కామారెడ్డి, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జాతీయ రహదారి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో 765, డి, జాతీయ రహదారి పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అటవీ, మిషన్ భగీరథ, విద్యుత్తు, హైవే అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శాఖల వారీగా పనులు పెండిరగ్ లేకుండా చూడాలని …
Read More »కొనుగోలు కేంద్రాలలో ట్యాబ్ ఎంట్రీ తక్షణమే పూర్తిచేయాలి
కామారెడ్డి, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ట్యాబ్ ఎంట్రీ తక్షణమే పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయం నుంచి టెలీ కాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడారు. ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని కొనుగోలు కేంద్రం ఇంచార్జిలను ఆదేశించారు. రైతులకు డబ్బులు సకాలంలో అందేలా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకు వచ్చిన రైతులు ఆధార్ …
Read More »ప్రజావాణి ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి
కామారెడ్డి, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఇన్చార్జి జిల్లా అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. వాటిని సంబంధిత శాఖలకు అందజేసి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. …
Read More »ఏఎన్‌ఎంపై దాడి కేసులో ఇద్దరి అరెస్ట్
కామారెడ్డి, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బావరి సావిత్రి (42) కామారెడ్డి నివాసురాలు పోతంగల్ సబ్ సెంటర్, గాంధారి మండలం నందు ఏఎన్‌ఎంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ, ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఏఎన్‌ఎం, వైద్య శాఖ అధికారుల ద్వారా అందరికీ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈనెల ఒకటవ తేదీన రాంపూర్ గడ్డ గాంధారి మండలానికి చెందిన వడ్డే శ్రీలత (22) కి మొదటి …
Read More »సఖి సిబ్బందికి పోలీసులు సహకరించాలి…
కామారెడ్డి, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డి ఎస్‌పి కార్యాలయంలో అడిషనల్ ఎస్‌పి ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న 3 డివిజన్ డిఎస్‌పిలు, 22 మండలాల ఎస్‌ఐలకు నిర్వహించబడిన సమావేశంలో సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ ఆర్. సాయవ్వ, కౌన్సిలర్ పుష్ప పాల్గొన్నారు. ముఖ్యంగా సఖి సెంటర్ అందిస్తున్న 5 రకాల సేవల గురించి వివరిస్తూ అత్యవసర సమయంలో 181 కాల్ చేసిన్నప్పుడు సఖి సిబ్బంది అర్ధరాత్రి …
Read More »గిరిజన బాలుర వసతి గృహం తనిఖీ
కామారెడ్డి, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని గిరిజన బాలుర వసతిగృహంను శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. వసతి గృహంలోని మరుగుదొడ్లను పరిశీలించారు. కొన్ని గదులు శిథిలావస్థకు చేరడంతో వాటికి మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. కిటికీలకు జాలీలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత స్థాయిలో నిలవాలని సూచించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో …
Read More »బాధితులకు సత్వర న్యాయం అందాలి
కామారెడ్డి, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డి పట్టణం ఈఎస్‌ఆర్ గార్డెన్‌లో మెగా లీగల్ క్యాంప్ నిర్వహించారు. కార్యక్రమానికి జూనియర్ సివిల్ జడ్జి కామారెడ్డి స్వాతి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి జె విక్రమ్ పాల్గొని మాట్లాడారు. జాతీయ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాల మేరకు భారతావని 75 ఏళ్ల స్వతంత్ర దినోత్సవం …
Read More »సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో కాలోజీ వర్ధంతి
కామారెడ్డి, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం పక్కన గల మిస్టర్ టీ పాయింట్ హోటల్లో తెలంగాణ ప్రజా కవి కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ కామారెడ్డి జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు మాట్లాడుతూ …
Read More »ఈవిఎం గోదాం నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో ఈవీఎం గోదాం నిర్మాణం పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు. నాణ్యతగా పనులు చేపట్టాలని పేర్కొన్నారు. కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను సందర్శించి ఈవీఎం మిషన్లలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Read More »ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండలం భవాని పేటలో దాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో వరి కుప్పలు ఎన్ని నిల్వ ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. 180 ధాన్యం కుప్పలు ఉన్నాయని, 120 కుప్పల ధాన్యం తేమ శాతం నిర్ధారణ చేసినట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం కుప్పలు …
Read More »