కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ ధరణి టౌన్ షిప్ రిజిస్ట్రేషన్ రుసుము రూ. 3000 దరఖాస్తుదారునికి తిరిగి చెల్లించుటకు సంబంధిత పత్రాలతో ఈనెల 28 లోపు కామారెడ్డి కలెక్టరేట్లోని హెచ్ సెక్షన్‌లో కలవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. సంబంధిత దరఖాస్తుదారులు ఈ సేవ రసీదు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకం, పాన్ …
Read More »25న చెక్కుల పంపిణీ
కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 25న మంగళవారం ఉదయం 11 గంటలకు ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి నియోజకవర్గంలోని చిరు వ్యాపారులకు రూ. 50 వేల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేయనున్నారని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పి చైర్ పర్సన్ శోభ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, మున్సిపల్ …
Read More »దోమకొండ మండల సమాఖ్యకు ట్రాక్టర్ అందజేత
కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ మండల పరిషత్ కార్యాలయం అవరణలో మండల సమాఖ్య ఆధ్వర్యంలో వ్యవసాయ ఆధునిక పరికరాల అద్దె కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం సబ్సిడీపై మండల సమాఖ్యకు మంజూరు చేసిన ట్రాక్టర్‌ను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అందజేశారు.
Read More »గ్రామాల వారిగా అర్హుల పేర్లు నమోదు చేయాలి…
కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల వారీగా దళిత బంధు పథకం కోసం అర్హులైన లబ్ధిదారుల పేర్లను నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మండల స్థాయి అధికారులతో మాట్లాడారు. ఈనెల 25లోగా పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారుల సంఖ్యను గుర్తించి జిల్లా స్థాయి అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. …
Read More »బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి…
కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తల్లిదండ్రులు బాల, బాలికలను సమానంగా చూడాలని సూచించారు. బాలికలు తమకు నచ్చిన లక్ష్యాన్ని …
Read More »రిపబ్లిక్ డే ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో సోమవారం గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. జాతీయ జెండా ఏర్పాటు చేయవలసిన స్థలాన్ని చూశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో రవీందర్, అధికారులు పాల్గొన్నారు.
Read More »రేపటి ప్రజావాణి రద్దు
కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 24న సోమవారం కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వ్యాధి వ్యాప్తి, కేసులు పెరుగుతున్న దృష్ట్యా 24న సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని …
Read More »కరోన నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి…
కామారెడ్డి, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో శనివారం కరోనా నియంత్రణ, దళిత బంధు అమలుపై జిల్లా స్థాయి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కరోనా నియంత్రణకు మొదటి విడత డోసులు 92 శాతం, రెండో …
Read More »దళితబంధు వేగంగా అమలు చేయాలి…
కామారెడ్డి, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళితబంధు అమలును వేగవంతం చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుండి రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ నుండి ఎస్.సి. కార్పొరేషన్ ఛైర్మెన్ …
Read More »బాలరక్ష వాహనాన్ని ప్రారంభించిన మంత్రి
కామారెడ్డి, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల రక్ష వాహనాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జెండా ఊపి బాలరక్షక భవన్ వాహనాన్ని ప్రారంభించారు. సేవలు అందించేందుకు బాల రక్షక్ వాహనం అందుబాటులోకి వచ్చిందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న పిల్లలను త్వరగా కాపాడడానికి …
Read More »