Kamareddy

కాంగ్రెస్‌లో భారీగా చేరికలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు సమయం ఉంది. ఇక ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు చక చక పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార తెరాస పార్టీకి కాస్త వ్యతిరేక పవనాలు వీస్తున్న క్రమంలో ప్రజలకు తాయిలాలు ఇవ్వడం మొదలు పెట్టారు సిఎం కేసీఆర్‌. …

Read More »

నిజాంసాగర్‌లో దళితబంధు సర్వే…

కామరెడ్డి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలో దళిత బంధు పథకం అమలు గురించి సర్వే చేపట్టడానికి అరవై బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండలంలో దళిత బందు పథకం అమలుపై గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. 60 బృందాలకు నోడల్‌ అధికారులను నియమిస్తామని చెప్పారు. అర్హులైన …

Read More »

పంటలు రుణాలు ఇచ్చేలా చూడాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు పంట రుణాలు 100 శాతం ఇచ్చే విధంగా బ్యాంక్‌ మేనేజర్లు చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం బ్యాంకు అధికారులతో రుణాల లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులకు దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాలని సూచించారు. గోదాముల నిర్మాణం, మౌలిక వసతుల …

Read More »

అవుట్‌ రీచ్‌ వర్కర్‌ కోసం ఇంటర్వ్యూలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం అవుట్‌ రీచ్‌ వర్కర్‌ నియామకం కోసం ఇంటర్వ్యూలను నిర్వహించారు. నలుగురు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి సరస్వతి, చైల్డ్‌ వెల్ఫేర్‌ చైర్మన్‌ సత్యనారాయణ రెడ్డి, జోనల్‌ జస్టిస్‌ బోర్డు సభ్యుడు రమణ పాల్గొన్నారు.

Read More »

త్యాగాలు విద్యార్థులవి.. భోగాలు కెసిఆర్‌ కుటుంబానివి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలకు కేసీఆర్‌ కుటుంబ అసమర్థ పాలనే కారణమని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాలు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జీవితాలు బాగుపడతాయని అనుకుంటే కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడిరదని, కెసిఆర్‌ కుటుంబానికి 5 ఉద్యోగాలు వస్తే, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక నోటిఫికేషన్లు లేక ఉన్నత విద్యావంతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. …

Read More »

బిటి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం భిక్కనూర్‌ మండలం జంగంపల్లి గ్రామ శివారులోని తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్‌ క్యాంపస్‌లో సుమారు 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న బిటి రోడ్డు పనులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సౌత్‌ క్యాంపస్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు.

Read More »

తెరాస కామారెడ్డి మహిళ అధ్యక్షురాలిగా అర్చన

కామరెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం కామారెడ్డి పట్టణ మహిళ టిఆర్‌ఎస్‌ అధ్యక్షురాలిగా దంతాల అర్చనని కామారెడ్డి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ నియమించారు. ఈ సందర్భంగా అర్చనకు శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేలా చూడాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగే విధంగా వైద్యులు, వైద్య సిబ్బంది చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ పాటిల్‌ అన్నారు. బుధవారం తాడ్వాయి మండలం ఎర్రపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. గర్భిణిలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ముందస్తుగా వ్యాక్సినేషన్‌ వేయించుకోవాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో …

Read More »

ఒకేపోలింగ్‌ కేంద్రంలో కుటుంబం మొత్తం పేర్లు ఉండేలా చూడాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్‌ జాబితాలో ఉన్న మృతిచెందిన వారి, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను ఈనెల 25లోగా తొలగించాలని జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మండల స్థాయి అధికారులతో మాట్లాడారు. ఒక కుటుంబం మొత్తం పేర్లు ఒకే పోలింగ్‌ కేంద్రంలో ఉండేవిధంగా చూడాలన్నారు. ఓటర్‌ల …

Read More »

వ్యాక్సినేషన్‌ వందశాతం పూర్తిచేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రిని బుధవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. క్యాన్సర్‌, థైరాయిడ్‌, డయాలసిస్‌ వంటి వ్యాధులు ఉన్నవారు ముందస్తుగా వ్యాక్సినేషన్‌ వేయించుకోవాలని సూచించారు. పిల్లల వార్డును సందర్శించారు. వ్యాక్సినేషన్‌ 100 శాతం పూర్తి చేయాలని వైద్యులకు సూచించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని హరిప్రియ రైస్‌ మిల్లును సందర్శించారు. లక్ష్యానికి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »