో తృతీయ స్థానం సాధించిన కామారెడ్డి జిల్లా జట్టును గురువారం కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, జిల్లా విద్యాశాఖాధికారి రాజు, జిల్లా యువజన క్రీడల అధికారి దామోదర్‌ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం

కామారెడ్డి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటకు చెందిన లాలమ్మల మంజులకు ఆపరేషన్‌ నిమిత్తమై పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో రక్తం అవసరం కావడంతో జిల్లా కేంద్రానికి చెందిన టాక్స్‌ కన్సల్టెంట్‌ శ్రీనివాస్‌కు తెలియజేయగానే మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి ఓ పాజిటివ్‌ రక్తాన్ని అందజేశారని కామారెడ్డి జిల్లా రెడ్‌ క్రాస్‌ సమన్వయకర్త బాలు తెలిపారు. గత 14 సంవత్సరాల నుండి …

Read More »

లాభదాయకమైన యూనిట్లు ఎంపిక చేసుకొని సుస్థిర ఆదాయాన్ని పొందాలి

కామారెడ్డి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలం మగ్దుంపూర్‌, సుల్తాన్‌ నగర్‌, మహమ్మద్‌ నగర్‌, గునకల్‌ గ్రామాల్లో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆధ్వర్యంలో దళిత బంధుపై అవగాహన సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. లాభదాయక యూనిట్లు ఎంపిక చేసుకొని లబ్ధిదారులు ప్రతినెల ఆదాయం పొందాలని సూచించారు. మిగతా లబ్ధిదారులకు ఆదర్శంగా నిలవాలన్నారు. ట్రాక్టర్లు, ఆటోలు సొంతంగా నడిపే …

Read More »

బిజెవైఎం ఆధ్వర్యంలో షహీద్‌ దివస్‌

కామారెడ్డి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్చ్‌ 23, 1931 రోజున నియంతృత్వ బ్రిటీషు ప్రభుత్వం భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన భగత్‌ సింగ్‌, సుఖ్‌ దేవ్‌ మరియు రాజ్‌ గురులను ఉరి తీసి చంపడం జరిగిందని, ఇట్టి రోజును అమరవీరులను స్మరించుకుంటూ షహీద్‌ దివస్‌ను జరపాలని బిజెవైఎం కేంద్ర కమిటీ పిలుపుమేరకు బుధవారం కామారెడ్డి పట్టణ బీజేవైఎం ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్‌లో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం …

Read More »

నర్సరీని పరిశీలించిన అదనపు కలెక్టర్‌

కామారెడ్డి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలం వేల్పు గోండలో నర్సరీని బుధవారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే సందర్శించారు. నర్సరీ లో మొక్కలు ఏపుగా పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి ని ఆదేశించారు. వచ్చే జూన్‌ నాటికి మొక్కలు నాటడానికి అనువుగా సిద్ధం చేయాలని సూచించారు. నర్సరీ లో పెంచుతున్న మొక్కలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. …

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 32 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 11 లక్షల 53 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అందజేశారు. కామారెడ్డి నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు మామిండ్ల నర్సింలు, కొనాపూర్‌ గ్రామానికి చెందిన దిడ్డి రాజు, యాడారం గ్రామానికి చెందిన నీరడి పర్శరాములు, మంథని దేవునిపల్లి గ్రామానికి చెందిన పోతరాజు లింగంలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »