కామారెడ్డి, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి రైతు వేదికలో మంగళవారం యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు రైస్ మిల్లు యజమానులతో ఒప్పందం చేసుకొని వరి …
Read More »పాఠశాలకు రాలేదు.. సెలవు పెట్టలేదు…
కామారెడ్డి, డిసెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి మండలం రంగంపేట్ గ్రామంలో ఎంపిపి నారెడ్డి దశరథరెడ్డి మంగళవారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సర్పంచ్ శ్యామగౌడ్‌తో కలిసి పరిశీలించారు. విద్యార్థుల సంఖ్య చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. మెరుగైన విద్య అందించాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు పాఠశాలకు రాలేదు. సెలవు కుడా పెట్టలేదు. హాజరు పట్టిక చూసి అక్కడ వున్న టీచర్‌ను మీరు ఏంచేస్తున్నారు, ఆబ్సెంట్ లేదా లీవ్ …
Read More »హరితహారం లక్ష్యాలను పూర్తిచేయాలి…
కామారెడ్డి, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారం లక్ష్యాలను అన్ని శాఖల అధికారులు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా అధికారులతో హరితహారం పై సమీక్ష నిర్వహించారు. 2022 లో శాఖల వారీగా నాటే మొక్కల లక్ష్యాలను నిర్ణయించారు. ఉపాధి హామీ అధికారులు ఇరవై ఐదు లక్షల మొక్కలు నాటాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, వసతి …
Read More »ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి
కామారెడ్డి, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో ఏవో రవీందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read More »పరిహారం ఇప్పించడానికి కృషిచేస్తా
కామారెడ్డి, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో భూములు కోల్పోయిన రైతులకు భూములు, పరిహారం ఇప్పించడానికి కృషి చేస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం భూములు కోల్పోతున్న రైతులతో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ సమావేశం నిర్వహించారు. రైతులకు న్యాయం చేస్తానని చెప్పారు. మధ్యవర్తుల మాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఉద్యోగాలు …
Read More »అర్హులందరికి వ్యాక్సిన్ అందించాలి…
కామారెడ్డి, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని 28, 29 వార్డులోని కరోనా వ్యాక్సినేషన్ ప్రత్యేక శిబిరాలను సోమవారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే పరిశీలించారు. త్వరితగతిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని వైద్యులను ఆదేశించారు. కరోనా వ్యాక్సినేషన్ వేసుకొని వారిని గుర్తించి అర్హులందరికీ వ్యాక్సినేషన్ వేసే విధంగా చూడాలని కోరారు.
Read More »కామారెడ్డిలో అంబేద్కర్ వర్ధంతి
కామారెడ్డి, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంటరానితనం, వివక్షతలపై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, భారతరత్న బిరుదు …
Read More »నిరాహార దీక్షకు టిఎన్‌ఎస్‌ఎఫ్ మద్దతు
కామారెడ్డి, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో గత 3 రోజులుగా రిలే దీక్ష చేస్తున్న పీహెచ్‌డి స్కాలర్ గణేష్ దీక్షకు సోమవారం టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, బీసీ విద్యార్థి సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు తమ సంఫీుభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు బాలు, నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అడుగడుగున అన్యాయమే …
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన 13 మందికి సీఎం సహాయనిది నుండి 11 లక్షల 7 వేల 2,00 రూపాయల చెక్కులు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సోమవారం పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1057 మందికి 6 కోట్ల 62 లక్షల 54 వేల 3 వందల రూపాయలు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు.
Read More »ఉప్పల్వాయిలో అంబేద్కర్ వర్ధంతి
కామారెడ్డి, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉప్పల్వాయి గ్రామంలో అంబేద్కర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉప్పల్వాయి గ్రామ సర్పంచ్ కొతొల గంగారం, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు గురజాల నారాయణరెడ్డి, వీడిసి చైర్మన్ పల్లె నరసింహులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి, మానవ హక్కుల నిర్మాత ఓటు హక్కు కల్పించిన, …
Read More »