కామారెడ్డి, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్‌లో జరిగిన స్టేట్ సీనియర్ ఇంటర్ జిల్లాల రగ్బీ టోర్నమెంట్‌లో కామారెడ్డి జిల్లా బాలికల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. బాలుర విభాగంలో నాలుగో స్థానంలో నిలిచారు. సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ క్రీడాకారులను అభినందించారు. రాష్ట్రస్థాయిలో కామారెడ్డి జిల్లాకు గుర్తింపు తేవడం అభినందనీయమని కొనియాడారు.
Read More »పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి…
కామారెడ్డి, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం ఆయన క్యాంప్ కార్యాలయం నుంచి టెలీ కాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడారు. ఈ నెల 25 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణ సమయంలో జిరాక్స్ …
Read More »వంద శాతం వ్యాక్సినేషన్ చేయించాలి…
కామారెడ్డి, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఆరోగ్య, ఆశ, అంగన్‌వాడి కార్యకర్తలు గ్రామాల్లో క్షేత్ర పర్యటన చేపట్టి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని కోరారు. అర్హత గల అసంఘటిత రంగ …
Read More »రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి
కామారెడ్డి, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి కేంద్రంలో ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకొని కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు తెలిపారు. కరోణ వ్యాక్సినేషన్ కారణంగా రక్త నిల్వలు లేకపోవడం వల్ల రక్తదాన కేంద్రాల్లో ఆపదలో ఉన్నవారికి రక్తం లభించక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని, కావున యువకులందరూ మంగళవారం …
Read More »మాస్ కాపీయింగ్‌కు సిద్ధమవుతున్న కాలేజీలు…
కామారెడ్డి, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు 25తేది నుండి ప్రారంభం కాబోతున్న సందర్భంగా జిల్లాలోని కొన్ని ప్రవేటు కళాశాలలు మాస్ కాపీయింగ్ ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్న విషయం ఏబివిపి దృష్టికి వచ్చిందని కాగా కామారెడ్డి జిల్లా కన్వినర్ బాను ప్రసాద్ అధ్వర్యంలో సోమవారం నోడల్ అఫీసర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఎబివిపి నాయకులు మాట్లాడుతు కొన్ని కళాశాలలు …
Read More »కామారెడ్డి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా స్వాతి
కామారెడ్డి, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వికారాబాద్ జిల్లా చేవెళ్ల నుంచి బదిలీపై వచ్చిన కామారెడ్డి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం ఏం స్వాతికి కామారెడ్డి బార్ అసోసియేషన్ సోమవారం స్వాగతం పలికింది. ఈ మేరకు పదవీ బాధ్యతలు చేపట్టిన జడ్జికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జెల బిక్షపతి కోర్టు చాంబర్‌లో పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. బార్ అసోసియేషన్ సంపూర్ణ సహకారం ఉంటుందని …
Read More »బిజెపిలో చేరిన యాడారం యువకులు
దోమకొండ, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపీట్ మండలం యాడారం గ్రామానికి సంబంధించిన 28 మంది యువకులు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. గ్రామంలో రమణారెడ్డికి స్వాగతం పలికిన కార్యకర్తలు పెద్దమ్మ గుడిలో పూజల అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ పని చేసే …
Read More »ప్రభుత్వ విప్‌కు దసరా శుభాకాంక్షలు
కామారెడ్డి, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విజయదశమి సందర్భంగా కామారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదులు ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను మర్యాదపూర్వకంగా శనివారం ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను కలిసి వారిలో కామారెడ్డి అదనపు జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జెల బిక్షపతి ముదిరాజ్, ఉపాధ్యక్షులు జోగుల గంగాధర్, జిపి నరేందర్ రెడ్డి, పిపి దామోదర్ రెడ్డి తదితరులు …
Read More »లింబాద్రి నర్సింహస్వామిని దర్శించుకున్న సినీ నిర్మాత
భీమ్‌గల్, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ లింబాద్రి లక్ష్మీ నృసింహ స్వామి లింబాద్రి గుట్టకి శనివారం రోజు భక్తులు పోటెత్తారు. ఉదయం 6 గంటల నుండి భక్తుల తాకిడి ఉంది. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ తెలుగు సినీ పరిశ్రమల నిర్మాత దిల్ రాజు స్వామి వారిని దర్శించుకున్నారు. వారిని మర్యాద పూర్వకంగా శాలువా కప్పి …
Read More »అంబులెన్స్‌లో ప్రసవం, తల్లి, బిడ్డ క్షేమం
కామారెడ్డి, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని లింగంపెట మండలం, రామయిపల్లి తండాకు చెందిన వనితకు పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్ సేవల కోసం ఫోను చేయగా .. దేవశోత్ వనిత (18) ని, లింగంపేట (పి హెచ్ సి.) ప్రభుత్వ ఆసుపత్రి నుండి రిఫర్ చేయడంతో.. కామారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమెకి పురిటి నొప్పులు అధికం అయ్యాయి. దీంతో అంబులెన్స్‌లో సుఖ …
Read More »