Kamareddy

ప్రజావాణి ఫిర్యాదులను పరిశీలించి, పరిష్కారం చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను జిల్లా స్థాయి అధికారులు పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా సమస్యలను అధికారులు తక్షణమే …

Read More »

సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పైడి ఎల్లారెడ్డి స్ఫూర్తిగా నిలిచారు

కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ప్రముఖ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. తాడువాయి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం అమెరికా తెలుగు అసోసియేషన్‌ (అటా) అవార్డు గ్రహీత, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ పైడి ఎల్లారెడ్డి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై …

Read More »

ప్రగతి పనులు త్వరితగతిన పూర్తిచేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో చేపడుతున్న ప్రగతి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో శనివారం వార్డుల వారీగా చేపట్టిన ప్రగతి పనులపై ఇంజనీరింగ్‌ అధికారులతో ప్రభుత్వ విప్‌ సమీక్ష నిర్వహించారు. మురుగు కాలువలు, సిమెంట్‌ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణం పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని మునిసిపల్‌ ఇంజనీరింగ్‌ …

Read More »

ఉపకార వేతనాలు వంద శాతం అందేలా చూడాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకార వేతనాలు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వంద శాతం అదేవిధంగా ఆయా కళాశాల ప్రిన్సిపాల్స్‌ చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఉపకార వేతనాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 773 మంది ఎస్సీ ,ఎస్టీ విద్యార్థులు ఉన్నారని చెప్పారు. వీరందరి …

Read More »

ఆదర్శ మునిసిపాలిటీగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి పాలకవర్గం సభ్యులు, అధికారులు కృషి చేయాలని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. సత్య కన్వెన్షన్‌లో శనివారం కామారెడ్డి మున్సిపల్‌ 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ సమావేశం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జాహ్నవి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ప్రభుత్వ విప్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు, రాష్ట్ర …

Read More »

పోలియో శాశ్వత నిర్మూలనకు కృషి చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్స్‌ పోలియోను శాశ్వతంగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం పల్స్‌ పోలియో ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలని కోరారు. చిన్న పిల్లలకు పోలియో చుక్కలు రక్షణగా …

Read More »

కామారెడ్డి కోర్టు సమస్యలు పరిష్కరించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్‌ విజయ సేన రెడ్డిని శుక్రవారం కామారెడ్డి జిల్లా కోర్ట్‌ బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు హైకోర్టులో కలిశారు. కామారెడ్డిలో రెండవ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు, పోక్సో కోర్టు వెంటనే ఏర్పాటు చేయాలని, కామారెడ్డి కోర్టులోని సమస్యలను పరిష్కరించాలని బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు విజ్ఞాపన పత్రం అందజేశారు. కోర్టులో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ …

Read More »

జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది పరచాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలని జహీరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు బీ బీ పాటిల్‌ అన్నారు. శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమీక్ష సమావేశం ఎంపీ బీబీ పాటిల్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా …

Read More »

రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌ జిల్లా లక్ష్మాపూర్‌ గ్రామానికి చెందిన నందరబోయిన వసంత (48) కు ఇన్ఫెక్షన్‌ సోకడంతో వైద్యులు కాలు తొలగించడానికి ఓ పాజిటివ్‌ రక్తం అవసరమని తెలియజేయడంతో వెంటనే స్పందించి పట్టణానికి చెందిన యువకుడు భరత్‌ 27వ సారి ఓ పాజిటివ్‌ రక్తాన్ని సకాలంలో ప్రభుత్వ వైద్యశాల కామారెడ్డిలో అందించి ప్రాణాలు కాపాడినట్టు కామారెడ్డి జిల్లా జూనియర్‌ రెడ్‌ క్రాస్‌ …

Read More »

ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు

కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూరు మండలం జంగంపల్లిలో గురువారం ప్రభుత్వ భూములను రెవిన్యూ జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ పరిశీలించారు. మ్యాప్‌ ఆధారంగా ప్రభుత్వ భూముల సర్వే నెంబర్ల వారిగా పరిశీలించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆయన వెంట కామారెడ్డి ఇంచార్జ్‌ ఆర్‌డిఓ శీను నాయక్‌, అధికారులు ఉన్నారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »