కామారెడ్డి, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హెయిర్ కటింగ్ సెలూన్లు, దోబీ ఘాట్‌లు, లాండ్రీ షాపులకు ప్రభుత్వం కల్పించిన ఉచిత విద్యుత్తు పథకంలో రజక, నాయి బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన లబ్దిదారులు అందరూ లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్లో నాయి బ్రాహ్మణ, రజక కమ్యూనిటీలు నిర్వహిస్తున్న హెయిర్ కటింగ్ సెలూన్లు, దోబీ ఘాట్ …
Read More »అంబులెన్స్‌లో ప్రసవం
కామారెడ్డి, జూలై 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిలో గల గుమాస్తా కాలనీలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన యశ్మీన్ కుటుంబం గత కొన్ని రోజులుగా నివాసం ఉంటున్నారు. అయితే ఆమెకి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు ఫోను చేశారు. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని, తక్షణమే యాష్మీన్ (28) ని ఆసుపత్రికి తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికం అవడంతో, మార్గ మధ్యలో (రామారెడ్డి రోడ్డు లో) అంబులెన్స్‌లో …
Read More »డిపిఎంకు మెమో…
కామారెడ్డి, జూలై 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆగస్టు 8 తేదీ లోగా మహిళా సంఘాలకు 40 శాతం రుణాలు మంజూరు చేయాలని, స్త్రీ నిధి ద్వారా పాడి గేదెల రుణ సౌకర్యం కోసం మహిళా లబ్ధిదారులను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఎ.శరత్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జరిగిన స్వయం సహాయక సంఘాలు, మెప్మా, స్త్రీ నిధి ఋణాల మంజూరుపై అధికారులతో ఆయన మండలాల …
Read More »ఏడాదిలోపు పంట రుణాలు చెల్లించిన రైతులకు పావలా వడ్డీ వర్తిస్తుంది
కామారెడ్డి, జూలై 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులకు వానకాలం పంట రుణాల లక్ష్యాన్ని వ్యవసాయ అధికారులు ఇప్పించి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. గురువారం తన ఛాంబర్‌లో వ్యవసాయ అధికారులతో పంటల సాగు వివరాలు, ఎరువుల లభ్యత, పంట రుణాల లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 10 లోగా 50 శాతం పంట రుణాలను రైతులకు ఇప్పించే విధంగా వ్యవసాయ అధికారులు చూడాలని …
Read More »ఎక్కువ వరుసలో మొక్కలు నాటాలి
కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రధాన రోడ్డుకిరువైపులా ఎక్కువ వరుసలలో మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 10 లోగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డుకిరువైపులా నాటిన మొక్కలు సజావుగా పెరిగే విధంగా చూడాలన్నారు. రైతుల పొలాలు …
Read More »సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం వర్ధంతి
కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం పక్కన గల మిస్టర్ టీ పాయింట్ హోటల్‌లో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు మాట్లాడుతూ …
Read More »పేదల కడుపు నింపే యజ్ఞానికి శ్రీకారం
కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేదల పక్షపాతిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ విప్, కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ అన్నారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో కామారెడ్డి నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కెసిఆర్ కిట్టు ద్వారా ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం చేయించుకున్న మహిళలకు ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగ పిల్లవాడు పుడితే …
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజికవర్గంలోని 25 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 22 లక్షల 16 వేల రూపాయల చెక్కులను, టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామానికి చెందిన అల్లే బాల్‌రాజు, రామారెడ్డి మండలం మద్ది కుంట గ్రామానికి చెందిన రేకులపల్లి మహిపాల్ రెడ్డిలు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి నామినీలు అల్లే సావిత్రి, …
Read More »కరోనా నుండి కాపాడేది వ్యాక్సిన్…
కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధాని మోదీ అందిస్తున్న కోవిడ్ ఉచిత వాక్సినేషన్‌ను సందర్శించి వైద్యులతో వ్యాక్సినేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ వ్యాక్సిన్ కరోనా రాకుండా కాపాడే రక్షణ …
Read More »కళ్యాణలక్ష్మి, షాదిముభారక్ చెక్కుల పంపిణీ
కామారెడ్డి, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని 341 మందికి 3 కోట్ల 41 లక్షల 39 వేల 556 రూపాయల కల్యాణలక్ష్మి, షాది ముభారాక్ చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 5,196 మందికి 51 కోట్ల 62 లక్షల 70 వేల 416 …
Read More »