కామారెడ్డి, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సైబర్ నేర రహిత జిల్లాగా తీర్చి దిద్దడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం సైబర్ నేరాలపై జిల్లా స్థాయి అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై కలెక్టర్ మాట్లాడారు. అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి, కష్టార్జితాన్ని ఆన్‌లైన్‌లో …
Read More »వచ్చే హరితహారం కోసం ప్రతిపాదనలు సిద్దం చేసుకోవాలి…
కామారెడ్డి, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వచ్చే హరిత హారంలో పెద్ద మొక్కలు నాటడానికి కావలసిన మొక్కల కోసం మున్సిపల్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం ఆయన టెలికాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడారు. మున్సిపాలిటీల వారీగా, మండలాల వారీగా పెద్ద మొక్కలు నాటడానికి ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేయాలని ఆదేశించారు. అటవీ శాఖ …
Read More »ప్రతి ధాన్యం గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది…
కామారెడ్డి, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు పండిరచిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీర్కూర్ మండలం తిమ్మాపూర్ లో రైస్ మిల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో దాన్యం పండిరచడంలో బాన్సువాడ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని చెప్పారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి …
Read More »పండ్ల మొక్కలతో రైతులకు ఆదాయం
కామారెడ్డి, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నస్రుల్లాబాద్ మండలం మైలారంలో పల్లె ప్రక ృతి వనంను శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ప్రకృతి వనం లో మొక్కలు వృక్షాలుగా మారడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అంకుల్ క్యాంపులో అవెన్యూ ప్లాంటేషన్ల పొలాల వద్ద మామిడి, బొప్పాయి మొక్కలు నాటడం వల్ల రైతులకు ఆదాయం వచ్చే వీలుందని సూచించారు. ఉపాధి హామీ …
Read More »కామారెడ్డిలో 343 కొనుగోలు కేంద్రాలు
కామారెడ్డి, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో 343 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »పీజీ సెట్ ఫలితాల్లో ఆర్కె విద్యార్థుల ప్రభంజనం
కామారెడ్డి, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పిజి సెట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ఆర్‌కె డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచారనీ ఆర్కె కళాశాలల సీఈవో జైపాల్ రెడ్డి తెలిపారు. పిజి తెలుగు విభాగంలో కే సంధ్య రాష్ట్రస్థాయి రెండో ర్యాంకును, భౌతిక శాస్త్ర విభాగంలో భానుప్రసాద్ …
Read More »అర్హత గల సంఘాలకు రుణాలు ఇప్పించాలి…
కామారెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వయం సహాయక సంఘాలు ఈ నెల 30 లోగా 80 శాతం బ్యాంకు లింకేజీ రుణాల లక్ష్యాన్ని అధిగమించే విధంగా ఐకేపీ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం రాత్రి జరిగిన వీడియో కాన్ఫరెన్సులో ఐకెపి అధికారులతో మాట్లాడారు. అర్హత గల ప్రతి స్వయం సహాయక …
Read More »తప్పులుంటే సరిదిద్దుకోవాలి…
కామారెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ల జాబితాలో తప్పులు ఉంటే 1.11.2021 నుంచి 30.11.2021 వరకు బూత్ లెవల్ అధికారులకు తెలిపి సరిదిద్దుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. నవంబర్ 1న ఎన్నికల ముసాయిదా జాబితా విడుదల చేస్తామని చెప్పారు. రాజకీయ పార్టీలకు సిడి, పెన్ …
Read More »ఉచిత న్యాయసేవ అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలి
కామారెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా గ్రామస్థాయిలో ఉచిత న్యాయ సేవ సహాయం కోసం అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయంలో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. గ్రామస్థాయిలో వివిధ శాఖలకు ఉన్న చట్టాల గురించి అవగాహన కల్పించాలని కోరారు. దారిద్య్ర రేఖకు …
Read More »భూ వివాదాలు లేకుండా సమన్వయం చేసుకోవాలి
కామారెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవీ, రెవిన్యూ భూవివాదాలు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో బుధవారం రెవెన్యూ, ఫారెస్ట్ భూ సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫారెస్ట్ అధికారులు భూములకు బౌండరీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. ధరణిలో పెండిరగ్ లేకుండా చూసుకోవాలని …
Read More »