కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కేంద్రానికి గతంలో సీఎం ఇచ్చిన మాట ప్రకారం మెడికల్ కళాశాలను, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, బి.ఎడ్ కళాశాలల ఏర్పాటు చేయాలనీ కోరుతూ బుధవారం పెద్దపల్లి పర్యటనకు బయల్దేరిన కేసీఆర్ కాన్వాయ్ ముందు నిరసన తెలియజేయడానికి దక్షిణ ప్రాంగణం ముందు ప్రయత్నం చేసిన విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో కేసీఆర్ …
Read More »ఎంపిడివోకు సన్మానం
కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బుధవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా నియామకమైన రామారెడ్డి ఎంపీడీవో విజయ్ కుమార్ ని ఘనంగా సన్మానించినట్టు రామారెడ్డి మండలాధ్యక్షులు లక్కాకుల నరేష్ అన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని, …
Read More »పర్యావరణ సంరక్షణ ప్రతి ఒక్కరి ధ్యేయం కావాలి
కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి ధ్యేయం కావాలని, తద్వారా అందరికీ ప్రాణవాయువు అందుతుందని కామారెడ్డి జిల్లా న్యాయమూర్తి బత్తుల సత్తయ్య అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం ఆయన కామారెడ్డి కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు. కామారెడ్డి లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సత్తయ్య మాట్లాడుతూ న్యాయవాదులు ప్రతి సందర్భంలో మొక్కలు …
Read More »విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టులు అప్రజాస్వామికం
కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బుధవారం సీఎం పర్యటనలో భాగంగా కామారెడ్డి జిల్లా కు మెడికల్ కళాశాలను, విద్యాసంస్థలను కేటాయించాలని కోరుతూ నిరసన తెలియజేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు బాలు, లక్ష్మణ్, సంతోష్ గౌడ్ లను అరెస్టు చేయడం అప్రజాస్వామ్యమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. సీఎం గతంలోనే 2018 ఎన్నికల్లో నూతనంగా మెడికల్ కళాశాలను కామారెడ్డి పర్యటనకు వచ్చినప్పుడు …
Read More »తహసీల్ కార్యాలయం ముందు పురుగుల మందు తాగిన తండ్రి, కొడుకు
కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా బిక్కనుర్ మండలం కంచర్ల గ్రామానికి ఇద్దరు రైతులు తండ్రి, కొడుకు తహాసిల్దార్ కార్యాలయము వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన స్థానికులు వెంటనే కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రష్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నారు.
Read More »బిజెపి ఆధ్వర్యంలో వ్యాక్సిన్ కేంద్రాల పరిశీలన
కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేపీ కామారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మున్సిపల్ కార్యాలయం వద్ద గల వ్యాక్సినేషన్ కేంద్రాలను సందర్శించారు. అక్కడ సమస్యల గురించి, వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరు గురించి ప్రజలను, ఆరోగ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కుంటా …
Read More »పెళ్లికి ఆర్థిక సహాయం
రామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః పెళ్లికి ఆర్థిక సహయం చేసినట్లు పదవతరగతి పూర్వ విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా సందర్భంగా వారు మాట్లాడుతూ, పెళ్లి కుమారుడు రాజశేఖర్ నిరుపేద కుటుంబం అయినందున 1999-2000 బ్యాచ్ కు చెందిన పదవతరగతి మిత్రులు విరాళాలు సేకరించి పదహారు వేల ఐదు వందలు నగదు సహయం అంధజేశామని చెప్పారు. ఇదే గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ యూత్ సభ్యులు పదహారు …
Read More »అడగగానే ఆక్సీజన్…
కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మంగళవారం షబ్బీర్ అలీ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భిక్కనూరు మండలం లోని గుర్జకుంట గ్రామానికి చెందిన దాసరి బాలకృష్ణకు ఆక్సీజన్ అందజేశారు. బాలకృష్ణ కరోనా వ్యాధితో బాధపడుతూ దవాఖాన లో చేరగా చికిత్స తర్వాత, డాక్టర్ సలహా మేరకు, ఆక్సిజన్ అవసరమని ఆయన కుటుంబ సభ్యులు మహ్మద్ అలీ షబ్బీర్ కి ఫోన్ చేశారు. షబ్బీర్ అలీ వెంటనే …
Read More »మానవ జీవితానికి సార్ధకత సేవా మార్గమే
కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వి. టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంకు లో మంగళవారం తాడ్వాయి మండలం కన్కల్ గ్రామానికి చెందిన హరిప్రసాద్ 23 వ సారి తన జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు మాట్లాడుతూ హరి ప్రసాద్ సహాయ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేయడమే …
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి నియోజకవర్గంలోని 70 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 24 లక్షల 15 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 735 మందికి 4 కోట్ల 57 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేయడం …
Read More »