Kamareddy

కోర్టు సముదాయాన్ని సందర్శించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి

కామారెడ్డి, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కోర్టు సముదాయాన్ని నిజామాబాద్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షులు గజ్జల బిక్షపతి ఆమెకు పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కామారెడ్డి సముదాయంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. …

Read More »

ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువతికి ప్లేట్‌ లేట్స్‌ అందజేత

కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో శ్రీజ (24) డెంగ్యూ వ్యాధితో తెల్లరక్తకణాలు సంఖ్య పడిపోవడంతో పేషెంట్‌ తల్లిదండ్రులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో బిబీపేట మండల కేంద్రానికి చెందిన బచ్చు శ్రీధర్‌ కుమార్‌ మానవతా దృక్పథంతో స్పందించి నిజామాబాద్‌ వెళ్లి ఆయుష్‌ బ్లడ్‌ బ్యాంకులో బి పాజిటివ్‌ ప్లేట్‌ లెట్స్‌ అందించి ప్రాణాలను …

Read More »

బిజెపిలో చేరిన అడ్లూర్‌ యువకులు

కామారెడ్డి, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణం 2వ వార్డు అడ్లూరు ఎస్‌సి కాలనీకి చెందిన 48 మంది అధికార పార్టీకి చెందిన నాయకులు, యువకులు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. పార్టీ జండా ఆవిష్కరణ చేసి, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కి పూల మాలలు వేశారు. ఈ సందర్భంగా కాటిపల్లి …

Read More »

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ…

కామారెడ్డి, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మీ పథకం పేదలకు వరంలా మారిందని ఎంపీపీ దశరథ్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో వివిధ గ్రామాల్లోని లబ్ధిదారులకు కల్యాణలక్మి చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద ఆడబిడ్డకు అండగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ముఖ్యమంత్రి …

Read More »

రోడ్డు ప్రమాద బాధితుడికి రక్తదానం

కామారెడ్డి, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రాజు అనే యువకుడికి ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తాన్ని నవీన్‌, భానుప్రసాద్‌ సహకారంతో సకాలంలో అందజేసి ప్రాణాలు కాపాడినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు, సభ్యులు శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న …

Read More »

మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలు సాగుచేసుకోవాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న ప్రత్యామ్నాయ పంటలు రైతులు సాగు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. దోమకొండ, బీబీపేట మండల కేంద్రంలోని రైతు వేదికలలో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రత్యామ్నాయ పంటలుగా పొద్దుతిరుగుడు, మినుము, శనగ, నువ్వులు, …

Read More »

ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి…

కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగిలో తెలంగాణలో ఉత్పత్తి చేయబడిన వరిని భారత ప్రభుత్వం ఎఫ్‌సిఐ సేకరించడం లేదని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి, కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామాల్లో బుధవారం ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. యాసంగిలో వరి ధాన్యానికి వరి కొనుగోలు కేంద్రాలు ఉండవన్నారు. …

Read More »

కరోనా రహిత జిల్లాగా మార్చాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా రహిత జిల్లాగా మార్చాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుధవారం జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి వ్యాక్సినేషన్‌ 100 శాతం అయ్యే విధంగా చూడాలని సూచించారు. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వచ్చే అవకాశం ఉన్నందున …

Read More »

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బుధవారం ఆయన టెలీ కాన్ఫరెన్సులో సహకార, సివిల్‌ సప్లై అధికారులతో మాట్లాడారు. ఐదు రోజుల్లో దాన్యం కొనుగోలు వంద శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు శుభ్రం చేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించే విధంగా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం …

Read More »

తల్లి జన్మను ఇస్తే.. రక్తదాతలు పునర్జన్మను ఇస్తారు

కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ ఓ నెగెటివ్‌ రక్తనిల్వలు లేకపోవడంతో లేకపోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలుకు తెలియజేయడంతో భిక్కనూరు మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్‌ రెడ్డి ఓ నెగిటివ్‌ రక్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు మాట్లాడుతూ చాలా తక్కువ మంది వ్యక్తుల్లో మాత్రమే …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »