Kamareddy

సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్‌ రామ్‌ వర్ధంతి

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం పక్కన గల మిస్టర్‌ టీ పాయింట్‌ హోటల్‌లో అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్‌ బాబు జగ్జీవన్‌ రామ్‌ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు మాట్లాడుతూ బాబు …

Read More »

కామారెడ్డిలో శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ జయంతి

కామారెడ్డి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో డాక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ జయంతి సందర్భంగా మహనీయుని చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార మాట్లాడుతూ స్వతంత్ర భారత దేశంలో జాతీయవాద రాజకీయాలకు నాంది పలికిన మహానేత శ్యాంప్రసాద్‌ ముఖర్జీ అని, 1934లో 33 ఏళ్ల చిన్న …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం యువకుని రక్తదానం

కామారెడ్డి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో ఎల్లవ్వ (50) వృద్ధురాలికి ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కామారెడ్డికి చెందిన నాగసాయి సహకారంతో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడినట్టు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు రక్తం అవసరమైనప్పుడు తమను సంప్రదించాలని, కుటుంబ సభ్యులు …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలను ఇప్పుడు చూస్తున్నాం..

కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రైతాంగం రెండు పంటలు పండిరచడానికి సాగునీటి కోసం ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. సోమవారం రాష్ట్ర శాసన సభాపతి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి కలిసి నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుండి వర్షాకాలం సాగు కోసం నీటిని విడుదల చేశారు. ఈ …

Read More »

జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలి

కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రహదారి 44 కు ఇరువైపుల మొక్కలను నాటే కార్యక్రమాన్ని ఈనెల 7వ తేది నుంచి 10 వ తేది వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం అటవి, మున్సిపల్‌, పంచాయతీ అధికారులతో మొక్కలు నాటే కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటి టీ …

Read More »

న్యాయవాదులకు హెల్త్‌ కార్డుల పంపిణీ

కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి న్యాయవాదులకు సోమవారం జిల్లా కోర్టులోని బార్‌ అసోసియేషన్‌లో అధ్యక్షులు గజ్జల బిక్షపతి హెల్త్‌ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయవాదులకు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు రెండు లక్షల రూపాయల వరకూ హెల్త్‌ కార్డుల ద్వారా చికిత్సలు పొందవచ్చునని ఆయన తెలిపారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు గంగాధర్‌, ప్రధాన కార్యదర్శి …

Read More »

భిక్కనూరు నూతన తహసీల్దార్‌కు సన్మానం

కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం కామారెడ్డి జిల్లా బిక్నూర్‌ మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో నూతనంగా బదిలీపై వచ్చిన తహసీల్దార్‌ నర్సింలును అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో నర్సింలు మాట్లాడుతూ రైతులకు రెవెన్యూ సంబంధించి ఎలాంటి సమస్యలున్నా ఎమ్మార్వో కార్యాలయంలో సంప్రదించాలన్నారు. రైతుల సమస్యలు భవిష్యత్తులో ఉండకూడదని, …

Read More »

అందరి సహకారంతోనే పల్లె ప్రగతి

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రణాళికాబద్ధంగా పల్లె ప్రగతి కార్యక్రమం అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. ఆదివారం కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో శ్రమదానం కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. గ్రామస్తులు శ్రమదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, అందరి సహకారం ఉంటేనే పల్లె ప్రగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రోడ్లను పరిశుభ్రంగా …

Read More »

సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద వర్ధంతి

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం కామారెడ్డి జిల్లా బిక్నూర్‌ మండల కేంద్రంలో స్వామి వివేకానంద, దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సమీపంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు మాట్లాడుతూ స్వామి వివేకానంద పూర్వ నామం ‘నరేంద్ర …

Read More »

అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌ జిల్లాలోని దంతెపల్లి గ్రామానికి చెందిన అనురాధ (27) గర్భిణీకి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్‌ నిమిత్తమై బి నెగిటివ్‌ రక్తం లభించకపోవడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీధర్‌ గౌడ్‌ సహకారంతో బి నెగిటివ్‌ రక్తాన్ని సకాలంలో అందజేసి ఆపరేషన్‌ పూర్తి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »