కామారెడ్డి, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విజయదశమి సందర్భంగా కామారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదులు ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను మర్యాదపూర్వకంగా శనివారం ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను కలిసి వారిలో కామారెడ్డి అదనపు జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జెల బిక్షపతి ముదిరాజ్, ఉపాధ్యక్షులు జోగుల గంగాధర్, జిపి నరేందర్ రెడ్డి, పిపి దామోదర్ రెడ్డి తదితరులు …
Read More »లింబాద్రి నర్సింహస్వామిని దర్శించుకున్న సినీ నిర్మాత
భీమ్‌గల్, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ లింబాద్రి లక్ష్మీ నృసింహ స్వామి లింబాద్రి గుట్టకి శనివారం రోజు భక్తులు పోటెత్తారు. ఉదయం 6 గంటల నుండి భక్తుల తాకిడి ఉంది. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ తెలుగు సినీ పరిశ్రమల నిర్మాత దిల్ రాజు స్వామి వారిని దర్శించుకున్నారు. వారిని మర్యాద పూర్వకంగా శాలువా కప్పి …
Read More »అంబులెన్స్‌లో ప్రసవం, తల్లి, బిడ్డ క్షేమం
కామారెడ్డి, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని లింగంపెట మండలం, రామయిపల్లి తండాకు చెందిన వనితకు పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్ సేవల కోసం ఫోను చేయగా .. దేవశోత్ వనిత (18) ని, లింగంపేట (పి హెచ్ సి.) ప్రభుత్వ ఆసుపత్రి నుండి రిఫర్ చేయడంతో.. కామారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమెకి పురిటి నొప్పులు అధికం అయ్యాయి. దీంతో అంబులెన్స్‌లో సుఖ …
Read More »రోజు వారి లక్ష్యాలు పూర్తయ్యేలా చూడాలి…
కామారెడ్డి, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరోగ్య కార్యకర్తలు కొవిడ్ వ్యాక్సినేషన్ రోజు వారి లక్ష్యాలను పూర్తిచేసే విధంగా వైద్యాధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్యాధికారులు, మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ సంఘాల మహిళలు సహకారం తీసుకుని గ్రామాల్లో 100 శాతం వ్యాక్సినేషన్ విజయవంతం చేయాలని …
Read More »మెడికల్ కళాశాల కోసం స్థల పరిశీలన
కామారెడ్డి, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో డెయిరీ కళాశాల సమీపంలో మెడికల్ కళాశాల భవన నిర్మాణం కోసం 40 ఎకరాల స్థలాన్ని బుధవారం ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. అనంతరం ఆడిటోరియం నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ …
Read More »వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి
కామారెడ్డి, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయం నుంచి వైద్యశాఖ, ఎంపీవోలతో టెలి కాన్ఫరెన్సులో మాట్లాడారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ చేయాలని సూచించారు. వైద్య సిబ్బందికి, ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు సహకారం అందించాలని కోరారు. మండల స్థాయి అధికారులు, వైద్య సిబ్బంది …
Read More »హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్ ఓటమి తధ్యం
కామారెడ్డి, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ అసమర్థ పాలన వల్ల 200ల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 58 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు పెంచడం కేసీఆర్ తుగ్లక్ పాలనకు నిదర్శనమని, రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని భావిస్తే నోటిఫికేషన్లు వెయ్యకుండా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునేలా చేసిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదే అని హుజురాబాద్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను …
Read More »కంపోస్ట్ షెడ్లు వినియోగించాలి…
కామారెడ్డి, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతిలో చేపట్టిన కంపోస్ట్ షెడ్లు వినియోగించి పంచాయతీల ఆదాయాన్ని పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. మంగళవారం ఆయన గాంధారి గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల వివరాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైకుంఠ ధామాలు అన్ని గ్రామాల్లో వాడుకలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఊట చెరువుల …
Read More »వ్యాక్సిన్ తీసుకున్న వారికి సన్మానం…
కామారెడ్డి, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొవిడ్ వ్యాక్సినేషన్ పై ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావద్దని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. బాన్సువాడ పట్టణంలోని ఇస్లాంపుర, బీసీ కాలనిలో వైద్య శాఖ ఆధ్వర్యంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వైద్య సిబ్బంది మంగళవారం ఇంటింటికి తిరిగి వ్యాక్సినేషన్ చేశారు. వ్యాక్సినేషన్ వేయించుకొని వారింటికి వెళ్లి కలెక్టర్ వారితో చర్చించి వ్యాక్సినేషన్ వేయించుకునే విధంగా …
Read More »కలెక్టర్ స్వయంగా వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించారు….
కామారెడ్డి, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డిలో మంగళవారం ఇంటింటికి తిరుగుతూ వైద్య సిబ్బంది కొవిడ్ వ్యాక్సినేషన్ చేశారు. వ్యాక్సినేషన్ వేయించుకొని ఓ కుటుంబ సభ్యులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చర్చించి వ్యాక్సినేషన్ వేయించుకునే విధంగా అవగాహన కల్పించారు. వ్యాక్సినేషన్ వేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కుటుంబంలోని ఐదుగురికి వ్యాక్సిన్ వేయించారు. 95 ఏళ్ల వృద్ధురాలు అఫీజాబేగంకు వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. కొవిడ్ …
Read More »