Kamareddy

కామారెడ్డిలో డాక్టర్స్‌ డే

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్స్‌ డే పురస్కరించుకొని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ కామారెడ్డి జిల్లా పక్షాన బుధవారం కలెక్టరేట్‌ సమావేశ హాలులో కామారెడ్డి జిల్లా కు చెందిన 31 మంది వైద్యాధికారులను ఘనంగా సన్మానించారు. ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రాజన్న, డిప్యూటీ డిఎంఅండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ శోభ వైద్యాధికారులను సన్మానించారు. అధికారుల నెలవారి …

Read More »

ఆరునెలలు సస్పెన్షన్‌ కాలం పొడిగింపు

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెద్ద కొడప్గల్‌ మండలం చిన్న తక్కడపల్లి గ్రామ పంచాయితీ సర్పంచ్‌ దేవుబాయి, ఉప సర్పంచ్‌ సంతకం లేకుండా నిధులు డ్రా చేసిన విషయంలో సర్పంచ్‌ పదవి నుండి గతంలో తాత్కాలికంగా ఆరు మాసాలపాటు సస్పెండ్‌ చేయడం జరిగిందని, సస్పెన్షన్‌ కాలం ముగిసినందున మరొక ఆరు మాసములు సెప్టెంబర్‌ 22 వరకు సస్పెన్షన్‌ కాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ …

Read More »

జూలై 15 వరకు కోర్టులలో వర్చువల్‌ విధానమే

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కక్షిదారులు, న్యాయవాదులు, జుడిషియల్‌ ఉద్యోగుల శ్రేయస్సు దృష్ట్యా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టులలో జూలై 15 వరకు వర్చువల్‌ విధానంలోనే వాదనలు కొనసాగుతాయని జిల్లా కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గజ్జల బిక్షపతి తెలిపారు. బుధవారం బార్‌ అసోసియేషన్‌ హాల్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ కరోనా వేరియంట్లు దృష్ట్యా న్యాయవాదుల అభిప్రాయాలు స్వీకరించి నిర్ణయం తీసుకున్నట్లు …

Read More »

పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి

కామారెడ్డి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ భిక్నుర్‌ మండల నూతన కార్యవర్గ సమావేశం పట్టణంలోని పద్మశాలి ఫక్షన్‌ హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార మాట్లాడుతూ పార్టీని బూత్‌ స్థాయిలో నిర్మాణం చేయాల్సిన అవసరముందని కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పోకడలను ప్రజలకు తెలియజేయాలన్నారు. అహర్నిశలు పార్టీ కోసం నిస్వార్థంగా పని …

Read More »

బిజెవైఎం కార్యకర్తల అరెస్ట్‌

కామారెడ్డి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను భారతీయ జనతా యువమోర్చా నాయకులు ముట్టడిరచారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బంగ్లా చైతన్య గౌడ్‌ మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణాలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం పూటకో మాట …

Read More »

సిఎం కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి

కామారెడ్డి, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మీడియా కో చైర్మన్‌ విశ్వనాధుల మహేష్‌ గుప్తా, కామారెడ్డి మున్సిపల్‌ కౌన్సిల్‌ ఫ్లోర్‌ లీడర్‌ మోటూరి శ్రీకాంత్‌ గుప్తా, బాలు మాట్లాడారు. వాసాలమర్రి గ్రామంలో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలోని ఆర్యవైశ్యులను సావుకారి గాడు అని, ఐదు రూపాయల వడ్డీ తీసుకొని ఇబ్బందులకు …

Read More »

రక్తదానం చేసిన అధ్యాపకుడు

కామారెడ్డి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రజిత గర్భిణీకి ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్త దాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కాగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో గల బ్లడ్‌ బ్యాంకులో ఎస్‌.ఆర్‌.కె కళాశాలకు చెందిన చరిత్ర అధ్యాపకుడు మురళి 15వ సారి రక్తదానం …

Read More »

విజయ డైరీ డిప్యూటీ డైరెక్టర్‌గా ప్రవీణ్‌ కుమార్‌

కామారెడ్డి, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి విజయ డైరీ డిప్యూటీ డైరెక్టర్‌గా ప్రవీణ్‌ కుమార్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఇక్కడ ఇంత వరకు పనిచేసిన డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ బదిలీపై విజయ డైరీ హైదరాబాద్‌ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి కార్యాలయంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న ప్రవీణ్‌ కుమార్‌ బదిలీపై కామారెడ్డికి …

Read More »

రైతు సమస్యలపై కిసాన్‌మోర్చా వినతి

కామారెడ్డి, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భారతీయ కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. రైతులకు బ్యాంకు రుణాలు వెంటనే మాఫీ చేయాలని, నకిలీ, నాసిరకం విత్తనాలు అరికట్టాలని, అన్ని రకాల నాణ్యమైన విత్తనాలు రైతులకు సబ్సిడీపై సకాలంలో అందించాలని, రైతులకు ఎరువులు ఉచితంగా అందించాలని, వరి ధాన్యం విక్రయించిన రైతుల డబ్బులు వెంటనే రైతుల బ్యాంకు ఖాతాలో …

Read More »

పలు శాఖలను ప్రారంభించిన కలెక్టర్‌

కామారెడ్డి, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నూతన కలెక్టరేట్‌ సముదాయంలోని పలు శాఖల కార్యాలయాలను గురువారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ ప్రారంభించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, లీడ్‌ బ్యాంక్‌, జిల్లా పరిశ్రమల శాఖ, జిల్లా వెనుకబడిన కులాల అభివృద్ధి శాఖ, జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. ఉద్యోగులు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందే విధంగా అంకితభావంతో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »