కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కళాశాల స్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్, షార్ట్ ఫిలిం పోటీలు ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాలు సముదాయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇంటర్మీడియట్, డిగ్రీ ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా పోటీలు నిర్వహించే విధంగా …
Read More »27న రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలు
కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 27న మండల స్థాయిలో రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం మండల స్థాయి అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులకు సెల్ ఫోన్ ద్వారా సమాచారం అందించాలని సూచించారు. సభ్యత్వం పొందిన ఏడాది తర్వాత ఎన్నికల్లో …
Read More »ఈనెల 31 వరకు వర్చువల్ విధానమే
కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోజు రోజుకు తీవ్రమవుతున్న కరోనా దృష్ట్యా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టులలో జనవరి 31 వరకు వర్చువల్ విధానంలోనే వాదనలు కొనసాగుతాయని జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జెల బిక్షపతి తెలిపారు. ఈ మేరకు సోమవారం జరిగిన బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకుని తీర్మానించినట్లు బిక్షపతి పేర్కొన్నారు. ఇట్టి సమాచారాన్ని న్యాయమూర్తులకు తెలియజేసినట్లు ఆయన …
Read More »ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకా వేసుకోవాలి
గాంధారి, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా మహమ్మారి నుండి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ కోవిడ్ వాక్సిన్ వేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా వాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రెండు డోసుల టీకా వేసుకోవాలని సూచించారు. అదేవిదంగా …
Read More »రేపటి ప్రజావాణి రద్దు
కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కోవిడ్ కేసులు అధికంగా పెరగడం, వ్యాప్తి వేగంగా జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో చెప్పారు. జిల్లా ప్రజలు ఈ …
Read More »ఆపరేషన్ నిమిత్తం రక్తదానం
కామారెడ్డి, జనవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డికి చెందిన రాజుకు (35) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. దీంతో దోమకొండ మండల కేంద్రానికి చెందిన లక్న బత్తిని రవికుమార్‌కి తెలియజేయడంతో వెంటనే స్పందించి ఏ పాజిటివ్ రక్తం అందజేసి ప్రాణాలు కాపాడారు. గతంలో కూడా …
Read More »రైతుల పక్షాన పోరాడుతాం…
కామారెడ్డి, జనవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నివాసంలో సీనియర్ నాయకులు నిట్టు వేణుగోపాల్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైన ఎరువుల ధరలు తగ్గించే వరకు రైతుల పక్షాన టీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉండి పోరాడుతుందని, కేంద్ర ప్రభుత్వ విధానాలు మారే వరకు రైతుల పక్షాన ఉద్యమిస్తామని అన్నారు. గత …
Read More »సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 155260 నెంబర్‌కు కాల్‌చేయాలి…
కామారెడ్డి, జనవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న బిక్కనూర్ వాస్తవ్యుడు గడ్డం మల్లేష్ సైబర్ నేరాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను తెలిపారు. కామారెడ్డి జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో ఎంపీడీవో, ఏపీవోల సమావేశానికి హాజరై ఆయన మాట్లాడారు. కొత్తగా సైబర్ నేరాలు జరుగుతున్న తీరును, తీసుకోవలసిన జాగ్రత్తలను …
Read More »పిఆర్‌టియు క్యాలెండర్ ఆవిష్కరణ
కామారెడ్డి, జనవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పిఆర్‌టియు తెలంగాణ క్యాలెండర్, డైరీని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, డిఆర్‌డిఓ వెంకట మాధవ రావు, పిఆర్‌టియు తెలంగాణ జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీరాజం, రాష్ట్ర , జిల్లా బాధ్యులు ఆనంద్, యేసు రత్నం, …
Read More »కొవిడ్ పట్ల నిర్లక్ష్యం వద్దు
కామారెడ్డి, జనవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీ వోలతో ఉపాధి హామీ పనులపై జరిగిన సమీక్ష సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. పాజిటివ్ వచ్చినవారు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలన్నారు. …
Read More »